Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
మొబైల్ రింగ్ అవ్వడంతో చెల్లెమ్మ మొబైల్ చూసి అమ్మా నాన్న నుండి మెసేజ్ అని చదివింది .
తల్లి మీ అన్నయ్యను చూడటానికి నన్నుమాత్రమే వదిలారు చూసాను ఇక ఏమీ భయం లేదని డాక్టర్ గారుకూడా చెప్పారు మీరేమీ కంగారుపడకండి . మీ అమ్మ ముద్ద కూడా ముట్టుకోలేదు వీలైతే కాస్త తినిపించండి అని నెమ్మదిగా చెప్పింది.
అమ్మ రెండుచేతులతో దేవుణ్ణి ప్రార్థిస్తుంటే , చెల్లెమ్మలు నావైపు కళ్ళల్లో చెమ్మతో దండం పెడుతున్నారు .
నో అని తల ఊపి చేతితో కృష్ణగాడి ముందు ఉన్న హార్న్ కొట్టాను .
సెక్యూరిటీ పరుగునవచ్చి గేట్ తెరువడంతో నేరుగా లోపలికిపోనిచ్చాడు .
కార్ సౌండ్ కు అమ్మావాళ్ళు , నాదేవత , ఏంజెల్స్ బయటకువచ్చి మేము దిగగానే ఆ స్టూడెంట్ కు ఎలా ఉంది , ఏమీ అపాయం లేదు కదా , కొలుకుంటున్నాడు కదా , స్పృహలోకి వచ్చాడా , మాట్లాడుతున్నాడా …………..సేఫ్ అని తెలిసాకేలే నువ్వు వచ్చేది అని మాకు తెలుసు అని అన్నీ వాళ్లే మాట్లాడుతుంటే ,
లోపల కూర్చున్న అమ్మా , చెల్లెళ్ళు అన్నయ్య కోసం ఇంతమంది ప్రార్థిస్తున్నారు అని ఆనందబాస్పాలతో ఒకరినొకరు చేతులుపట్టుకున్నారు .
అతడి పేరు శంకర్ he is safe అనిచెప్పడంతో , అందరూ సంతోషంతో ఊపిరిపీల్చుకుని ఒకరినొకరు హత్తుకుంటున్నారు .
Related Articles
Oka Koduku Prayanam – 334
6 hours ago
Oka Koduku Prayanam – 336
6 hours ago
Oka Koduku Prayanam – 331
1 day ago
Oka Koduku Prayanam – 332
1 day ago
మీ కౌగిలింతలు అయిపోతే కారులో ఉన్నవాళ్లను కాస్త పట్టించుకోండి అని చెప్పడం ఆలస్యం ,
అయ్యో ……….అని అందరూ వెళ్లి డోర్ తెరిచి ఆప్యాయంగా పలకరించి శంకర్ కు ఏమీ కాదు రండి అని చేతులను అందుకొని దింపి లోపలికి పిలుచుకునివెళుతుంటే ,
చెల్లెమ్మలూ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాము ఎలా తెలుసు చెప్పావా అని వెనుకే వెళుతూ అడిగాను .
చెల్లెమ్మలు అమ్మావాళ్ళ గుండెలపై హత్తుకొని మూసిముసినవ్వులునవ్వుతూ నడుస్తున్నారు.
హమ్మయ్యా ………..మిమ్మల్ని ఎలా ఓదార్చాలి అని విషయం తెలిసినదగ్గరనుండి అందరమూ మధనపడుతున్నాము . మా కన్నయ్య కారులోనే ఏదో మాయచేశాడు.
అవును అమ్మా ……….. బాధపడుతున్నవాళ్లను ఇలా మాయ చేసేసారు అని మరింత నవ్వుకున్నారు .
అమ్మ ……….. ఈ పిలుపు వింటే చాలు నన్ను నేను మరిచిపోతాను తల్లులూ అలాగే పిలవండి అని అమ్మ ప్రేమతో హత్తుకుంది .
అమ్మా పిలుపే కాదే మీ అందరి పేర్లు మన బుజ్జి ఏంజెల్స్ తోసహా అందరివీ వీళ్లకు తెలుసు . మీరంతా ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా త్వరగా చెప్పండి అలాచూడు నాతోపాటు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అనిచెప్పాను .
అమ్మావాళ్ళు , నాదేవత , ఏంజెల్స్ ఒకరినొకరు చూసుకుని ప్చ్ ప్చ్ ప్చ్ ………మేమైతే కలవడం ఇదే తొలిసారి …