Nastajathakudu

Nastajathakudu – 104

episode-99 ఫైటర్ రాజు ఉన్న ఏరియాలోకి ప్రవేశించి ‘ఆల్ ద బెస్ట్’ చెప్పి నేను ఆ ముగ్గురి నుండి విడిపోయి తొందరగా రాజు అడ్డా దగ్గరికి చేరుకున్నాను. ముందు ఒక బిల్డింగ్ లాగా ఉండి దాని గేటు దగ్గర ఇద్దరు వ్యక్తులు గస్తీ కాస్తున్నారు. ఆ బిల్డింగ్ వెనకాల ఒక పాడుబడిన పాత సినిమా ధియేటర్(టూరింగ్ టాకీస్) లాంటిది ఉంది. అందులోనే రాజు ఫైట్స్ నిర్వహిస్తూ ఉంటాడు. బయట ఎవరికీ అందులో ఏం జరుగుతుందో తెలియనంత సాధారణంగా ఉంది. ఆ బిల్డింగ్ పక్కనుంచి ఒక చిన్న సందు లాంటి దారి ఆ టాకీస్ ఎంట్రన్స్ దగ్గరికి ఉంది. అక్కడ ఉన్న ఒకే ఒక్క పెద్ద డోర్ లో నుంచి లోపలికి వెళ్లగానే ఒకపక్క రిసెప్షనిస్ట్ ఏరియా ఉండి అందులో ఒక అమ్మాయి కూర్చుని డబ్బులు వసూలు చేసి టోకెన్లు పంచుతుంది. అక్కడ నుంచి మరికొంచెం ముందుకు వెళితే ఒక చెక్కల పార్టిషన్ ఉండి దానికి ఉన్న డోర్ లో నుంచి లోపలికి వెళితే థియేటర్ మధ్యలో ఇనుప జాలీతో నిర్మించిన ఒక వలయంలో ఫైట్ జరుగుతుంది.  ఆ ఇనుప జాలితో నిర్మించిన వలయం ‘ఘరానా మొగుడు’ సినిమాలో మొట్టమొదటి ఫైట్ సీన్ ని తలపించేలా ఉంది. దాని చుట్టూ జనాలు చేరి ఫైట్ ఎంజాయ్ చేస్తూ గోలగోలగా అరుస్తున్నారు. ఆ రింగులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఈరోజు మా టార్గెట్ అయిన రాజుగాడు. నేను కూడా ఆ జనంలో కలిసిపోయి కొంతసేపు రాజుగాడు ఫైట్ చేసే తీరు గమనించాను. ఆ ఫైట్ ముగిసిపోవడంతో రాజు అక్కడినుంచి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయాడు. నేను తిరిగి రిసెప్షన్ ఏరియాకి వచ్చి అక్కడ కూర్చున్న అమ్మాయితో, నేను రాజుతో ఫైట్ చేస్తాను నా పేరు రాసుకోమని చెప్పాను. …. ఆ అమ్మాయి నన్ను ఒకసారి పైనుంచి కింది వరకు ఎగాదిగా చూసి, ఏం బతకాలని లేదా? ఆడొక …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker