స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
-x-x-x-
200
అమ్మ ప్రశ్న వింటూనే, దేవి భుజాలెగరేస్తూ, “మేమిద్దరమూ అడవిలోకి ఎవరిని తీసుకెళ్ళాలీ అన్న పాయింట్ మాట్లాడుకుంటున్నాం అక్కా.. అమ్మ హైదరాబాద్ అర్జంటుంగా వెళ్లాలి అంట. అమ్మ తనకి కుదరదు అంటోంది. నువ్వు వస్తావా?” అని అడిగింది. నాకూ-దేవికీ అమ్మ వస్తుందీ అన్న నమ్మకం లేనే లేదు. అమ్మ చాలా సెన్సిటివ్ & టూ మచ్ ప్రీ-కేర్స్ తీసుకుంటుంది. పోయిన సారి నాన్నతో అడవిలోకి వెళ్లగానే అమ్మ జ్వరంతో అడ్డం పడిందిగా? ఇంకోసారి అడవిలోకి రానే రాదు. తనకి సెంటిమెంట్స్ బాగా ఎక్కువ.
నేను ఊహించినట్టే, అమ్మ ల్యాప్టాప్ పక్కన పెడుతూ, నావల్ల కాదు. పోయిన సారి వచ్చిన జ్వరం దెబ్బకి వారం లేవలేకపోయా. వేరే ఎవరిని అయినా చూసుకోండి. అంటూ చేతులు తిప్పుతూ, అమ్మమ్మ పక్కన కూర్చుని, హైదరాబాద్లో అంత అర్జంటు వర్క్ ఏంటి? అని అడిగింది. ఎస్టేట్ మేనేజర్ విషయం చెప్పగానే, అమ్మ “మోసం చేసినవాడి గురించి మనకి అవసరమా?” అని నిరసనగా అంది. అమ్మమ్మ “తప్పే. మనవాడే. ఏదో భ్రమర చెప్పిందీ అని నీ ఫోటోలని బయటకు పంపించబోయాడు. అంతే కదా?” అని అని కవర్ చెయ్యబోయింది.
నేను భుజాలెగరేస్తూ, “నక్క పిన్ని చెప్పింది కదా వాడేమీ లొంగిపోలేదు. వాడికీ వేరే కోరికలేవో ఉండి ఉంటాయి. వాడి ప్లాన్స్ వాడికి ఉండి ఉంటాయి. అవేంటో మనమింకా తెలుసుకోలేదు. అమ్మకి థ్రెట్ తప్పిపోయింది కదా అని వాడి విషయాన్ని పోస్ట్ పోన్ చేసా. అంతే! లేదంటే, మొన్న అదే ఊపులు వాడినీ కెలికేద్దాం అనే అనుకున్నా” అంటూ వాడి మీద నాకు ఇంకా నివృత్తి కాని అనుమానాలు ఉన్నాయీ అని అమ్మమ్మకి చెప్పా.
అమ్మమ్మ నవ్వేస్తూ, “అందుకే దొరవారూ, ఓసారి నేను వెళ్లి వాడిని కలిస్తే, ఏమైనా బయటకు రావచ్చేమో అనే, మీతో రాకుండా అటు వెళ్తున్నా. మీరిద్దరూ మాత్రం జాగ్రత్త. శంకరినీ విజయనీ తీసుకెళ్తా అంటున్నారు. మీరిద్దరే అన్నీ చూసుకోవాలి. శంకరి పెద్ద తింగరి, విజయకి మన వ్యవహారాలు ఏమీ తెలియవు. బయట మనిషి” అని హెచ్చరించింది. అమ్మ కూడా, “అవునే దేవీ.. మీ ఇద్దరితోనూ, ఏ చిలకమ్మనో తీసుకుపోతే బావుంటుంది. ఫైటింగ్ రాని వాళ్లు అయితే భారం మీ ఇద్దరి మీదే పడుతుంది” అని అంది.
నేను నవ్వుతూ, “మేమిద్దరమే ఎందుకు అవుతామమ్మా? నేను శివుడినీ, నా పామునీ కూడా పట్టుకుపోతాగా? అవి రెండూ, ఆ పైన సుబ్బిగాడు ఎలానూ ఉండనే ఉన్నాడు. ఈ సారి సుబ్బిగాడితో వాడి గర్ల్ ఫ్రెండుని కూడా పట్టుకుపోతాం. బోలెడంత సెక్యూరిటీ ఉందిలే మాకు” అని అంటూ, “ఏం దేవి పిన్నీ.. అంతే కదా?” అని అన్నా. దేవి “అవునవును.. శివుడొక్కడే చాలు. వంద మంది పెట్టు. మా గురించి ఖంగారేమీ పడద్దు కానీ, ఆ మేనేజర్ నుంచి మాత్రం రహస్యాలు రాబట్టండి” అని అంది.
ఇంతలో శంకరత్త అక్కడకి ఏడుపు మొహం వేసుకుని వచ్చింది. …