Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
భోజనం చేసి వెళ్ళమని చెప్పాను .
ఆ మాట అడిగారు చాలు బాబు మా కడుపు నిండిపోయింది అని పెద్దయ్యా వాళ్ళు సంతోషంతో ఇంటికి వెళ్లిపోయారు .
కృష్ణగాడితోపాటు లోపలికివచ్చి సమయం చూసి మొదట మేము తరువాత అమ్మావాళ్ళు లంచ్ చేసేసి పిల్లలూ ఏ మూవీకి వెళదాము అని అడిగాను .
అవెంజర్స్ end game ………అంటూ పిల్లలంతా ఓకేమాటగా గట్టిగా కేకలువేస్తూ చెప్పారు .
అమ్మలవైపు , నా ఏంజెల్స్ వైపు చూస్తే ………….
నవ్వడంతో , ok అవెంజర్స్ …………..అని పిల్లలతోపాటు చేతులుపైకెత్తి హైఫై కొట్టి రెడీ అయ్యాము .
రేయ్ మామా INOX లో టికెట్స్ బుక్ చేసానురా గంటలో స్టార్ట్ అవుతుంది అని కృష్ణగాడు చెప్పడంతో అర గంటలో చేరుకున్నాము .
పిల్లలు బావాలిద్దరినీ పిలుచుకొనివెళ్లి బోలెడన్ని స్నాక్స్ , కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకొనివచ్చి అక్కయ్యలూ అని చూపించారు .
Related Articles
Oka Koduku Prayanam – 352
6 hours ago
Oka Koduku Prayanam – 354
6 hours ago
Oka Koduku Prayanam – 349
1 day ago
Oka Koduku Prayanam – 350
1 day ago
లవ్ యు లిటిల్ ఏంజెల్స్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పిల్లల చేతులను పట్టుకుని , కృష్ణగాడు చెల్లెమ్మ చేతిని పెనవేసి బాల్కనీ స్టెప్స్ ఎక్కుతుండటంతో అందరమూ వాడి వెనుకే పైకిచేరుకున్నాము . అమ్మావాళ్ళు , ఏంజెల్స్ పిల్లలను తమ మధ్యన కూర్చోబెట్టుకొని రెండు వరుసలలో కూర్చున్నారు. అంకుల్ వాళ్ళు ఫస్ట్ వరుసలో , కృష్ణగాడు చెల్లెమ్మతో , బావలు రమేష్ గణేష్ లు అందరికీ చెరొకవైపు ఇద్దరిద్దరూ డోర్స్ ప్రక్కనే కూర్చున్నారు .
నేను ఇందు అమ్మ ఎత్తుకున్న బుల్లి మహేష్ గాడిని అందుకొని అమ్మ పెదాలపై తియ్యని ముద్దుపెట్టి , మీరు మూవీ ఎంజాయ్ చెయ్యండి వీడిని నేను చూసుకుంటాను అని ముద్దుచేస్తూ , అమ్మావాళ్ల రెండు వరుసల వెనుక గోడ ముందు ముగ్గురు విలాసవంతంగా కూర్చునే సోఫాలో కూర్చుని , రేయ్ బుల్లి హీరో తొలి సినిమానే బోలెడంత మంది హీరోలున్న అవెంజర్స్ చూడబోతున్నావు అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
ఎంతమంది ఉన్నా మీరే నా హీరో నాన్న అన్నట్లు నా షర్ట్ గట్టిగా పట్టేసుకొని హత్తుకొని నా బుగ్గపై పెదాలను తాకించాడు .
లవ్ యు రా బుజ్జి అంటూ ముద్దులతో ముంచెత్తాను .
మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇక 5 నిమిషాలే ఉన్నా బాల్కనీలోకి ఒక్కరుకూడా వేరే వ్యక్తులు …