Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 58

ఆశ్రమం లో ఎవరో తలుపు కొడుతుండగా నోద్ర లేచి తలుపు తెరువగా అడవిలోకి వెళ్లిన వారంతా వచ్చారు , మీ నాన్న గారిని కలవచ్చు అని చెప్పగా , ఎక్కడలేని సంతోషం రాగా సమయం చూడగా రాత్రి 9 గంటలు అవ్వగా వెంటనే కృష్ణ గాడిని నవ్వుతూ లేపి దుప్పట్లన్నీ మడిచి మూల పెట్టేసి ఇద్దరం అతడి వెంట పరిగెత్తుతూ వెళ్లగా ,  ఒక కుటీరం వైపు వేలు చూపిస్తూ లోపల మీ నాన్నగారు ఉన్నారు వెళ్లి కావచ్చు అని చెప్పగా లోపలికి ఆయాసపడుతూ పరిగెత్తాము. లోపల కాగడాల వెలుగులో నాన్న గారు తెల్లటి బట్టలు వేసుకొని ఉండగా చూడగా ముఖం లో ఒక తేజస్సు కనిపిస్తుండగా, సంతోషం పట్టలేక ఆత్రంగా వెళ్లి నాన్నా అని సంతోషంగా కౌగిలించుకొని రెండు చేతులతో ప్రేమగా నిమురుతుండగా , నాన్న లో సంతోషం , నవ్వు తప్ప ఏమాత్రం చలన0 లేకపోవడంతో వెనక్కు జరిగి నాన్న నేను నీ మహేష్ , వీడు కృష్ణ అని చెబుతుండగా , తెలుసు మహేష్ అని ముఖం లో నవ్వు తప్ప వేరే expressions లేకుండా స్వామిజీల లాగా మాట్లాడసాగాడు. నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని , చూస్తున్నావుగా ఇక్కడ సంతోషం తప్ప వేరే వాటికి చోటు ఉండదు. నాన్న మాతోపాటు వచ్చెయ్యండి మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాము అని చెప్పగా , అవును అంకుల్ ఇక్కడి నుండి మన ఇంటికి వెళ్లిపోదాము అని కృష్ణ కూడా చెప్పగా , చూడు మహేష్ ఇప్పుడు నాకు ఏ సంబంధాలు , దాంపత్య జీవితం భార్య పిల్లలు అన్న రిలేషన్స్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker