మదన సుందరి – 133 వ భాగం – Continued
రచన: గుడ్ మెమొరీస్
This Episode 11 Pages – Posted on MAY 8, 2024
=============================================
(మీ అభిప్రాయాలను nrtalkies@gmail.com కి తెలియచేయండి)
=============================================
– 3 –
చాలా చురుకైన వాళ్ళు.. సరైన అవకాశం గురింపు లేక మరుగున పడిపోయారు. అంటూ వాళ్ళిద్దరినీ పరిచేయం చేస్తూ MD గారు ఆరోజు ఆఫీసులో సేల్స్ టీమ్ చేసిన మోసం మొదలుకుని ఇంటికి వచ్చేఅంత వరకూ జరిగిన మొత్తం విషయాలను పూసగుచ్చినట్లు తన భార్య సాన్వీ కి వివరంగా చెప్పారు.
(సాన్వి నార్త్ ఇండియా లో పుట్టి పెరిగిన పిల్ల. ఆంధ్రాకు వచ్చి 6 సంవత్సరాలే అయ్యింది. ఆమె తెలుగు ఒకరకమైన హిందీ యాసతో, తెలుగు పదాల మధ్య హిందీ పదాలు కలిపి మాట్లాడుతుంది.. మన చదువరుల సౌకర్యార్ధం నేను ఆమె మాట్లాడే మాటలను మనకు అనుగుణమైన నా భాషలో రాస్తున్నాను)
సాన్వి కళ్ళు ఇంతలు చేసుకుని బ్రహ్మం, సుందరాలను చూస్తూ.. అమేజింగ్.. ఇప్పటి వరకూ నా జీవితంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని సంఘటన. ఈవేళ మన కంపెనీలో జరిగినదాన్ని ఒక సినిమాగా తియ్యవచ్చు.. అయినా కానీ కంపెనీ పట్ల మీకు ఉన్న డెడికేషన్ కి మీ ఇద్దరికీ సన్మానం చెయ్యాలి. మరైతే వీళ్లిద్దరికీ ఏమైనా ప్రమోషన్ ఇస్తున్నారా..? ఉత్స్తాహంగా అడిగింది సాన్వి.
ఆ ఇచ్చాను.. ఇచ్చాను.. వీళ్లిద్దరికీ అప్పుడే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి ఇప్పటికి 3 గంటలు అయ్యింది.. అన్నారు MD గారు నవ్వుతూ..
ఆ మాట విన్న సాన్వి ఆశ్చర్యపోతూ అదేంటి..? మంచి పనిచేసిన వాళ్లకు ఇలా కూడా సత్కరిస్తారా..? అడిగింది ఆశ్చర్యంగా..
అది నా నిర్ణయం కాదు.. ఆ సలహా కూడా వాళ్ళే ఇచ్చారు.. నవ్వుతూ చెప్పారు MD గారు..
అప్పుడు రమణ కల్పించుకుంటూ.. అలా కాదు భాబీ.., ఈ 300 కోట్ల బిడ్ విషయంలో ఇంత పెద్ద కంపెనీని మోసం చెయ్యడం ఒక్క 6 మంది సేల్స్ టీమ్ వల్ల సాధ్యం కాదు కదా..?. ఈ కుట్రలో తెరవెనుక చాలా మంది పాత్రధారులు ఉండి ఉంటారు. ఈ విషయంలో కంపెనీలో క్రిందిస్థాయి వ్యక్తులను ఆ 6 మంది సేల్స్ టీమ్ ని సస్పెండ్ చేసి కొద్దికాలం మౌనంగా ఉన్నామంటే తమకు ఎటువంటి ప్రమాదమూ లేదని పందికొక్కులు మళ్ళీ విచ్చలవిడిగా స్వేచ్ఛగా వాటి పని అవి మొదలుపెడతాయి. మన MD గారు అప్పుడే తన గూఢాచారులను పనిలో పెట్టారు. ఈ మోసంలో భాగస్వామ్యులైన పందికొక్కులు 1-2 నెలలు జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడి వ్యవహారమంతా సద్దుమణిగింది అని అనుకుంటాయో అప్పుడు వాళ్ళు మళ్ళీ కంపెనీకి గోతులు తీసే పని మొదలుపెడతాయి. …