స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
-x-x-x-
172
నేను అమ్మ వైపు ఓ లుక్ ఇచ్చి, నవ్వుతూ, “గురి నా మీద కాదు! ఆ వెధవల మీద పెట్టమ్మా..” అంటూ రైఫిల్ మజిల్ వెనక్కి లాగి, ఇంకో బుల్లెట్ ఫైర్ చేశా. గోడ మీద నుంచి దిగుతున్న ఇంకోడు ఢామ్మంటూ కింద పడ్డాడు. రెండో బుల్లెట్ దెబ్బకి అమ్మ తేరుకుని, తనూ గురి చూస్తూ ఫైర్ చేసింది. ఒకడి కాలికి తగిలి వాడు అరుస్తూ కింద పడడం నాకు నా వ్యూ ఫైండర్లో కనిపించింది. అమ్మ గురి పర్లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఛండాలంగా ఏమీ లేదు అనుకుంటూ నేను, వాడు కింద పడగానే, వాడి తలకి ఎయిం చేసి ట్రిగ్గర్ నొక్కా. కింద పడ్డ వాడు మళ్ళీ లేవలేదు.
అమ్మా-నేనూ ఇద్దరమూ ఓ రిథంలో ఫైర్ చేస్తూ పోయాం. అమ్మ మనస్సు నా అంతలా బండ బారిపోలేదనుకుంటా; అమ్మ కాళ్ల మీదో చేతులమీదో కాలుస్తూ ఉంది. నేను నా కోటాతో పాటు, అమ్మ గాయపరిచిన వాళ్లని కూడా లేపేస్తూ పోయా. కాసేపటికి మా ఇద్దరి దగ్గరా ఉన్న బుల్లెట్స్ అన్నీ అయిపోయాయి. ఇద్దరమూ చేరో విల్లూ తీసుకుని కాసేపు బాణాలు వేశాము. అవీ అయిపోయాయి. అవతల వాళ్లూ మేమున్న వైపు కాల్చారు కానీ, అవి అంత దూరం రాలేదు.
బుల్లెట్లూ బాణాలూ అయిపోయాక, నేను, “నువ్వూ రెస్ట్ తీసుకో అమ్మా! వాళ్లు చూసుకుంటారులే. అమ్మమ్మ ఆ యం-134 దొబ్బేసిందిగా? అది మొదలెడితే చాలు. నిముషానికి 60 నుంచి 100 బుల్లెట్లు పేలుస్తుందది. దాని దండలో 5000 బుల్లెట్లు ఉంటాయి. అందరూ చిల్లులు పడిపోతారు అంటూ నేను తాయితీగా కాళి మీద కాలేసుకుని తలకింద రెండు చేతులూ పెట్టి పడుకుని కాలూపుతూ ఉన్నా.
అమ్మ నా నిబ్బరానికి మళ్లీ నోరు తెరుస్తూంటే,” ఏం పర్లేదమ్మా.. నువ్వూ పక్కనే పడుకో చెబుతా..” అంటూ అమ్మని లాగి నా పక్కనే పడుకోబెట్టా. కారణం ఒక్కటే, నుంచుంటే కిందనుంచి పైకి వస్తున్న బుల్లెట్లు తగిలే ప్రమాదముంది. అందుకే అమ్మని కదలకుండా పడుకోమన్నా. నా ఉద్దేశ్యం అర్థం చేసుకున్న అమ్మ నా పక్కనే నా వైపు తిరిగి పడుకుని, తలకింద ఓ చెయ్యి పెట్టుకుని, నా వైపే చూస్తూ, “ఇప్పుడు చెప్పరా? లచ్చి అంటే నీకూ ఇది ఉంది కదా?” అని అడిగింది.
నాకెందుకో కొంచెం సిగ్గు వచ్చింది. నా బుగ్గలు ఎరుపెక్కుతూండగా, మౌనంగా తలూపుతూ, “స్టార్టింగులో తను నన్ను బాగా డామినేట్ చేసింది అమ్మా. సీనియర్ కదా? ఆ మాత్రం ర్యాగింగ్ ఉంటదిలే అనుకున్నా. తీరా చూస్తే అది నా కన్నా చిన్నది. దేవి పిన్ని దాని అక్క బర్త్ సర్టిఫికేట్ దీనిదే అని చూపించి, కాలేజ్లో జాయించేసింది. దెబ్బకి అది నాకన్న ఓ ఇయర్ ముందర ఉంది. చాలా తెలివైనది అమ్మా! మంచి పిల్ల. పైగా భిల్లు జాతి పిల్ల” అని అన్నా.
అమ్మ నవ్వుతూ, “సో! తమరికి పెళ్లి మీద …