Minor Raja

Minor Raja Part 68 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 77 కాసులు తాత మెళ్ళో ఉన్న తుండుగుడ్డని నా కళ్లకి కట్టి; అసలు అవసరం లేదనుకో, అంతా చీకటే! అయినా తువాలు నా కళ్ళకి గంతలు కట్టి, తను ఓ కర్ర పట్టుకుని నేల మీద కొడుతూ, నన్ను ఆ వైపుకి విసరమంటూ నాకు ఓ గుప్పెడు గులకరాళ్లు ఇచ్చాడు. తాత ఎక్కడ చప్పుడు చేస్తే ఆల్మోస్ట్ అక్కడికే నేను ఒక్కో రాయినీ విసురుతూ పోయా. అదో గంట అయ్యేసరికి, నేను పెర్ఫెక్ట్ అయ్యా. ఓ గంట తర్వాత నాకు గంతలు విప్పి, ఓ అయిదు నిముషాలు వదిలేసి, మళ్లీ గంతలు కట్టి ఈసారి చప్పుడు అయిన చోటులోకి బాణాలు వదలమన్నాడు. ఓ అరగంట సీరియస్గా ప్రాక్టీస్ చేశా. ఎప్పుడోచ్చిందో అమ్మ సైలెంటుగా భ్రమర పిన్నిని వెంటవేసుకుని వచ్చి, ఓ మంచె ఉంటే అదెక్కి కూర్చుంది. అమ్మ గొంతు వినిపించింది నాకు. భ్రమరతో గుసగుసలాడుతోంది. నేను తాత చెప్పిన వైపు కాకుండా అమ్మ ఉన్న వైపు బాణం వేశా. అది పోయి మంచె కర్రల్లో ఓ కర్రకి నాటుకుంది. అమ్మ షాక్! నేను రాక్స్! కాసులు తాత “ఏం చేస్తున్నావ్ చిన్న దొరా?” అని గదమాయించేసరికి, నేను నవ్వి, “తాత గారూ, అమ్మ వచ్చిందిగా? రాత్రి నన్ను వెక్కిరించింది. అందుకే తనకి ఓ బాణంతో వెల్కం చెప్పా” అంటూ ప్రాక్టీస్ కంటిన్యూ చేశా. అమ్మ ఉందిగా? నా ప్రాక్టీస్లో ఏకాగ్రత మెల్లగా తగ్గుతోంది. కాసులు తాత అది గమనించి, “నీకు, ఈ శరం టెస్ట్” అంటూ ఓ చోట కొట్టాడు. బాణం వదిలిన వెంటనే, నేను నా గంతలు విప్పి చూసేసరికి, అది తాత మార్క్ చేసిన చోటుకి ఓ అడుగు దూరంలో పడింది. అమ్మ ఆశ్చర్యపోయింది. భ్రమర పిన్ని అయితే చిన్న పిల్లలా చప్పట్లు కొట్టి, ఓ విజిల్ వేసింది. కాసులు తాత ఇద్దరివైపూ సీరియస్గా చూసేసరికి, ఇద్దరూ ఠప్పున నోళ్ళు మూసుకుని సైలెంటుగా చూడడం మొదలెట్టారు. కాసేపు ఆ ప్రదేశం ఠంగుమంటూ తాత కర్రతో చేసే శబ్దాలతోనూ, “సర్ర్ సర్ర్” అంటూ నేను దూస్తున్న బాణాల హోరుతోనూ దద్దరిల్లిపోయింది. ఓ పావుగంటలో నాతో కనీసం 20 బాణాలు వేయించాడు తాత. అట్టర్ ఫ్లాప్ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker