Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
టవల్ అందుకొని నాదేవతను చుట్టేసి మరొక టవల్ తో నా నడుముని చుట్టుకొని అమాంతం ఎత్తుకుని ముద్దులుపెడుతూ రూంలోకివచ్చి బెడ్ పై కూర్చోబెట్టి , ఒక్క నిమిషం అంటూ టేబుల్ దగ్గరకువెళ్లి మొబైల్ అందుకునేలోపు , వెనుక నుండి నన్ను హత్తుకొని , ఒక్క నిమిషం కూడా నా కిట్టయ్యను వదిలి ఉండలేను అని తియ్యని నవ్వుతో వీపుపై వాలిపోయింది .
లవ్ యు sooooooo మచ్ goddess అని ముందుకు లాగి గుండెలపై వాల్చుకొని నుదుటిపై పెదాలను తాకిస్తూ మొబైల్ అందుకొని మహికి కాల్ చేసాను .
బావ ఈ సమయంలో కాల్ చేసావు అంటే మా అక్కయ్యకు ఆకలివేసేలా ప్రేమసాగరంలో ముంచేశావన్నమాట అని ప్రక్కనే నా ఏంజెల్స్ ఉన్నట్లు ముసిముసినవ్వులు వినిపించాయి .
మీ అక్కయ్యే ఒక్క క్షణం కూడా నన్ను వదలకుండా ఇదిగో నీతో మాట్లాడుతున్నా కూడా హత్తుకొని తియ్యని ముద్దులుపెడుతోంది . ఇదిగో మాట్లాడండి అని చెవిదగ్గర ఉంచాను .
అక్కయ్యా ……….అని చిలిపిమాటలతో ఆటపట్టించినట్లు సిగ్గుపడి లవ్ యు చెల్లెళ్ళూ అని నన్ను మరింత చుట్టేసి చిలిపి నవ్వులు నవ్వి , అమ్మావాళ్ళు పడుకున్నారా అని అడిగింది .
అవును అక్కయ్యా …………వాళ్ళ బంగారుతల్లి లైఫ్ టైం సంతోషాన్ని అదే సుఖాన్ని పొందుతోంది అని వాళ్ళల్లో వాళ్లే మురిసిపోయి కొద్దిసేపటి ముందువరకూ ముచ్చటలుపెట్టి హాయిగా నిద్రపోతున్నారు .
మా అక్కయ్య కాల్ కోసం మేము మాత్రం ఆశతో ఎదురుచూస్తున్నాము .
లవ్ యు చెల్లి అని ఆనందబాస్పాలతో ……….చెల్లెళ్ళు వెంటనే మిమ్మల్ని చూడాలని ఉంది . కిట్టయ్యా …