Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 57

ఒక బాటిల్ రక్తం తీసుకున్న మారు క్షణం నుండి ఇందు అమ్మను ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటూ దగ్గరుండి డాక్టర్లు చూసుకుంటూ , ఇలాంటి situation ను ఎప్పుడు ఎరుగకపోవడంతో డాక్టర్లే ఇందు అమ్మకు ఏమవుతుందో అని బయపడసాగారు , ఇందు అమ్మ మాత్రం తన శరీరం లోనుండి ప్రతి క్షణం శక్తి తీసేస్తున్నట్లుగా , ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తున్నా కూడా తన కన్న కొడుకును ప్రాణానికి ప్రాణంగా పెంచిన అక్కయ్యకు ఆ ప్రాణాన్ని ఇస్తున్నందుకు పెదాలపై చిరునవ్వుతో ఆనందించసాగింది. ఆ దృశ్యాన్ని డాక్టర్లందరు చూస్తూ ఆమె ప్రాణాలు కాపాడటం కోసం ఈమె తన ప్రాణాలు కూడా లెక్కచేస్తుండకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చెయ్యసాగారు. అంతలో అమ్మ శక్తి లేకపోవడం వల్ల కళ్ళు మూతలు పడుతూ స్పృహ కోల్పోతుండటంతో వెంటనే బ్లడ్ తీసుకోవడం ఆపు చెయ్యగా అప్పటికే రెండో బాటిల్ కూడా దాదాపు నిండుకుని ఉండటంతో సరిపోతుందని , బ్లడ్ అమ్మకు ఎక్కిస్తూ , వెంటనే ఇందు అమ్మకు గ్లూకోస్ ఎక్కించసాగారు. డాక్టర్లు ఇందు అమ్మకు అన్ని చెక్ చేసి కొన్ని గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అందరూ ఊపిరి పీల్చుకొనసాగారు. రాత్రంతా ఇద్దరు డాక్టర్లను ICU రూమ్ లోనే ఉండమని చెప్పి అర గంటకోసారి వారి ఆరోగ్యం చెక్ చేస్తూ ఉదయం వరకు రిజిస్టర్ చెయ్యమని చెప్పి మిగిలిన డాక్టర్లు బయటకు వచ్చి ఇప్పుడేమి పర్లేదు అందరూ బాగున్నారు ఉదయానికల్లా అంతా సెట్ అవుతుంది అని డ్రైవర్ మరియు అమ్మ కొలీగ్ తో చెప్పి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఆనందపడుతూ అమ్మ కొలీగ్ డ్రైవర్ తో మీరు వెల్లలనుకుంటే వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పగా ,సరే మేడం నేను ఉండేవాన్ని కాకుంటే ఇంటి దగ్గర పిల్లలు ఎదురుచూస్తుంటారు , ఇప్పుడు వెళ్లి ఉదయమే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తరువాత నర్సు బయటకు రాగా పక్కన కుర్చీలో కూర్చున్న అమ్మ కొలీగ్ ను చూసి , మేడం లోపలికి రండి అని పిలుచుకొని వెళ్లి ఒక బెడ్ చూపించి ఇక్కడ రెస్ట్ తీసుకోండి , మేము చూసుకుంటాము అని చెప్పగా , ఒకసారి అమ్మ చెయ్యి అందుకొని నిమురుతూ కొద్దిసేపు పక్కనే కూర్చుని తరువాత కొద్దిసేపు పడుకొనసాగింది. విశ్వ సర్ మహేష్ ఇంటికి వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఆఫీసర్లు పెద్దయ్యతో పాటు ఒక ఇద్దరిని ఇక్కడే ఉండమని చెప్పి మిగతా వారందరినీ వారి వారి ఇళ్లకు పంపించివేశారు. విశ్వ సర్ వేగంగా జీప్ దిగి లోపలికి వెళ్ళి మొత్తం ఇల్లు పరిశీలించి హాల్ మొత్తం రక్తం ఉండగా ఏమి జరిగిందో అని కంగారు పడుతూ , జరిగినదంతా తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యగా స్విచ్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker