Nastajathakudu

Nastajathakudu – 92

episode-90 మేము టూర్ కి వెళ్లేందుకు ఇంకా వారం రోజులు టైమ్ ఉండడంతో ఈ లోపు మరొక కేసు ముగించేందుకు నిర్ణయించుకొని ఆ పని మీద సీరియస్ గా దృష్టి పెట్టాను. ఎందుకంటే ఆ కేసు ఒక ఎంపీ కి సంబంధించినది. ఇప్పుడు నేను అటాక్ చేయబోయే వ్యక్తి సదరు ఎంపీ కి రైట్ హ్యాండ్. అతను ఒక మత్స్యకార సంఘానికి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని లేపేసిన తర్వాత ఇంట్లో స్తబ్దుగా కూర్చోవడం కంటే బయటికి వెళ్ళిపోయి ఫ్యామిలీ టూర్ ఎంజాయ్ చేయడం మంచిది అనిపించింది. ఇక అప్పట్నుంచి ఎంపీ అనుచరుడి కోసం రెక్కీ నిర్వహిస్తూ వివరాలు సేకరించడం మొదలు పెట్టాను. అతను ఎంపీ కి సంబంధించిన బ్లాక్ మార్కెట్, స్మగ్లింగ్ లాంటి పనులను ఎంపీ కి సంబంధం లేనట్టు నడిపిస్తూ ఆయనకు అండదండగా ఉంటాడు. అతను గంగవరం పోర్టు దగ్గర మత్స్యకార గ్రామంలో తన సొంత నివాసంలో ఉంటాడు.  ఆ ప్రాంతంలో అతను చాలా ఫేమస్. అతని చుట్టూ ఎప్పుడూ మంది మార్బలం అతని ఆజ్ఞానుసారం పని చేస్తూ ఉంటారు. పోర్టుకు సంబంధించిన కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు అతని చెప్పుచేతల్లో పని చేయాల్సిందే. వారిని ఉపయోగించుకొని స్మగ్లింగ్ యదేచ్ఛగా చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో సామాన్యులు కూడా అతనికి భయపడి ఎదురు చెప్పకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆ ప్రాంతంలో అతని మాట శాసనం అటువంటి వ్యక్తిని లేపేయడం అంత ఆషామాషీ కాదు. కానీ అటువంటి వ్యక్తిని లేపేయడం ద్వారా రుద్రకి నా మీద అనుమానం రాకుండా గట్టి నమ్మకం ఏర్పడేలా చేసుకోవచ్చు. దాని తర్వాత నేను కొద్దిరోజులపాటు ఎటువంటి పని చేయకపోయినా రుద్రకి నా మీద అనుమానం రాదు. రుద్రకి చెప్పవలసిన అవసరం లేకుండా ఆ సమయాన్ని నేను టూర్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక ఐదు రోజుల పాటు రెక్కీ నిర్వహించి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాను. మధ్య మధ్యలో ఇంటికి వెళ్లి అమ్మ, ప్రీతిలను కలుస్తూ టూర్ తాలూక ఏర్పాట్లు కూడా తెలుసుకున్నాను. సరిగ్గా టూర్ కి బయలుదేరే ముందు రోజు రాత్రి వర్క్ స్టేషన్ లో ఉన్న నా గన్ మరియు అవసరమైన సామాన్లు బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని జంక్షన్ వరకు నడుచుకొని వెళ్లి సిటీబస్సులో నేను చేరాల్సిన చోటికి బయల్దేరాను. అక్కడికి కొద్దిపాటి దూరంలో ఉన్న ఒక పాత సినిమా హాల్లో టికెట్ తీసుకుని సినిమా చూసి బయటికి వచ్చి ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడుతూ ఎంపీ అనుచరుడి ఇంటికి చేరుకున్నాను. ఆ ఇంటికి ముందువైపు సెక్యూరిటీ కెమెరాలు ఉన్నాయని ముందే తెలుసుకోవడంతో వెనుక వైపు వీధిలో నుంచి వెళ్లి అతని ఇంటి వెనుక అతను కబ్జా చేసిన స్థలంలో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నాను. అర్ధరాత్రి దాటడంతో ఎటువంటి అలికిడి లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఒక వాచ్ మెన్ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు. నేను చప్పుడు చేయకుండా లోపలికి ప్రవేశించి నెమ్మదిగా మెట్లెక్కుతూ రెండో ఫ్లోర్ కి చేరుకున్నాను. ఆ ఫ్లోర్ కి సమాంతరంగా ఎంపీ అనుచరుడి పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ ముందర ఖాళీ స్థలంలో ప్రతిరోజు అతను యోగా చేయడానికి వస్తాడు. ఆ సమయంలో అతను ఒంటరిగా ఉంటాడు కాబట్టి అదే సమయాన్ని అతనిని లేపేయడానికి ఎంచుకున్నాను. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఉన్న ఒక పొడవాటి చెక్క బల్లను శబ్దం చేయకుండా తీసుకొని వెళ్లి రెండు బిల్డింగ్ ల మధ్య వారధిలాగా సెట్ చేశాను. దానిమీద జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker