episode-127
దినేష్ వర్మ ఇంటిదగ్గర………..
దీపు చెప్పినట్టే అంతిమ సంస్కారాలు ముగించి విషాద వదనాలతో నటిస్తూ సుమతి, కార్తీక, పవిత్ర, దీప్తి మరియు హర్షవర్మ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్లు లోపలికి రాగానే రాధిక మాట్లాడటం మొదలు పెట్టింది. అయ్యగారి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి వచ్చారా? ఆ రాక్షసుడి మీద తెగ ప్రేమ పొంగుకొచ్చింది అని నిష్టూరంగా మాట్లాడింది. …. ఇక చాలు ఆపు ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. బుజ్జి, దీప్తి, పిన్ని మీరు లోపలికి పదండి అని అంది కార్తిక. …. ఆ ఆ,,, వెళ్లండి వెళ్లండి ఆ నష్టజాతకుడు పోయినందుకు అందరూ కలిసి కట్టకట్టుకుని ఏడవండి. కానీ నా కూతుర్ని మాత్రం వదిలేయండి దాన్ని మీలాగా తయారు చేయకండి అర్థమైందా? దీప్తి నువ్వు ఇటు రా అని అంది రాధిక. …. వెంటనే హర్షవర్మ మాట్లాడుతూ, ఏం అవసరం లేదు దీప్తి తల్లి నువ్వు అక్క వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళు దీని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒసేయ్ కర్కశురాల నీకు ఇదే చెబుతున్నాను నా కూతుర్ని నీలాగా తయారుచేయడానికి ప్రయత్నించవద్దు అర్థమైందా? అని గట్టిగా మందలించాడు. …. బాబు కూతుర్లు ఇద్దరూ కలిసి ఎలాగో తగలడండి అని చిర్రుబుర్రులాడుతూ లోపలికి వెళ్ళిపోయింది రాధిక.
**********
కార్లో వెళుతున్న నేను, గయ్స్ ఒకసారి కార్ ఆపండి అనగానే జెస్సీ కారు ఆపాడు. సోము తార మీరు క్యాజువల్ గా బండి దిగి మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో ఓ లుక్కేసి రండి అని చెప్పగానే ముందుగా సోము దిగి పాస్ పోసుకున్నట్టు నటిస్తూ నిలుచున్నాడు. ఆ తర్వాత తార కూడా దిగి ఒళ్ళు విరుస్తూ ఒకసారి చుట్టూ లుక్కేసి ఓ రెండు నిమిషాలు తర్వాత ఇద్దరు మళ్లీ కార్లోకి ఎక్కి, నథింగ్ ఎవరూ లేరు అని చెప్పారు. …. జెస్సి మన రెగ్యులర్ రూట్ కాకుండా వేరే రూట్ తీసుకొని ఎక్కడైనా ఒక మెడికల్ షాప్ కి పోనివ్వు అని చెప్పి రిలాక్స్ అయ్యాను. నేను చెప్పినట్టే జెస్సీ రూట్ మార్చి సిటీలో వేరు వేరు రోడ్లు మారుస్తూ ఒక కాలనీలో ఉన్న మెడికల్ షాప్ దగ్గర ఆపాడు. తార వెళ్లి నా గాయాలకు డ్రెస్సింగ్ కోసం అవసరమైనవన్నీ తీసుకో అలాగే మంచి పెయిన్ కిల్లర్స్ ఇంకా ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా తీసుకో అని చెప్పాను.
తార వెళ్లి ఒక అరగంటసేపు షాపింగ్ చేసి బ్యాగులు పట్టుకొని వచ్చి కారులో కూర్చుంది. గయ్స్ మనము ఇప్పుడు ఎక్కడైనా స్టే చేసి రేపు తెల్లవారి తిరిగి మనం వర్క్ స్టేషనుకి వెళ్దాం అని అన్నాను. …. ఏం ఎందుకలా? అని అన్నాడు సోము. …. ఏం లేదు కొంచెం సేఫ్టీ కోసం. నేను చనిపోయానని అనుకుంటున్న వాళ్లకి ఏమాత్రం డౌట్ రాకూడదు. మనము రేపే ఒక చిన్న మిషన్ పూర్తి చేయాలి అది కూడా ఎవరికీ తెలియకుండా చేయాలి. మనం ఎక్కడికి వెళితే బాగుంటుందో ఆలోచించండి అని అంటున్న సమయంలో నా ఫోన్ రింగ్ అయ్యింది. వెంటనే తార తన దగ్గర ఉన్న నా ఫోన్ తీసి నాకు అందించింది. అది నా బంగారం ప్రీతి దగ్గర నుంచి వస్తున్న కాల్ …