Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
ల్యాండ్ అవ్వగానే మొబైల్ తీసి ప్రసన్నాకు కాల్ చేసాను . స్విచ్ ఆఫ్ అని రావడంతో కాస్త కంగారుపడి వెంటనే స్వప్నకు కాల్ చేసాను .
మొదటి రింగుకే ఎత్తడంతో హమ్మయ్యా అనుకుని , స్వప్న ఎక్కడ ఉన్నారు …… , ఎయిర్పోర్ట్ కు వచ్చారా …….ప్రసన్నా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అని అడిగాను .
ఇంకా లేదు మహేష్ అని బదులిచ్చింది .
అయితే ఎక్కడ ఉన్నారు , అంతా ok కదా అని అడిగాను .
అది అది …….. మహేష్ , ప్రసన్నాకు ఈరోజు అతి ముఖ్యమైన exam ఉండటం వలన , కొన్నిరోజులుగా ఈ exam కోసం పగలూ రాత్రి తేడాలేకుండా కష్టపడింది అని కాంచన అక్కయ్య చెప్పింది . నిన్న నీ మెసేజ్ చూడగానే నీమాట కోసం exam కూడా వదులుకోవడానికి సిద్ధపడింది . ఈ exam చాలా ముఖ్యమని చెప్పావుకదా , నీ మహేష్ కూడా అదే కోరుకుంటాడు . నువ్వు వెళ్లి exam రాయి అని మేమే బలవంతపెట్టి పంపించాము . నీకు ఆ విషయం చెబుదామని 7 గంటల నుండి కాల్ చేస్తున్నాము out of reach అని వస్తోంది sorry మహేష్ అనిచెప్పింది .
Sorry ఎందుకు స్వప్న చాలా మంచిపని చేశారు . మనకు ప్రసన్నా భవిష్యత్తు ముఖ్యం లవ్ యు లవ్ యు soooo మచ్ అని సంతోషంతో ముద్దుపెట్టి , exam ఎన్ని గంటలకు అని అడిగాను ……….
8 గంటలకు స్టార్ట్ అయిపోయింది . మరొక అర గంట మాత్రమే ఉంది . కాలేజ్ లోపల లగేజీ చేతిలో క్యాబుతోపాటు రెడీగా ఉన్నాము . 10 గంటలకు exam పూర్తిచేసి తను బయటకు రాగానే బయలుదేరడమే , ట్రాఫిక్ లేకపోతే గంటలో వచ్చేస్తాము అని బదులిచ్చింది .
కంగారు ఏమీ లేదు నెమ్మదిగానే రండి , ప్రసన్నా బయటకు రాగానే exam …