స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
ఫీవర్ అలానే ఉంది అండీ.. ఇంకా తగ్గలేదు. జ్వరం ఇంకా తగ్గలేదు సరికదా, జలుబూ-దగ్గూ కూడా తగులుకున్నాయి. నా ఆరోగ్యం గురించి ఆదుర్దా పడిన అందరికీ మరొక్క మారు థాంక్స్ అండీ.. రేపు అప్డేటు ఇవ్వగలనో లేనో అప్పుడే చెప్పలేనండీ.
-x-x-x-
189
దేవి పట్టీంచుకోకుండా, “మనమెట్లాగూ గెస్ట్ హౌస్ లోనే దిగుతున్నాం కదా? పర్లేదు” అంది. పైలెట్ ఇంకోసారి నసుగుతూ, “లేదు మేడం, ఏర్పోర్ట్ లో దిగుతున్నాం. గెస్ట్ హౌస్‌లో ల్యాండవ్వడానికి పెర్మిషన్ దొరకలేదు” అన్నాడు. రాగిణి విసుగ్గా, ఫోన్ వైపు చూసుకుంది. మా హెలికాప్టర్ లో హైట్‌లోనే వెళ్తోంది కనుక, దాని ఫోన్లో సిగ్నల్స్ ఉన్నాయి. అది అక్కడ దేవి గ్యాంగుకి ఫోన్ కొట్టి, గెస్ట్ హౌస్ నుంచి బట్టలు తీసుకుని వ్యాన్‌లో రమ్మని పురమాయించి, “వాళ్లు వచ్చేదాకా ల్యాండ్ అవ్వకు” అని పైలెట్ తో అంది.
పైలట్ తలడ్డంగా ఊపుతూ, “అంత ఫ్యూయల్ లేదు మేడం, మనం దాదాపు 900 మైళ్ళు ట్రావెల్ చేశాం మేడం. ఫ్యూయల్ కొంచెమే ఉందీ” అన్నాడు. చేసేది లేక హెలికాప్టర్ ఎయిర్‌పోర్టులో ఓ మూల ల్యాండ్ చేసి, వాడిని కిందకి దిగి నుంచోమని, రాగిణీ-దేవీ ఇద్దరూ హెలికాప్టర్లోనే వాళ్ల అవతారాలు సరి చేసుకుంటూ ఉన్నారు. నేను హెలికాప్టర్లోనే కూర్చుని ఉన్నా. ఓ పావుగంటకి దేవి టీం కాన్వాయ్ రన్ వే మీదకి వచ్చి హెలికాప్టర్ పక్కన ఆగింది.
ముందో రెండు కార్లు, వెనకో రెండు కార్లు, మధ్యలో దేవి కోసం గ్రే కలర్ మెర్సిడీస్ వ్యానూ ఉన్నాయ్. ముందరి కార్లోంచి ఒకడు దిగి వ్యాన్ డోర్ తెరిచి, బట్టల ప్యాకెట్లు తీసి, రాగిణికి ఇచ్చాడు. నేను వెంటనే వ్యాన్ ఎక్కి వెనక సీట్లోకి పోయి కూర్చున్నా. రాగిణి దాని ప్యాకెట్ తీసుకుని, నా వెనకాలే వ్యాన్‌లో దూరింది. దేవీ మాత్రం హెలికాప్టర్లోనే కొత్త బట్టల్లోకి మారిపోయి, స్టయిల్‌గా ఛాపర్ దిగి వ్యాన్‌లో ఎక్కి కూర్చున్నాక, మా కాన్వాయ్ తిన్నగా దేవి గెస్ట్ హౌస్ వైపు వెళ్లిపోయింది.
రెండు గంటల నుంచీ గాల్లో ఉండడం వల్ల మాకు విషయం తెలియదు కానీ, నా ఫోన్ దెబ్బకి, ఆ అపోజిషన్ లీడర్ తన పావులు కదపడం మొదలెట్టాడూ, రాష్ట్రమంతా వేడెక్కిందీ అని కానీ, మేమిలా హెలికాప్టర్లో ల్యాండయ్యింది ఎయిర్‌పోర్టుకి వచ్చిన ఓ జర్నలిస్ట్ తెలుసుకుని, దాన్ని వార్తగా రాసేశాడూ అని కానీ, వాడి న్యూస్ ఛానల్లో, “బిజినెస్ టైకూన్ మంథరా మండోదరీ దేవి జైపూర్‌లో షడన్‌గా ప్రత్యక్షం….. ఆదరబాదరగా కారెక్కి తెలియని ప్రదేశానికి పయనం….” అంటూ న్యూస్ ఛానెల్స్ లో ఫ్లాష్ న్యూస్ వస్తోందీ అని కానీ మాకు, గెస్ట్ హౌస్ చేరిన 5 నిముషాలకి, గూడెం నుంచి అమ్మమ్మ ఖంగారుగా ఫోన్ చేసే వరకూ తెలియదు.
మాకు తెలియగానే, …