Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
మేడం ఎంత లేట్ అయినా ఈరోజుకి స్టేజి decoration పూర్తిచేసెయ్యాలి . రేపు అంటే కుదరదు , రేపు గ్రౌండ్ మొత్తం స్టూడెంట్స్ కు ఎండ తగలకుండా టాప్ మొత్తం పరదాలతో కప్పే పని ఉంది . మీరు కూడా తప్పకుండా ఉండాలి . మీరు చెప్పినట్లుగా చకచకా పూర్తిచేసేస్తాము . ఒక 10 మందికి మాత్రం ఫుడ్ తెప్పించండి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
మహేష్ ………..అని ధీర్ఘం తీస్తూ నావైపు చూసింది ఐశ్వర్య .
రేయ్ కృష్ణ మౌనీష్ అనిపిలిచి గెస్ట్స్ కోసం రేపు వేయడానికి తెప్పించిన సోఫాలను ఒకటి తరువాత మరొకటి ఐదు స్టేజి ఎదురుగా తెచ్చి కూర్చోండి ఎంతసేపని నిలబడతారు అనిచెప్పాను .
ల…………..థాంక్స్ మహేష్ అని మురిసిపోతూ , ఏంటే మీరు ఉంటారా లేక హాస్టల్ కు వెళతారా అని ఐశ్వర్య తన క్లోజ్ ఫ్రెండ్స్ ను అడిగింది .
మా ఫ్రెండ్స్ తోనే మేము హాస్టల్ క్లోజ్ చేస్తారు మీఇంటికివచ్చి పడుకుంటాము అని బదులిచ్చారు .
లవ్ యు లవ్ యు వే అని ఒకరినొకరు కౌగిలించుకుని , మహేష్ సోఫాలను రౌండ్ గా వెయ్యి అనిచెప్పారు .
As you wish sist……….. నో నో ………అని తలవంచి క్షణాల్లో సోఫాలను రౌండ్ గా వేశాము .
అందరూ నవ్వుకుని కూర్చున్నారు . ఐశ్వర్య నాదగ్గరికివచ్చి వాళ్లకు ఫుడ్ అని డబ్బు నా జేబులో ఉంచింది .
Related Articles
Oka Koduku Prayanam – 337
7 hours ago
Oka Koduku Prayanam – 338
7 hours ago
Oka Koduku Prayanam – 334
1 day ago
Oka Koduku Prayanam – 335
1 day ago
ఐశ్వర్య ……….
తెలుసు తెలుసు ఇది కాలేజ్ మనీ కేవలం వాళ్లకోసం మాత్రమే , మా అందరికోసం డబ్బు ఇవ్వలేదు నీఇష్టం అని తియ్యని నవ్వునవ్వి వెళ్లి ఫ్రెండ్స్ తోపాటు కూర్చుని ముచ్చట్లలో పడిపోయారు .
అయితే ok అని ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చోమని రూపకు సైగ చేసి తన ప్రక్కనే కూర్చుని రమేష్ గారికి కాల్ చేస్తుంటే బిజీ అని వస్తుంటే కృష్ణగాడివైపు చూస్తే ఫోన్ మాట్లాడుతుండటం చూసి అయితే వాడే అని స్టేజి decoration చూస్తూ కూర్చున్నాను . అమ్మకు విషయం చెప్పనా అని రూప మహికి కాల్ చేసి మాట్లాడుతోంది . మౌనీష్ మా వెనుక సోఫాలో కూర్చుని తన లవ్ తో మాటల్లో పడిపోయాడు.
కృష్ణగాడు వచ్చి పనివాళ్లకు బిరియానీ ఆర్డర్ చేసేసాను , నీ మొబైల్ కు మెనూ కార్డ్ వచ్చింది వాళ్లకు ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పాడు .
మెనూ కార్డ్ ను నేను వాళ్ళ గ్రూప్ లో ఉన్న గ్రూప్ కు వాట్సాప్ చేసి , ఐశ్వర్య ఎవరికి ఏమికావాలో రాసివ్వండి అనిచెప్పాను .
ఏమేమి ఉన్నాయో ముందు తెలియాలికదా అని ఐశ్వర్య అడుగుతుండగానే , ఒసేయ్ ఒసేయ్ వాట్సాప్ చూసుకొండే అని ఒకరు చెప్పడంతో చూసి నోరుతెరిచి ఆశ్చర్యపోతూ పెన్ పేపర్ అందుకొని నాదుబిది నాకు అది ……….అంటూ …