పాఠక మిత్రులారా! ఒక చిన్న విన్నపము !! అన్యధా భావించవద్దు.
ఎంతో మంది కథ చదువుతున్నారు. నైస్ అప్డేట్ అనో గుడ్ అప్డేట్ అనో ఒక్క రెండు ముక్కలు వ్రాస్తే మీ సొమ్మేమీ పోదు కదా? అట్లానే లైకులూ [] రేట్లూ [] కొట్టినా మీకు కలిగే నష్టం ఏమీ ఉండదు.. కానీ కష్టపడి కథలు వ్రాసే రచయితలకు మాత్రం ఎనలేని ఉత్సాహాన్ని కలుగచేస్తాయి అవి.
దయచేసి గమనించగలరు. సైలెంటుగా చదివి వెళ్ళిపోకుండా, మీకు నచ్చితే ఒక చిన్న షాభాషీ ఇవ్వండి. నాకు మరింత ఎనర్జీతో తరువాయి అప్డేట్ వ్రాయడానికి ఎంతో దోహదపడతాయి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి. సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను.
=========
ప్రస్తుతం: (ఇప్పటిదాకా చెప్పిన కధ ఇండెక్సు : [1 – 100] , [101 – ] )
19.2 సంద్రంలో శృంగారం – 1
అవీ-సవీ వెళ్ళిన ఒక అరగంటకి మేము బయలుదేరాము. అవీ సవీ ఇద్దరూ మేము ఆ రెండు బోట్ల మీద తిరిగిన ఆనవాళ్ళన్నీ మాయం చేసేసి, బోట్లనితీసుకెళ్ళి కోస్ట్ గార్డ్ కి కనిపించేట్టు వదిలేసి, వెనక్కి యాట్చ్ మీదకి వచ్చి, “నాథా! ఇచటకు రెండు ఘడియల దూరములోనే తటరక్షక భటులు తిరుగాడుచున్నారు” అని చెప్పారు. వెంటనే, నేను సెంథిల్ కి ఇంజన్ ఆపెయ్యమని ఆర్డర్ ఇచ్చి, యాట్చ్లో ఉన్న డీజిల్ మొత్తం చివరి బొట్టు వరకూ కూడా మాయం చెయ్యమని, అలాగే నావిగేటర్ని కూడా పాడు చెయ్యమని అనూ-అవీ-సవీలకి చెప్పి, “అందరూ సుష్టుగా పలావు తిన్నారు. డకార్ కొట్టే ఫేసులు పెట్టకండి. కనీసం నాలుగైదు రోజుల నుంచీ తిండీ తిప్పలూ లేనట్టు నీరసమైన ఫేసులు పెట్టండి” అని అందరికీ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి, యాట్చ్ కి హెల్ప్ అనే మీనింగు వచ్చేలా, తెల్ల క్లాత్ ఒకటి జెండాలా కట్టి లోపలికి వచ్చాను. లల్లీ, “ఒకవేళ కోస్ట్ గార్డ్ లోపలికి వచ్చి చెక్ చేస్తే ఈ కత్తి ఎట్లారా?” అని అడిగేసరికి, కరక్టే కదా అని ఆలోచించి, ఒక వాల్ పానెల్ పీకి, ఖడ్గాన్ని అందులో పెట్టి, మళ్ళీ మూసేసి, అనుమానం రాకుండా, అక్కడకి సోఫా జరిపి, అమ్మనీ పెద్దీనీ దాని మీద పడుకోమన్నాను. అందరూ నీరసంగా ఉన్నట్టు కలరింగు ఇస్తూ పడుకోగానే, మళ్ళీ ఇంకో డవుట్ వచ్చి, బోట్లో శాటిలైట్ ఫోన్ ఉంది ఎందుకు కాల్ చెయ్యలేదు అని అడుగుతారేమో అని దాన్ని పాడుచేద్దాం అని చూసేసరికి అది ఒక్కసారిగా మోగసాగింది. నేను ఎత్తేసరికి, అవతలవైపు అమ్మమ్మ! అది ఏడుస్తూ “ఏమైపోయారురా?” అని ఖంగారుగా అరవసాగింది. నేను గొంతు చాలా నీరసంగా మార్చి, “ఏమోనే, తెచ్చుకున్న డీజిల్ మొత్తం అయిపోయింది. ఫోన్ చేద్దామంటే, ఇది పాడయ్యింది. అతి కష్టం మీద ఇప్పుడే రిపెయిర్ చేసి ఆన్ చేసా, వెంటనే నీ కాల్. అందరూ ఆల్మోస్ట్ స్పృహ తప్పే స్టేజ్ లో ఉన్నామే అమ్మమ్మ! ఎక్కడున్నామో తెలియను కూడా తెలియట్లే” అంటూ ఉండగానే, సెంథిల్ పరిగెత్తుకుంటూ వచ్చి, కోస్ట్ గార్డ్ వాళ్ళ షిప్స్ వస్తున్నాయి దగ్గరికి అంటూ సైగలు చేశాడు.
“ఉండవే అమ్మమ్మ! ఇదిగో …