Srungara Kathamaalika 280 : Bujjithalli Katha | Telugu Romantic Stories
Srungara Kathamaalika 280 : Bujjithalli Katha | Telugu Romantic Stories

మిత్రమా …… కొన్ని ఘడియల్లో స్వయంవరం – అమ్మవారిని దర్శించుకుని మళ్లీ రాజ్యానికి రావాలి . అలా చెప్పడం ఆలస్యం …… వేగాన్ని అందుకున్నాడు మిత్రుడు . మంజరీ …… సామాన్యుడినైన నేను స్వయంవరం కోసం రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో , ఒకవేళ ప్రవేశించినా ఏ రాజ్యానికి యువరాజుని అని చెప్పాలో ఉపాయమే బోధపడటం లేదు – అక్కడేమో దేవకన్యకు మాటిచ్చేసాను స్వయంవర సమయానికి తన ముందు ఉంటానని …… మంజరి : అమ్మవారి చెంతకు వెళుతున్నాముకదా ప్రభూ …… , మీఇద్దరి స్వచ్ఛమైన ప్రేమను ఒక్కటి చేసేందుకైనా అమ్మవారే ఒక దారిని చూయిస్తారు పదండి ……. మా మంజరి మాటలు నిజమవ్వాలి అంటూ ముద్దుపెట్టి , రెక్కలు ఆరేంతవరకూ గట్టిగా పట్టుకోమని చెప్పి మరింత వేగంతో పోనిచ్చాను – అమ్మవారి ఆలయం చేరుకున్నాము . మంజరితోపాటు దేవాలయపు ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ప్రశాంతంగా అనిపించింది . ప్రాంగణంలోని పూలమొక్కల నుండి అప్పుడే పూచిన పూలు కోసుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము . అమ్మా …… తొలిసారి మీ దర్శనం చేసుకున్నాను – ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే యువరాణిని కలిశాను , యాదృచ్చికమో మీ అనుగ్రహమో ……. ఆ క్షణమే గురువుగారి కోరిక వైపు అడుగులుపడ్డాయి . ముందుగా మీ భక్తురాలైన్ మహి …… తన తరుపున మీ దర్శనం చేసుకోమని నన్ను పంపినది – మహి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ప్రార్థించాను . అమ్మా …… మీకు తెలియనిది కాదు ఎలాగైనా ఈ గండం గట్టెంకించాలి అంటూ మొక్కుకున్నాను – ఏ ఆటంకం రానీకుండా ప్రభువుల సమక్షంలో యువరాణి చేతిని అందుకునేలా మీరే చెయ్యాలి …….. Responsive Image Grid ఆశ్చర్యంగా మంజరి తడి రెక్కలతోనే అమ్మవారి విగ్రహం భుజంపైకి చేరింది – ఏదో విన్నట్లు ……. నాదగ్గరకువచ్చి ప్రభూ నాతోపాటు రండి అంటూ బయటకు ఎగురుకుంటూ వెళ్ళింది . అమ్మవారికి మొక్కుకుని , బయటకువెళ్లి మిత్రమా అంటూ పరుగునవెళ్లి ఎక్కి వేగంగా వెనుకే చాలాదూరం వెళ్ళాను దక్షిణం వైపుగా ……. చిరులోయ దగ్గర ఆగి నా భుజంపైకి చేరింది – ప్రభూ …… అల్లంతదూరంలో చూడండి , నిన్నరాత్రి పడిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడటంతో రాజ్యానికి వెళ్లే ఈ మార్గం మొత్తం ఆనవాలు లేకుండా కిందకు కొట్టుకుపోయింది , ఈ దారిన స్వయంవరం కోసం ఏకంగా చిన్నపాటి సైన్యంతో పాటు వస్తున్న ఒక యువరాజు ఎటువెళ్ళాలో తెలియక ఈ దట్టమైన అరణ్యంలో