మరుసటి రోజు పొద్దున నేను నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్లి వచ్చేసరికి ఆమె కాళ్ళు దగ్గరకు ముడుచుకుని పక్కకు తిరిగి పడుకొని వణుకుతూ కనిపించింది. అది చూసి నేను కొంచెం కంగారు పడ్డాను. అక్క,, అక్క,, అంటూ పిలిచాను. అందుకు సమాధానంగా ఆమె సన్నగా మూలిగింది కానీ కళ్ళు తెరవలేదు. నాకు డౌట్ వచ్చి నుదిటి మీద చేయి పెట్టి చూసే సరికి చాలా వేడిగా అనిపించింది. బహుశా నిన్న జరిగిన సంఘటనకి భయపడడం వల్ల లేదంటే ఎక్కువగా పరిగెట్టి ఒళ్ళు అలిసిపోయి ఉండడం వలన జ్వరం వచ్చి ఉంటుంది అని అనుకున్నాను. మళ్ళీ ఆమెను పిలుస్తూ భుజం మీద తట్టి నిద్ర లేపాను. ఆమె కొంచెం నీరసంగానే లేచి కూర్చుంది.
అక్క నీకు జ్వరంగా ఉన్నట్టుంది. కొంచెం వేడి నీళ్లు పెడతాను స్నానం చేసి టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకుందువు గాని అని అన్నాను. అందుకు ఆమె నీరసంగానే తల ఊపింది. వెంటనే నేను స్టవ్ మీద నీళ్లు పెట్టి బ్రష్ చేసుకోవడానికి ఆమెకు బ్రష్ మరియు పేస్ట్ అందించాను. అతి కష్టం మీద ఆమె పైకి లేచి నుంచుని ముందుకు తూలి పడబోయింది. ఆమె కింద పడిపోకుండా వెంటనే నేను పట్టుకున్నాను. ఆ తర్వాత అలానే ఆమెని నడిపించుకుంటూ బాత్రూం లోకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న ప్లాస్టిక్ స్టూల్ పై ఆమెను కూర్చోబెట్టి గోడకు ఆనించి బ్రష్ మీద పేస్ట్ పెట్టి అందించాను. ఆమె దానిని అందుకుని నోట్లో పెట్టుకుని బ్రష్ చేయడం పూర్తి చేసింది.
తర్వాత నేను మరిగిన నీళ్లను బాత్రూంలో ఉన్న బక్కెట్లో పోసి స్నానం చేయమని చెప్పి బయటికి వచ్చాను. నేను బయటకు వచ్చిన రెండు నిమిషాలకు దబ్ మని సౌండ్ రావడంతో బాత్రూం డోర్ దగ్గరికి వెళ్లి అక్క?? అని పిలిచాను. లోపలినుండి ఆమె సన్నని మూలుగు మాత్రమే వినిపించింది. నాకెందుకో డౌట్ వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూశాను. ఆమె కుర్చీ మీద నుంచి కిందపడిపోయి కనిపించింది. వెంటనే నేను కంగారు పడి లోపలికి వెళ్లి ఆమెను లేపి కూర్చుండబెట్టి కొంచెం నీళ్లు తీసుకొని మొహం మీద చల్లాను. ఆమె తేరుకుని నీరసంగా నా వైపు చూసింది. బహుశా ఆమెకు ఒంట్లో ఓపిక లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె పైన వేసుకున్న షర్ట్ తీసి పక్కన పెట్టేసింది. కింద కట్టుకున్న లుంగీ కూడా ఊడిపోయి ఉంది.
ఆమె నా వైపు చూసి చేతితో నీళ్ళ బకెట్ ని చూపించి నీళ్లు తన నెత్తి మీద నుంచి పోయి అన్నట్టు సైగ చేసింది. నేను ఆమె చెప్పినట్టే జగ్గుతో …