స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
-x-x-x-
177
తరువాత మాకసలు టైం తెలియలేదు. అందరమూ వరస పనులతో బిజీ అయిపోయాం.. గుడి దగ్గర అన్నీ రెడీ చేశారూ అని పిలుపు వచ్చాక, నేనూ-నాన్నా ఇద్దరమూ నల్ల పంచెలు కట్టుకుని, నల్ల కండువాలు భుజమ్మీద వేసుకుని ముందు నడుస్తూండగా, మా వెనకాలే దేవీ, అమ్మమ్మా ఇద్దరూ నల్ల చీరలు ట్రైబల్ స్టయిల్లో జాకెట్లు లేకుండా కట్టుకుని జుట్లు విరబోసుకుని మరీ వచ్చారు. దేవి మొహాన నిమ్మకాయ సైజులో ఎర్ర కుంకుమబొట్టు ఉంది. అమ్మమ్మ నుదిటన ఆంజనేయస్వామి బొట్టు నూనెలో కలిపి పెట్టుకుంది.
మేము బలి దగ్గరకి వెళ్లేసరికి, తిమ్మడు మామ బలి ఖడ్గాన్ని వెంట్రుకని కూడా చీల్చేంత పదునుగా సాన బెట్టి ఉంచాడు. ఇదివరకటి బలి ఉత్సవాల్లానే, ఇది కూడా వయొలెంట్ గానే సాగింది. ముందర అమ్మమ్మ వచ్చి బలి పశువులకి దేవితో కలిసి హారతి ఇచ్చి పూజలు చేసింది. తరువాత వాటిని బలిస్తున్నందుకు క్షమించమని వాటి గిట్టలు తాకి దణ్ణం పెట్టుకుని, రంగా మామకి సైగ చేసింది. రంగా మామ కంచు కంఠంతో మంత్రాలు మొదలెట్టాడు. తను ఓ స్పెసిఫిక్ మంత్రం చదువుతూండగా, అమ్మమ్మ మొహంలో ఓ రౌద్రం కనిపించింది.
ఆ తర్వాత 4/5 మంత్రాలకే, అమ్మమ్మ కళ్లు ఎరుపెక్కిపోయి, తన తెల్లబడుతున్న జుట్టుని విరబోసుకుని ఉందేమో? ఆ నల్ల చీరలో ఓ జీభూతంలా మా కళ్లకి కనిపించసాగింది. అమ్మమ్మకి ఈ బలి మంత్రాలు బాగా వచ్చు అనుకుంటా… తరవాత మంత్రాలేంటో ఊహించేసి, కత్తి పట్టుకుని వేటు వెయ్యడానికి రెడీ అయిపోయింది. గూడెంలో ఉన్న పిల్లా పీచూ, ముతకా ముసలీ అందరూ గుడి దగ్గరే చేరిపోయారు. అమ్మమ్మ బలి అంటే స్పెషల్ అంట.
ఇంతవరకూ అమ్మమ్మ వేసిన వేటుల్లో ఒక్క వేట కూడా గురి తప్పలేదంట. బలి జీవం తల తెగిపడుతూనే, ఆ రక్తం ఓ ఫౌంటెయిన్లా మా గ్రామ దేవతని అభిషేకిస్తూ, తల తిన్నగా అమ్మవారి పాదాల దగ్గర పడుతుంది అంట. 100% గురి అంట. ఆ సన్నివేశం చూడడానికే మొత్తం అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. టైం రానే వచ్చింది. అమ్మమ్మ “కో… బలీఁ…” అని తన కంచు కంఠంతో గూడెం మొత్తం మారు మ్రోగిపోయేలా అరుస్తూ, ఖస్సున ఒకటే వేటు వేసింది. గూడెంలో ముసలోళ్లు అందరూ చెప్పిన దాంట్లో ఆవ్వగింజ అంత కూడా వత్యాసం లేదు.
దీనంగా అమ్మమ్మ వైపే చూస్తూ ఉన్న దున్న మెడ మీద వేటు పడడమూ, ఆ దున్న తల దాని శరీరం నుంచి క్షణాల్లో వేరయ్యి, రక్తం విరజిమ్ముతూ గాల్లోకి లేవడమూ, గాల్లో ఫుట్బాల్లా ఆ తల గింగిరాలు తిరుగుతూ గుడి గడపనీ, ద్వారాలనీ చిమ్ముతున్న రక్తంతో తడిపేస్తూ అమ్మవారి ఒళ్ళో పడి కిందకి దొర్లుతూ విగ్రహం కాళ్ల దగ్గర ఆగడం అంతా మూడే మూడు సెకండ్లలో అయిపోయింది.
వెంటనే, బలి పశువు వెనకాలే సిద్ధంగా ఉన్న తిమ్మడు …