స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
మొన్న మా ఇంటికి అనుకోకుండా చుట్టాలు రావడం వలన, అప్డేటు ఇవ్వలేకపోయానండీ. వాళ్లు నిన్న రాత్రే వెళ్లిపోయారు. దయచేసి అర్థం చేసుకోగలరు.
-x-x-x-
193
ఇంకో 10 నిముషాల తర్వాత హెలికాప్టర్ గూడెం చేరబోతోందీ అన్నప్పుడు అత్త నన్ను నిద్ర లేపింది. ముగ్గురమూ కూరల తోటలో ల్యాండ్ అయ్యిన మా హెలికాప్టర్లోంచి కిందకి దిగే టైముకి తిమ్మడు మావా, రంగా మామా ఇద్దరూ రెడీగా ఉన్నారు. ఇద్దరూ డబ్బు పెట్టెలని జాగ్రత్తగా కిందకి దింపాక, పైలట్ అంకుల్ని హెలికాప్టర్ కర్నూల్ ఎయిర్పోర్టులో పెట్టుకోమని చెప్పి పంపించేసి, మేము మెల్లగా గూడెం వైపు నడక మొదలెట్టాం.
శంకరత్త పాము బుట్టని పట్టుకుని, దుర్గమ్మ ఇంటి దగ్గర ఆగిపోయి, మీరు వెళ్లండి. నేను ఇక్కడే రిఫ్రెష్ అవుతా అంటూ ఆ ఇంట్లోకి దూరింది. నేనూ-దేవీ మా మొహాలు చూసుకుంటూ రంగి అమ్మమ్మా వాళ్ల ఇంటికి వెళ్లేసరికి, రంగి అమ్మమ్మ ఇంటి దగ్గర రంగి అమ్మమ్మా-జీవీ ఇద్దరూ చెరో గుమ్మడికాయా పట్టుకుని రెడీ గా ఉన్నారు. అవును మరి ఇంట్లో వాళ్లల్లో ముట్టవ్వకుండా ఉన్న పెద్ద వయసు పునిస్త్రీలు వాళ్లే మరి. నన్నూ-దేవినీ చూస్తూనే, మాకు మెటికలు విరిచి, గుమ్మడి కాయలని దిష్టి తీసి దాన్ని పారెయ్యడానికి వెళ్లిపోయారు.
భ్రమర వచ్చి మా ఇద్దరి కాళ్లూ-కళ్లూ కడిగి మా మొహాన బొట్టు పెట్టాక, లచ్చి ఇచ్చిన తువాళ్లతో ఇద్దరమూ కాళ్లు తుడుచుకుని, లోపలకి వెళ్లాం. హాల్లో నాన్నా-అమ్మా-అమ్మమ్మా-రాంబంటు అంకుల్ కూర్చుని ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే అమ్మ లేచొచ్చి ముందు నన్ను కౌగలించుకుని నా బుగ్గన ముద్దు పెట్టి, వెంటనే దేవిని వాటేసుకుని దేవికి ముద్దు పెట్టి, “థాంక్స్ దేవీ.. ఇంత త్వరగా నన్ను నీ అక్కగా అంగీకరించావూ, నాకోసం ఎంత రిస్క్ అయినా చేసే స్థాయికి వెళ్లావూ అంటేనే నేను నీకు బానిసనైపోయా. నువ్వు ఈ రోజునుంచీ నా చెల్లివి కాదు. నువ్వే అక్కవి” అని అంటోంది.
దేవి కొంటెగా నవ్వుతూ, “అయితే అన్నిటికన్నా ముందర… నువ్వు శ్రీ కి మళ్లీ బలిస్నానం చేయించాలే చెల్లీ” అంటూ కన్ను కొట్టింది. అమ్మ నవ్వేస్తూ, “అది తప్పదే.. వీడు బొత్తిగా రౌడీ అయిపోతున్నాడు” అంటూ నా తల మీద చెయ్యి వేసి, నా జుట్టు చెరిపేస్తూ, “కన్నలూ.. నువ్వు చీటికీ మాటికీ ప్రమాదాల వైపు మొండిగా వెళ్లిపోతున్నావు. హైదరాబాద్ తిరిగి వెళ్లగానే నీకు మార్షల్ ఆర్ట్స్ ట్రెయినింగ్ స్టార్ట్ చేయించాల్సిందే. నిన్ను నువ్వు రక్షించుకునే శక్తి నీకు కావాలి” అని అంది.
నేను ఏమీ మాట్లాడకుండా సైలెంటుగా ఉన్నా. ఛాపర్లో రెండు గంటలు స్లీప్ వేసినా నాకింకా బద్ధకంగా ఉంది. …