Nastajathakudu

Nastajathakudu – 102

episode-97 ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్న మేము మరుసటి రోజు 11:30 సమయానికి ఒకరి తర్వాత ఒకరు నిద్రలేచాము. ముందుగా అమ్మ లేచి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి టైం చూసుకుని మా ఇద్దరి తలలు నిమురుతూ, నాన్న దీపు,,,, అమ్మా బుజ్జిముండ,,, లేవండి. ఇదిగో చూడండి లంచ్ టైం అయిపోతుంది మనము ఇంకా పడుకున్నాం అని అంది. …. ప్రీతి నిద్రలో గొణుగుతూ, ఇంకొంచెంసేపు పడుకుంటాను మమ్మీ,,,, అని దీర్ఘం తీసింది. …. నా బంగారం కదూ,, లేచి ఫ్రెష్ అయ్యి ఏదన్నా తినేసి మళ్ళీ పడుకుందువు గాని లేరా తల్లి. …. ఇంతలో నేను నిద్రనుంచి మేలుకొని బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ లేచి కూర్చున్నాను. మరి కొద్దిసేపు అమ్మ బుజ్జగిస్తూ లేపే సరికి ప్రీతి కూడా లేచి కూర్చుంది. అమ్మ తన ఫోన్ తీసుకుని ఆన్లైన్లో భోజనం ఆర్డర్ పెట్టింది. ఆ తర్వాత ముగ్గురం స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి కడుపు నకనకలాడుతుండటంతో ఆర్డర్ రాగానే  గబగబా భోజనం చేసి రిలాక్స్ అయ్యాము. ఎప్పుడు చేసిందో తెలియదు గానీ ప్రీతి ఫోన్ చేయడంతో ఆ రోజు సాయంత్రం అను ఇంటికి వచ్చింది. వస్తూనే సోఫాలో కూర్చున్న నన్ను వెనకనుంచి నెత్తి మీద చిలిపిగా ఒక దెబ్బ వేసి, అయిపోయాయా అయ్యగారి షికార్లు? అంటూ ముందుకు వచ్చి సోఫాలో నా పక్కన కూర్చుని, నాకు చెప్పకుండా ప్లాన్ చేసుకొని వెళ్లిపోయారు కనీసం ఫోన్ లో అయినా మాట్లాడొచ్చుగా? అని బుంగమూతి పెట్టుకుని నా భుజం మీద కొట్టింది. …. అను గుర్తు చేసేంతవరకు నా ఫోన్ ఎక్కడుందో కూడా నేను మర్చిపోయాను. ఇంతలో పైనుంచి మెట్లు దిగుతూ వస్తున్న ప్రీతి అను ని చూసి, హాయ్ అను,,, ఎంత సేపు అయ్యింది వచ్చి అని పలకరించి నా ఫోన్ కోసం అయోమయంగా దిక్కులు చూస్తున్న నన్ను చూసి, ఏంటన్నయ్య అలా వెతుక్కుంటున్నావు? అని అడిగింది. …. నా ఫోన్ ఎక్కడ పెట్టానో,,, అని అంటుండగా అమ్మ తన రూమ్ లో నుంచి వస్తూ, ఇదిగో నాన్న నీ ఫోను,,, అని అందించి, ఏరా అను,,, ఎలా ఉన్నావు? అంటూ నవ్వుతూ పలకరించి అను నుదుటి మీద ముద్దు పెట్టి తన పక్కన కూర్చుంది. పొండి ఆంటీ,,, మీరు కూడా నాతో చెప్పకుండా వెళ్లిపోయారు. నాకు ముందే చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా? ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొట్టేసింది అని అమ్మ దగ్గర గారాలు పోయింది. …. లేదు రా తల్లి,,,  మీ అంకుల్ సడన్ గా డేట్ ఫిక్స్ చేసి బయలుదేరమన్నారు అందువల్ల ఎవరికీ చెప్పడం కుదరలేదు. సరేగాని అభి, దేవి ఎలా ఉన్నారు? అని అడిగింది అమ్మ. …. బాగానే ఉన్నారు ఆంటీ, ఇంతకీ ట్రిప్ ఎలా జరిగింది? అని అడిగింది అను. …. ప్రీతి మాట్లాడుతూ, సూపర్ గా ఉంది. కానీ చాలా తక్కువ రోజులే అక్కడున్నాము ఈసారి వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని అంది. …. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా నేను నా ఫోన్ ఆన్ చేసుకుని చూసేసరికి వరుసనే టింగు టింగు మంటూ నోటిఫికేషన్స్ స్క్రీన్ మీదకి వచ్చి పడ్డాయి. ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker