Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 310

అమ్మా ఇప్పుడు ఏమీ వద్దు సమయం కూడా లేదు ఫ్లైట్ మరికొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుంది అనిచెప్పడంతో , రెండే రెండు నిమిషాలు అంటూ లోపలకువెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది .  బయటకువచ్చి చూస్తే అప్పటికే పెయింటింగ్ పూర్తి అయినట్లు అందరూ వెళ్లిపోయారు . అంకుల్ ఇంటికి తాళం వేశారు . ఒకసారి ఇంటిని చూసి ఆనందంతో మీకు ఏవిధంగా థాంక్స్ చెప్పాలో కూడా తెలియదు బాబు అంటూ నమస్కరిస్తుంటే , నాకు ఇద్దరు చెల్లెమ్మలను ఇచ్చారు చాలదూ అంటూ వెళ్లి ముందు వెనుక డోర్లు తీసాను .  అక్కయ్యా …….అన్నయ్య ప్రక్కన నేను , చెల్లి ……అన్నయ్య ప్రక్కన నేను అంటూ ప్రేమతో గోడవపడుతుంటే ,  అంకుల్ ఇద్దరినీ వెనుకకు తోసి మీరు ముందురండి అనిచెప్పాను . అలా కూర్చోగానే అంకుల్ తోపాటు నవ్వుకుని డోర్లు వేసి అటువైపు వెళ్లి ఇద్దరి అలకను చూసి ఆనందిస్తూ 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకుని కారుని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పార్క్ చేసి అంకుల్ మీరందరూ లోపలికివెళ్లండి నేను ఇక్కడే ఉంటాను అదిగో అనౌన్స్మెంట్ కూడా వినిపిస్తోంది అని పంపించాను . అన్నయ్యా ……….మీరు కూడా రావచ్చు కదా అని కావ్య పిలిచింది . మొదట మీ అక్కయ్యకు మీరు సర్ప్రైజ్ ఇవ్వండి , నేనెక్కడికీ వెళ్ళను ఇక్కడ నుండి చూస్తూ ఉంటానుకదా లవ్ యు అంటూ పంపించాను .  నా చేతిని స్పృశిస్తూ లోపలకువెళ్లి ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న వారిప్రక్కనే నిలబడ్డారు. Related Articles Oka Koduku Prayanam – 311 6 hours ago Oka Koduku Prayanam – 312 6 hours ago Oka Koduku Prayanam – 307 1 day ago Oka Koduku Prayanam – 309 1 day ago రెండు నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యి సేల్స్ గర్ల్ కల్యాణి చేతిని చుట్టేసి , కల్యాణి చాలా నెలల తరువాత వైజాగ్ వచ్చాను . మహేష్ కోసం వస్తున్నాను అంతే కాని నాకు వైజాగ్ రావడం ఇష్టం లేదు అంటూ బాధపడుతూనే బయటకువచ్చిందో లేదో …………. అక్కయ్యా , అక్కయ్యా …………అంటూ ఎయిర్పోర్ట్ మొత్తం వినిపించేలా సంతోషంతో జాహ్నవి , కావ్య అరిచి పరుగున వెళ్లి స్వప్నను కౌగిలించుకొన్నారు . ఇది కలయా నిజమా అన్నట్లు స్వప్న షాక్ లో ఉండిపోయింది . మేడం జరుగుతోందంతా నిజం అని నడుముని గిళ్లడంతో , ఒక్కసారిగా గుండె లోతుల్లో దాగిన కన్నీళ్లు కళ్ళల్లో కారుతూ జాహ్నవి , కావ్య అంటూ మనసారా హత్తుకొని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టింది . లవ్ యు అక్కయ్యా , లవ్ యు అక్కయ్యా ………..మేమే కాదు అమ్మా నాన్న కూడా మీకోసం వచ్చారు రండి అంటూ చెరొకవైపు చేతులను చుట్టేసారు . అమ్మ వచ్చిందా ………అని బాధ , …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker