స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు..
-x-x-x-
16
అంతే… శంకరి అత్తా, పిన్నీ ఇద్దరూ నన్ను దోమలు కుడుతున్నాయ్ అనుకుని, మస్కిటో కాయిల్స్ వెలిగించడంలో పోటీ పడసాగారు. అమ్మమ్మ మాత్రం మొత్తం అర్థం అయ్యినట్టు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నన్ను జోకొట్టసాగింది. తనకి మ్యాటర్ అర్థం అయిపోయింది అనుకుంటా.. మొత్తానికి కాయిల్స్ వెలిగించి నా కాళ్లదగ్గరోటీ, తల దగ్గరోటీ పెట్టాక, అమ్మమ్మ పిన్నితో “ఇంతకీ నువ్వెందుకు పరిగెడుతూ వచ్చావో చెప్పలేదు?” అంటూ అడిగింది.
భ్రమర పిన్ని నీళ్లు నములుతూ “అదీ.. దొడ్డమ్మా అదీ.. అతి కష్టమ్మీద కుసుమక్క ఒక వారం లీవ్ ఇచ్చింది దొడ్డమ్మా. ఇప్పుడు ఇక్కడే 15 రోజులు ఉండాలీ అంటే అక్క నన్ను చంపేస్తుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి దొడ్డమ్మా.. అసలే అక్క ఛండశాసనురాలు. నీ మాట తప్ప ఇంకెవ్వరి మాటా వినదు తెలుసు కదా? ప్లీజ్ ప్లీజ్.. ఎదో ఒకటి చెయ్యవే తల్లీ.. నీకు పుణ్యముంటుంది. మేము ముగ్గురమూ ఈ మధ్యకాలంలో ఒకే చోట కలిసి ఉన్నదే లేదు. ఇప్పుడు మళ్లీ చిన్నప్పటిలాగా ముగ్గురమూ రోజూ వేటకి వెళ్లొచ్చు ప్లీజ్” అంటూ బ్రతిమలాడసాగింది.
ఈ విషయం మాత్రం కరెక్ట్. అమ్మ ఛండశాసనురాలే. రూల్ అంటే రూలే. ఒక్కసారి ఒక మాట అన్నతరువాత అందులో ఎటువంటి మార్పూ ఉండదూ ఉండకూడదూ.
అమ్మమ్మ “ఆ మాత్రం దానికి ఏదో కొండలు బ్రద్దలైపోయినట్టు అరుచుకుంటూ రావాలా? రేప్పొద్దున్నే మాట్లాడతాలే. నేనూ ముందర వారం రోజులు అని చెప్పే చిన్న దొరవారిని తీసుకొచ్చా. ఇప్పుడు 15/20 రోజులూ అంటే నామీద కూడా అరుస్తుంది. కానీ తప్పదు ఏం చేస్తాం? పరిస్థితి అలాంటిది. ఫారెస్టు వాళ్లతో పాటు స్పెషల్ ఆఫీసర్లూ వస్తున్నారు రేపు పొద్దున్నే. రేపెక్కడికీ ప్రోగ్రాం పెట్టుకోకండి” అంటూ హెచ్చరించింది.
ఆ మాట విన్న శంకరి అత్త, “అయితే మీరు గుడికి ఉదయాన్నే వెళ్లట్లేదా?” అని అడిగింది.
అమ్మమ్మ : “ఉదయం కాదే పిల్లా.. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరుతాం”
Related Articles
Minor Raja Part 173 | Telugu Srungara Kathalu
6 hours ago
Minor Raja Part 172 | Telugu Srungara Kathalu
18 hours ago
Minor Raja Part 171 | Telugu Srungara Kathalu
1 day ago
Minor Raja Part 170 | Telugu Srungara Kathalu
2 days ago
శంకరి అత్త : “మరి మీరు ఉదయమే అన్నారు ఇందాక?”
అమ్మమ్మ : “అబ్బా.. ఏదో పొరబాటున అని ఉంటాలేవే? నా కూతురిలా విసిగించకు.. పడుకో ఇంక. టైం ఎంతయ్యిందో చూశావా? మూడవుతోంది. పడుకో ఇంక.”
భ్రమర పిన్ని : “పడుకున్నా పడుకోకున్నా, నేను నిన్ను ఆరింటికే లేపేస్తా దొడ్డమ్మా.. కుసుమక్క మూడు …