Kaalapurushidi Kadhalu

Kaalapurushidi Kadhalu – 168

మూర్తి గారి కుటుంబం 01 “మా అమ్మా నాన్న శ్రీమతి మహాలక్ష్మి రాఘవయ్య గార్ల పేరు మీద అర్చన చెయ్యండి..” అన్న గొంతు విని ప్రార్ధన చేస్తున్న మూర్తి  కళ్లు తెరిచి చూశాడు… “ఏమిటమ్మా విశేషం.?.” అన్న పూజారి ప్రశ్నకు “ఈ రోజు వాళ్ల పెళ్లి రోజు..”అని బదులు చెప్పింది ఆ ఇరు వై ఏళ్ల ముగ్ద మనోహర రూపం… అర్చన జరుగుతున్నంత సేపూ మూర్తి  పూర్తిగా ఆ పడుచు పిల్ల వైపే దృష్టి పెట్టాడు..21 వ శతాబ్దంలో కూడా సంప్రదాయానికి లంగా ఓణీ వేసినట్లున్నఆ అమ్మాయిని, తాను ఇంతకు ముందు ఎక్కడో చూసి నట్లు అనిపించింది… చక్కగా చెక్కిన ఆ నడిచే శిల్పం, మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆ స్వరం వయస్సుతో నిమిత్తం లేకుండా అందరినీ ఆకర్షించే ఆ పరువాలని మూర్తి చూస్తూనే ఉన్నాడు..అర్చన గంటల శబ్దానికి ఈ లోకంలోకి వచ్చాడు… హారతి నుంచి కంటి చూపు మరల్చుకునే లోపే తళుక్కుమని మాయమైంది ఆ చిన్నది…   కృష్ణమూర్తి (50) ఆ ఊరిలో మూర్తి గా అందరికీ పరిచయం ఉన్నవాడే… అటు సిటీ కాకుండా..ఇటు పల్లెటూరు కాకుండా, హైదరాబాద్ కి దాపుల్లోనే, మధ్య రకంగా ఉన్న ఆ ఊరికి ఆయన భార్య హనుమాయమ్మ తో ఒక సామాన్యమైన వ్యక్తిగా కట్టు బట్టలతో దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చి, చిన్నగా వ్యాపారం ప్రారంభించి, ఈ నాటికి కోట్యాధిపతి గా నలుగురిలో మన్నన పొందుతూ వున్నాడు… చిన్న వయస్సులోనే ఇంకా ఎదగని ఆ గ్రామానికి పొట్ట చేత పట్టుకొని వచ్చి కాయ కష్టంతో తెలివి తో అంచె లంచెలుగా ఈ ఎత్తులకు ఎదిగి బాగా సంపాదించాడు… ఈ ఎదిగే క్రమంలో అతని భార్య శ్రీమతి హనుమాయమ్మ సహకారం మరువలేనిది..సంప్రదాయాలకు, ఆచా రవ్యవహా రాలకు బాగా విలువిచ్చే ఆ దంపతులంటే ఊరిలో బంధుగణంలో మరియు తెలిసిన వారిలో ఎంతో గౌరవం… రత్నాల్లాంటి ఇద్దరు మగ సంతానం వీరికి, భర్త వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నా పిల్లల్ని, సంసారాన్ని సరైన దారి లో నడిపించినడి ఆ గొప్ప ఇల్లాలు హనుమాయమ్మ అనే అంటారు అందరూ … విధి వశాత్తు హనుమాయమ్మ మూడేళ్ళ క్రితమే కాలం చేశారు… అప్పట్నుంచి ఇంటిలో దీపం పెట్టే ఆడ …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker