స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు.
Xossipy సభ్యులందరికీ, పాఠక మిత్రులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.
-x-x-x-
205
నేనూ-దేవీ-ఫాతిమా లంచ్ తినేసి, శాంత పెద్దమ్మ ఇంటికి పోయాం. అక్కడ ఆల్రెడీ ఈరిగాడు తాతా-జేజిలిద్దరూ-వీరయ్య పెదనాన్నా నలుగురూ కూర్చుని చీమల దండయాత్ర ఎందుకు చేశాయా అని చర్చించుకుంటూ ఉన్నారు. మేము వాళ్లని డిస్టర్బ్ చెయ్యకుండా, లోపలకి పోయి రాజీ గదిలో దూరాం. అక్కడ ఆల్రెడీ భ్రమర పిన్ని రాజీ అక్క పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ ఉంది. మమ్మల్ని చూస్తూనే, కొంచెం భయం మొహం పెట్టింది.
దేవి రాజీ పక్కనే కూర్చుంటూ, “నీ బాబు నిన్ను బలాత్కారం చేసినా వాడంటే నీకు ఇష్టంలా ఉంది. పోనీ ఓ బంపర్ ఆఫర్. నీ బాబుని ఇక్కడకి పిలు. మేము వాడిని చంపము. ఔట్ రైట్ 100 కోట్లు లిక్విడ్ క్యాష్ ఇస్తా. దళాలతో పాడు పనులు చేయించే పని మానేసి, ఈ దేశం వదిలేసి వెళ్లిపోవాలి మరి. అందుకు ఒప్పుకుంటాడా?” అని అనునయంగా రాజీ భుజం నిమురుతూ అడిగింది. దేవి పిన్ని ఏదో పెద్ద స్కెచ్చే వేస్తోంది. నేను భ్రమరకి సైగ చేస్తూ, దేవికి వంత పాడడం మొదలెట్టా. నేను భ్రమర వైపు చూస్తూ, బుడ్డోడిని ఎత్తుకుని పక్క రూంలోకి పొమ్మన్నట్టు సైగ చేశా.
అదింకా ముదురు కదా? బుడ్డోడిని ఎత్తుకుని పక్క గదిలోకి వెళ్లి, శాంత పెద్దమ్మకి వాడిని పడుకోబెట్టే డ్యూటీ ఇచ్చి వెనక్కి వచ్చేసి, భ్రమర కూడా దేవికి వంత పాడుతూ, రాజీని తగులుకుంది. కాసేపటికి రాజీ అక్క, వాళ్ల నాన్నకి మెసేజ్ పంపడానికి ఒప్పుకుని, గోరీల గుట్ట దాటాక వచ్చే ప్లేసులో పొగ బెట్టాలి. ఆ పొగని ఓ పద్ధతిలో పైకి వదులుతూ ఉంటే, ఆ పొగని చూసి మావాళ్లు అక్కడకి వస్తారు. వాళ్ల ద్వారా మెసేజ్ ఇవ్వాలీ అని ప్రాసెస్ మొత్తం వివరించింది. ఇందులో ఓ చిన్న ఇబ్బంది ఉంది. పొగని ఓ పద్ధతిలో పంపించాలి. అదే కోడ్. అది రాజీకి మాత్రమే వస్తుంది.
అలానే, రాజీ కనిపించకపోతే, వచ్చిన వాళ్లు మేసేజ్ కోసం ఓపెన్లోకి రారు. నేను, రాజీ అక్కతో, “నిన్నిప్పుడు నీ బిడ్డతోపాటు అడవిలో అంత దూరం తీసుకెళ్లడం రిస్క్. కుదరని పని. ఆ మంట ఏదో మన కూరల తోటలో వెయ్యి” అంటూ నచ్చ చెప్పి ఒప్పించా. మేము రాజీని తీసుకుని, కూరల తోటకి వెళ్లేసరికి, మాకోసమేనా అన్నట్టు ఆకాశంలో సూర్యుడు వేడిని వెదజల్లుతూ, తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఫాతిమా-భ్రమరా ఇద్దరూ సాయం చేస్తూ ఉండగా, దేవి మేము పోగేసిన పచ్చి కర్రలని మంట అంటించింది. పచ్చి కర్రలైతే పొగ ఎక్కువ వస్తుంది.
మేము వస్తూ వస్తూ ఓ తువాలు కూడా తెచ్చుకున్నాము. రాజీ ఓ పద్ధతిలో ఆ మంట మీద తువాలు కప్పుతూ, తీస్తూ, పొగని ఓ పద్ధతి ప్రకారం ఆకాశంలోకి వదులుతోంది. ఓ …