రాత్రంతా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు , వీరిని చాకచక్యంగా మరొక దారివైపు మరల్చామంటే వీరి రాజ్యం తరుపున మనం దర్జాగా వెళ్లిపోవచ్చు ……. మంజరీ ……. అలా చేయడం …… మంజరి : తప్పే కాదు ప్రభూ ……. , నిజానికి ఈ ఉపాయం ఇచ్చినది అమ్మవారే , ఎలాగో యువరాణి ….. మీకు మాత్రమే సొంతమైనప్పుడు వీరు స్వయంవరానికి వస్తే ఎంత రాకపోతే ఎంత చెప్పండి . అంతేనంటావా మంజరీ …… అంతే అన్నట్లు మంజరితోపాటు మిత్రుడు కూడా ఊ కొట్టాడు . సరే అయితే సమయం లేదు పదండి , వారి రాజ్యమేదో తెలుసుకుని రాజా ముద్రిక అయిన ఉంగరాన్ని సంపాదించాలి – మంజరీ …… అక్కడ మాత్రం నువ్వు సాధారణ చిలుకలానే ప్రవర్తించాలి సరేనా ……. మంజరి : అర్థమైంది పభూ ……. , నా పలుకులను చూసి బంధించి తీసుకెళ్లిపోతారనే కదా , అయినా కాపాడటానికి నా ప్రభువు ఉన్నారుకదా …… , సరే సరే ఆ చిన్నపాటి సైన్యాన్ని చిత్తు చిత్తు చేసి నన్ను కాపాడగలరు కానీ ఇప్పుడు అంత సమయం లేదు కదూ …… , అలాగే ప్రభూ …… మీరు ఎలచెబితే అలా అంటూ తెగ మాట్లాడేస్తోంది . పెదాలపై చిరునవ్వుతో మంజరికి ముద్దుపెట్టి విరిగిపడిన కొండ చరియల మార్గంలోనే కష్టంగా అటువైపుకు చేరుకుని , ఏమీ తెలియనట్లు ఈ అడవి గురించి నాకు తెలియదా అంటూ పాటల రూపంలో పాడుకుంటూ వారి గుండా ముందుకుపోతున్నాను . నలుగురు సైనికులు అడ్డుగా నిలబడి , రేయ్ …… మా యువరాజుగారు పిలుస్తున్నారు పదా అన్నారు . పదండి అంటూ కిందకుదిగి వెనుకే వెళ్ళాను . యువరాజు ప్రక్కన సైన్యాధ్యక్షుడు అనుకుంటాను – రేయ్ చంద్ర రాజ్యానికి వెళ్ళడానికి వీ మార్గమేమైనా ఉందా ? . ఎందుకులేదు యువరాజావారూ ……. ఇలానే నిన్నకూడా ఒక యువరాజు ఈ మార్గంలో తప్పిపోతే సరైనమార్గంలో పంపించాను . సైన్యాధ్యక్షుడు : అయితే తొందరగా చెప్పరా …… , స్వయంవరానికి ఇప్పటికే ఆలస్యం అయ్యింది . చెబితే నాకేంటి ? . అంతే చుట్టూ కత్తులను నావైపుకు ఎక్కుపెట్టారు . నన్ను చంపేస్తే మీకు తోవ ఎవరు చెబుతారు యువరాజా ……. , ఇటువైపుగా ఒక్క మనిషీ రాడు . యువరాజు : ఆ రాజ్యపు అతిలోకసుందరి కోసం తప్పదు – ఏమికావాలో కోరుకో అంటూ ముందుకువచ్చాడు . ఏమీలేదు యువరాజా ……. , ఇంతకుముందు వెళ్లిన యువరాజులానే తమరుకూడా నాకు కౌగిలింత ఇవ్వాలి , ఇద్దరు యువరాజులను కౌగిలించుకున్నానని జీవితాంతం చెప్పుకుంటాను . యువరాజు : నీలాంటివాడితో ఇలా మాట్లాడటమే గొప్ప – వీడని చిత్రహింసలు పెట్టి శిక్షించయినా మార్గం తెలుసుకోండి . ప్రాణం తీసినా చెప్పను యువరాజా ……. , ఇక మీఇష్టం ఎలాగైనా శిక్షించుకోండి అంటూ దైర్యంగా చేతులను విశాలంగా చాపాను . సైన్యాధ్యక్షుడు : యువరాజా …… సమయం పరిగెడుతోంది – మీకోరిక తీరాలంటే...