Nastajathakudu

Nastajathakudu – 129

episode-115 అను నన్ను కార్లో కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. దారిలో ఒక ఫుట్ పాత్ పక్కన పూలదుకాణం దగ్గర కారు ఆపి తనే దిగి వెళ్లి తులిప్ రోజెస్ కొనుక్కొని వచ్చి స్టీరింగ్ ముందు డాష్ బోర్డ్ మీద పెట్టి మళ్లీ డ్రైవ్ చేయడం మొదలు పెట్టింది. నాకెందుకో కొంచెం తేడాగా అనిపించి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? అని అడిగాను. …. నిన్ను తీసుకెళ్లి అమ్మేద్దామని,, కొంచెం సేపు ఓపిక పట్టలేవా? అని ఎగతాళి చేసి తనలో తాను నవ్వుకుంటూ కారు స్పీడ్ గా పోనిచ్చింది. కొంతసేపటికి హైవేలో డ్రైవ్ చేసి తర్వాత ఒక కొండ పక్కన ఉన్న ఎడమవైపు రోడ్డులోకి పోనిచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళుతున్నామో అప్పుడు నాకు అర్థమయింది. కొంచెం లోపలికి ఒక లవర్స్ పార్క్ ఉంది. సాధారణంగా అక్కడకి లవర్స్ మాత్రమే వస్తారు. మేము వెళ్లి కార్ పార్క్ చేసేసరికి అక్కడ సోము, తార వచ్చిన కార్ పార్క్ చేసి ఉండడం కనబడింది. అది చూడగానే, ఓహో,,,, వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చారా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో? అని మనసులో అనుకొని అను తో కలిసి ముందుకు అడుగులు వేశాను. సోము తారల ఆలోచనలో పడి అను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చింది అన్న విషయం మర్చిపోయాను. లోపలికి వెళ్లగా అక్కడ ఒక కార్నర్ రింగ్ కి ఆనుకొని సోము తార ఎదురుగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. బహుశా కొంచెం సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు కాబోలు మా వైపు చూడలేదు. నేను మాత్రం వాళ్ళని చూస్తూ నడుస్తుండటంతో అను కూడా అటువైపు చూసి ఒక్కసారి నా వైపు అనుమానంగా చూసింది. అను నన్ను చూడటం గమనించి నా భుజాలు ఎగరేస్తూ నాకేమీ తెలీదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇద్దరం కలిసి వాళ్లకి సుమారు ఒక ఇరవై అడుగుల దూరంలో రింగ్ కి ఆనుకొని నేను నిల్చోగా అనూ చేతిలో పువ్వులతో చేతులు కట్టుకుని నాతోపాటు వాళ్ళిద్దరి వైపు చూస్తు నిల్చుంది. కొద్దిసేపటికి సోము చిరునవ్వు నవ్వుతూ ఒక కాలు మడిచి మోకాళ్లపై నిల్చొని తన జేబులో నుంచి ఒక చిన్న బాక్స్ అందులో నుంచి రింగ్ తీసి తారకు ప్రపోజ్ చేస్తుండడం అందుకు తార కొంచెం సిగ్గుపడుతూ తన తల …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker