episode-116
నాకు మెలకువ వచ్చి నిద్రలేచేసరికి చీకటిగా అనిపించింది. నన్ను ఎవరో గట్టిగా కౌగిలించుకొని పడుకున్నారు. నేను చేతితో తడిమి చూడగా వీపుమీద ఎటువంటి ఆచ్చాదన లేకుండా నగ్నంగా ఉండడంతో అది నా బంగారం ప్రీతి అని అర్థమైంది. కానీ ఎందుకు అంత గట్టిగా పట్టుకొని పడుకుంది అని అనుకుంటూ చేతిని అలాగే కిందికి పోనిచ్చి నిమిరే సరికి చేతికి ప్యాంటీ తగిలింది. ఈరోజు నా బంగారం ప్యాంటీ వేసుకుని పడుకుంది ఏంటి? అని ఆలోచిస్తూ కళ్ళు నులుముకుని చూసేసరికి అప్పటికి బెడ్ లైట్ వెలుతురు సంతరించుకోవడంతో నేను హాల్ లో సోఫాలో పడుకున్నాను అని తెలిసింది. నాతో పాటు ప్రీతి కూడా అక్కడే పడుకోవడంతో కొంచెం ఇరుకుగా ఉండి సేఫ్టీ కోసం నన్ను గట్టిగా పట్టుకుని పడుకుంది అని అర్థమైంది.
కొంతసేపు అలాగే ఉండి పూర్తిగా ముత్తు వీడిన తర్వాత ప్రీతిని జాగ్రత్తగా పట్టుకుని పక్కకి తిరిగి తనని సోఫాలో పడుకోబెట్టి నేను లేచి నిల్చుని నా ఒంటి మీద పూర్తిగా బట్టలు ఉండడం చూసుకుని రాత్రి రాగానే అమ్మ ఒళ్ళో నిద్రపోయిన సంగతి గుర్తుకొచ్చింది. అలాగే నా రూమ్ లోకి వెళ్లి టైం చూసేసరికి తెల్లవారి 4:00 అయ్యింది. బాత్రూం లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్ కి వెళ్ళిపోదామని బయలుదేరి ప్రీతి అక్కడే హాల్లో ఉండిపోవడంతో తనని నా బెడ్రూమ్ లో పడుకోబెడదామని రెండు చేతులతో లేపి పట్టుకునే సరికి ప్రీతికి మెలుకువ వచ్చి దిగి నిల్చుని నాకు ఒక ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పింది. నేను కూడా ముద్దు పెట్టి, గుడ్ మార్నింగ్ రా బంగారం,,, రాత్రి నేను లేవకుండా ఇక్కడే పడుకున్నానా? అను, జ్యోతి, పవిత్ర ఇక్కడే ఉన్నారా వెళ్లిపోయారా? అని అడిగాను.
అను, జ్యోతి వెంటనే వెళ్లిపోయారు. నువ్వు బాగా మత్తుగా నిద్రపోవడం వల్ల మమ్మీ నిన్ను డిస్టర్బ్ చేయద్దు అని చెప్పడంతో పవిత్రని నేనే తీసుకొని వెళ్లి ఇంటిదగ్గర దింపి వచ్చాను. నువ్వు నిద్ర లేస్తే తింటావని నీకోసం భోజనం కూడా టేబుల్ మీద పెట్టింది మమ్మీ. అందుకే నేను కూడా నీ దగ్గరే పడుకున్నాను అని చెప్పింది. …. సరే బంగారం నువ్వు వెళ్లి పడుకో నేను బయలుదేరుతాను అంటూ ప్రీతిని హగ్ చేసుకుని నుదుటి మీద …