Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
చెప్పు అన్నయ్యా …………..మమ్మల్ని ఏమిచెయ్యమంటావో అని అడిగారు .
My క్యూట్ సిస్టర్స్ అంటూ బుగ్గలపై చేతులతో ఉమ్మా………అని ముద్దుపెట్టి , మీ అక్కయ్యలకు సర్ప్రైజ్ కాబట్టి మీరు పైకివెళ్లి ఒక బ్యాగులో మొదట మీ బట్టలు తరువాత మేము ఇప్పుడే అమ్మ రూంలో ఉంచిన బ్యాగులోనుండి మీ కావ్యక్క బట్టలు , నెక్స్ట్ మెహ్రీన్ మహి స్వాతి మరియు కృష్ణవేణి అక్కయ్యల బట్టలు మీకు ఇష్టమైనవాటిని సర్దేసి ఎవరూ చూడకుండా నాకు తెచ్చివ్వండి .
మీ కావ్యక్కతో ఎంతసేపయినా సంతోషన్గా గడిపి నాదగ్గరికే వచ్చేయ్యాలి , కవిత ముఖ్యన్గా నువ్వు ఈరోజు ఎలాగైనా అమ్మావాళ్లనుండి తప్పించుకోవాలి సరేనా అని నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి పంపించాను .
ఇంతలో నా ఏంజెల్స్ అక్కయ్యా ……….వేడి వేడి వెజ్ మరియు నాన్ వెజ్ వంటలు రెడీ అంటూ ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్లేట్ లో పొగలు కక్కుతూ నోరూరించేలా నాముందు నుండే వెళుతూ ఇప్పటికైనా సంతృప్తి చెందావా అని కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు .
అంతే సోఫాలోనుండి లేచి వారికంటే ముందుగానే పరుగునవెళ్లి ఇందుఅమ్మ మరియు అమ్మ మధ్యలో చేరిపోయి వంటల సువాసనలను పీల్చి ఎంతైనా అమ్మల వంట అమ్మల వంటే , హోటల్ వంట హోటల్ వంటే అని పెదాలను తడుముకుంటుంటే నాదేవతతోపాటు అందరూ సంతోషమైన నవ్వులతో ,
అత్తయ్యా ……….మీ బంగారుతల్లికి మొదటి ముద్ద మీరే తినిపించండి అని నా ఏంజెల్స్ బిరియానీ ప్లేట్ అందించారు .
అమ్మ ఆతృతతో అందుకొని ప్రేమతో ముద్దకలిపి చేతిలోకి తీసుకుని మళ్లీ ఎన్ని సంవత్సరాలకు అంటూ నాదేవతకు తినిపించి ఒకేసారి ఇద్దరూ కళ్ళల్లో చెమ్మతో ……………
అమ్మా నాకోసం మీరు కూడా తినలేదు కదూ …