20 నిమిషాలలో ఇంటికి చేరుకోగా దివ్యక్క అమ్మ వాళ్ళను ఉండమమని చెప్పి నన్ను , కృష్ణ ను ఇంటిలోపలికి పిలుచుకొని వెళ్లి బెడ్ రూమ్ లో మరొక బెడ్ ను వేసి అమ్మను మరియు అంటీ ను ఇందుమతి గారి సహాయంతో లోపలికి నెమ్మదిగా నడిపించుకుంటు పిలుచుకొని వచ్చి బెడ్ పై కూర్చోబెట్టగా , దివ్యక్క అమ్మతో స్నానానికి వేడి నీళ్లు పెడతానని అని బాత్రూం లోకి వెళ్లగా , అమ్మ ముందు మోకాళ్లపై కూర్చొని నా తలను అమ్మ ఒడిలో పెట్టి ఉద్వేగంగా అమ్మ ఇక నుండి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను అని నేను వెళ్లడం వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతూ చెప్పగా , అమ్మ నా తలపై ఒక చేతితో ప్రేమగా నిమురుతూ కన్నయ్య నాకేమి కాలేదు చూడు అని తల ఎత్తి అమ్మ కళ్ళల్లోకి చూడమని నువ్వేమి బాధపడకు , రెండు రోజుల్లో అంతా నయమవుతుంది అని నా కన్నీళ్లను తుడిచి వొంగి నా తలపై ప్రేమగా ముద్దుపెట్టింది.
కొద్దిసేపటి తరువాత దివ్యక్క వచ్చి ఇఫ్దరిని చూసి నా పక్కనే మోకాళ్లపై కూర్చొని నా వీపుపై ప్రేమగా నిమురుతూ అంటీ కు ఏమి కాదు అన్నయ్య మనమంతా ఉన్నాము కదా అని కొద్దిసేపు ఓదార్చి పైకి లేపి ఇందుమతి గారి సహాయంతో అమ్మను స్నానానికి బాత్రూం కు పిలుచుకొని వెళ్తుండగా , దివ్యక్క అమ్మ , అంటీ జాగ్రత్త అని చెప్పి అమ్మ వైపు తిరిగి ఇంటి వరకు వెళ్లి వస్తాను అని చెప్పి కృష్ణ గాడిని పిలుచుకొని విశ్వ సర్ జీప్ లో ఇంటికి వెల్తూ ఉండగా , విక్రమ్ సర్ మహేష్ ఇందు మేడం కనిపించలేదే అని అడుగగా , ఒక్కసారిగా బాధ వెయ్యగా బలవంతంగా ఆపుకొని , ఏదో అర్జంట్ పని ఉందని మెసేజ్ పెట్టి మేడం గోవా వెళ్లిపోయారు అని కష్టంగా చెప్పగా , ఎప్పుడు అని అడుగగా , మొబైల్ తీసి మెసేజ్ వచ్చిన సమయం చూసి చెప్పగా , అయితే ఇప్పటికే ఫ్లైట్ లో సగం దూరం వెళ్లి ఉంటారు అని వెంటనే సర్ తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి మేడం వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఇందు మేడం వైజాగ్ నుండి ఫ్లైట్ లో వస్తున్నారు , పికప్ చేసుకొని నేను గోవా వచ్చేవరకు మేడం ఇంటి దగ్గర సెక్యూరిటీని పెంచి ఇద్దరు మహిళ కానిస్టేబుల్ లను మేడం దగ్గరే ఉంచామని థాంక్స్ చెప్పి కాల్ కట్ చెయ్యగా , విక్రమ్ సర్ కు థాంక్స్ చెప్పగా , ఆపుతూ మహేష్ నేనీ స్థితిలో ఉన్నానంటే అది మేడం మరియు నీ వల్లే , మీ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటాను అని చెప్పగా సంతోషం వేసి ,ఇందు అమ్మకు కాల్ చెయ్యగా తగలకపోవడంతో అమ్మ జాగ్రత్త నేను మళ్ళీ కాల్ చేస్తాను అని మెసేజ్ …