Minor Raja

Minor Raja Part 164 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 173 నేనేమీ పిచ్చోడిని అయ్యి, ఆయనకి ఇలా నా ప్లాన్స్ చెప్పట్లేదు. దాని వెనకాల చాలా పెద్ద రీజనే ఉంది. మరి దేవి ఇప్పటిదాకా పులిని స్వారీ చేసింది. తను పులి మీద నుంచి దిగిన వెంటనే, అదే పులి తన మీద ఎగబడుతుంది. ఆ పులి తనని తినెయ్యకూడదు కదా? అందుకే నేను ఆ పెద్దాయనకి ముందరే బిస్కెట్ వేసింది. నా ఉద్దేశ్యం ఆయనకి అర్థమయినట్టుంది. నన్ను దగ్గరకి లాక్కుని, నా భుజమ్మీద చెయ్యి వేసి, Young man, you are very smart. I like your thought process. We too want a better and clean society. You very well knew what is going to happen if the queen resigns. A word of caution to you! Be careful of the consequences. If the queen steps a side, all those bastards will go loose” అని ఇంగ్లీషులో నాకు వార్నింగ్ ఇచ్చాడు. సారాంశం సింపుల్. “పర్యవసానాలు చూసుకో. ఇన్నాళ్లూ ఆవిడ ఆ జంతువులన్నిటినీ కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఆవిడ తప్పుకోగానే అవన్నీ పుంజాలు తెంపుకుని సంఘం మీద ఇష్టం వచ్చినట్టు పడతాయి. మీరు జాగ్రత్త!!!” అన్నదే. నేను ఆయన మాటలకి నవ్వేస్తూ, సార్, దాని గురించి పెద్దగా వర్రీ అవ్వకండి. మీరు చెప్పిన జంతువులన్నీ ఏనాడో శవాలుగా మారిపోయాయి. మీకు ఖాళీ ఉందీ, మీకు కావాలంటే, ఆ పని కూడా మీ నెత్తిన పెడతా. మీ మధ్యప్రదేశ్ కౌంటర్ పార్టుతో మాట్లాడి అచనాక్మర్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో ఫలానా చోట చెక్ చెయ్యమనండి. ఓ 300 జంతువుల కలేబరాలు కుళ్లిపోయిన స్థితిలో దొరుకుతాయి. మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. వారం రోజుల నుంచీ మీ క్రైం రేట్ చెక్ చేసుకోండి. మా పిన్నిని పులి మీద నుంచి దింపే ముందరే, కింద ఉన్న జంతువులన్నిటినీ వెతికి వెతికి చంపేసి, ఆ తర్వాతే దింపుతున్నాం. ఒక్క క్రూర మృగం కూడా ఈ సొసైటీలో వారం రోజుల నుంచీ లేదు. మీకు ఒక్కళ్లు కూడా కనపడరు. చిన్నా చితకా అందరినీ లేపేశాకే పిన్ని సీట్ వెకేట్ చేస్తోంది. ఇందాక అందుకే మీకు లెక్క నా నుంచి వస్తుంది ఇంక అని అన్నది” అని అన్నా. ఇంకో నెలలో రిటైర్ అయ్యే ఆయన, నేను చెప్పిన మాటలకి, ఆయన నోటి మాట పడిపోయి, స్థాణువులా నిలబడిపోయాడు. ఆయన ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేస్తూ, “వావ్! యంగ్ మేన్! నీకు పని చేతకాదు, తప్పటడుగు వేస్తున్నావూ అని అనుకున్నా. నన్ను తప్పుగా నిరూపించావు. You have very bright future my boy! నేను ఎక్కువ చేసి చెప్పట్లేదు. ఉన్నదే చెబుతున్నా అంటూ, నన్ను తన వాళ్ల దగ్గరకి తీసుకొచ్చి, “meet చిన్న రాజా వారు. మనతో ఫ్యూచర్ డీలింగ్స్ ఇతనే చెయ్యబోతున్నాడు” అని …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker