Valapu Rangulu – 17 | వలపు రంగులు | telugu dengudu kathalu jabardast
Valapu Rangulu - 17 | వలపు రంగులు | telugu dengudu kathalu jabardast
Valapu Rangulu – 17 | వలపు రంగులు | telugu dengudu kathalu jabardast
Ravi9kumar
నికితని కార్లో దింపిన శ్రీనాధ్ అంకుల్ తిరికి తన ఆఫీసు కి వెళ్ళిపోయాడు. మాదవి ఆంటీ ఇంటి లోపలకి వెళ్ళిన నికిత వెనక్కి తిరిగి స్వర్ణ వచ్చిన కార్ దగ్గరకి వెళ్ళింది. అందులో ఉన్న మరొక బ్యాగ్ తీసుకొని ఇంటిలోపలకి వెళ్తూ అనుకోకుండా అక్కడే ఉన్న నన్ను చూసేసింది. నన్ను చూసిన నికిత మొహం లో ఆశ్చర్యం సంతోషం రెండూ ఒక్క సారిగా వచ్చాయి. అలా చూసిన నికిత నా దగ్గరకు రాడానికి నా వైపు తురుగుతూ ఉండగా మాదవి ఆంటీ ఇంటి బయటకి వచ్చి నికితని పిలవడంతో నికిత నన్ను చూపిస్తూ ‘ఎవరు మా ?’ అని మాదవి ఆంటీని అడిగిండి.
అందుకు ఆంటీ నికిత తో “ఆ అబ్బాయి మన పాత ఇంటికి అద్దెకి వచ్చాడు నిక్కి” అని చెప్పి మళ్ళీ నికిత తో “మీ స్వర్ణ చినమ్మ పిలుస్తుంది వెళ్ళు” అని చెప్పింది . మాదవి ఆంటీ ముందు నన్ను పలకరించకుండా ఆంటీకి కనడబడకుండా నాతో తరువాత వస్తా అని అన్నట్టుగా సైగ చేసి వాళ్ళ అమ్మతో పాటు ఇంటిలోకి వెళ్ళింది.
ఆ తరువాత నేను నా మనసులో “ప్రపంచం చాలా చిన్నది అని అంటారు అది ఇదేనేమో ! ” అని అనుకుంటూ నేను ఉండే ఇంటిలోకి వెళ్ళి ఇప్పుడు ఎం చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఆలోచిస్తూ ఉండగా నేనున్న ఇంటికి మాదవి ఆంటీ వచ్చింది . అప్పుడ ఆంటీ నాతో “మా relatives వస్తారు అని చెప్పగా రవి , వాళ్ళు ఇప్పుడ వచ్చిన వారే” అని చెప్పి మళ్ళీ “ ఇందాక కూరగాయలు తరిగి చాలా కష్ట పడ్డావుగా ఇక రెస్ట్ తీసుకో” అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఏమి రెస్టో ఏమో అని అనుకుంటూ కింద చాప మీద కూర్చున్నాను.
రవి అలా ఏమి చేయాలో అర్ధం కానీ స్తితిలో ఉండగా ఇటు మాదవి రవితో మాట్లాడిన తరువాత తన ఇంట్లోకి వెళ్తూ మద్యలో రవి ఇంటి వెనుక ఏదో చప్పుడు అయితే అక్కడకి వెళ్ళి చూస్తూ ఉంది. ఈ లోపల నికిత తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎవరికీ తెలియకుండా రవి తో మాట్లాడాలని రవి ఉండే ఇంటిలోకి వెళ్తూ ఉంది.
అలా రవి ఉన్న ఇంట్లోకి వెళ్తున్న నికిత ని మాదవి చూసి తనలో ‘నికిత ఎందుకు రవి ఇంట్లోకి వెళ్ళింది ? అయినా నికితకి రవి తెలియదుగా’ అని అనుకుంటూ ఆ ఇంటి వెనక ఉన్న కిటికీ దగ్గర వెళ్తూండగా నికిత మాటలు వినిపించాయి. నికిత మాటలు వింటూ అక్కడే ఉండిపోయింది.
అక్కడ రవి నికిత రావడం చూసి తనతో “నీతోనే మాట్లాడాలని అనుకుంటూ ఉన్న నికిత , నువ్వు ఇక్కడ ఎలా ?” అని అడిగితే నికిత “హలో ఆ విషయం నేను నిన్ను అడగాలి. ఇది మా ఇళ్లే బాబు” అని చెప్పింది. నికిత మాటలు వినిన రవి తనతో “అంటే నువ్వు మాదవి ఆంటీ కూతురివా ?” అని అడిగాడు.
అందుకు నికిత “హా మాదవి మా అమ్మ అయినా ఎందుకు అడుగుతున్నావ్ ?” అని సమాదానం చెప్పింది. అందుకు రవి “నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు” అని అడిగితే నికిత “ అసలు నువ్వు ఇక్కడ రెంట్ కి ఉన్నావని నాకు చెప్పావా ? ఇవన్నీ చెప్పకుండా నన్ను అడుగుతున్నావా !” అని అడిగింది.
నికిత అడిగిన మాటలకి రవి తనతో “సారీ నికిత” అని చెపితే నికిత “పర్లేదులే కానీ ఒక సందేహం …. నువ్వు మార్నింగ్ చెప్పావుగా నీకు ఎవరితోనో అఫ్ఫైర్స్ ఉన్నాయని . ఆ ఆంటీ మా అమ్మ మాత్రం కాదుగా ?” అని తన సందేహం అడిగింది. నికిత మాటలు వినిన రవి “అయ్యో మాదవి ఆంటీ కాదు నమ్ము”అని చెప్పాడు . అందుకు నికిత తన మనసులో “రవి కి ఉన్న బాద దూరం చేసి, సంతోషం ఇచ్చింది అమ్మ అయి ఉంటే పెద్ద ఇబ్బంది లేదు” అని అనుకుంది.
మళ్ళీ నికిత రవితో “సరే గుర్తుంచుకో నేను ఇంకా నా నిర్ణయం చెప్పలేదు . నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా . నీతో పెళ్లి జరగాలని ఇంకా కోరుకుంటున్నా. కానీ నీ అఫ్ఫైర్స్ గురించే నా ఆలోచన ” అని చెప్పి “నితో మాట్లాడాల్సిన విషయం ఇంకా ఉంది. కానీ నన్ను ఇక్కడ అమ్మ చూస్తే ఇక అంతే . వీలు చూసుకొని మళ్ళీ మాట్లాడుతా ” అని చెప్పి నా సమాదానం వినకుండా నేను ఉన్న ఇంటి నుంచి బయటకి వెళ్ళింది.
నికిత మరియు రవి మాటలు వినిన మాదవి తన మనసులో “అంటే రవి ఉదయం చెప్పిన ఆ అమ్మాయి నా కూతురే . నా నికిత అని తెలియకుండా నేనే తనకి సలహాలు ఇచ్చానా”అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంది .
అలా బయటకి వచ్చిన నికితకి రవి ఇంటి వెనుక ఉన్న కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపించి అటుగా వెళ్తూ తన మనసులో “ఇప్పటిదాకా నేను రవితో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న ఎవరో విన్నారు . ఆమె అమ్మ కాదుగా” అని మనసులోనే బయపడుతూ అక్కడకి వెళ్ళింది. అక్కడకి వెళ్ళి చూస్తే అక్కడ తన అమ్మ మాదవి కనిపించింది. నికిత బయం ఇంకా రెట్టింపు అయి చాల ఆందోళనగా ఉంది . అక్కడకి వచ్చిన నికితని చూసిన మాదవి ఏదో మాట్లాడబోతుండగా మళ్ళీ రవి ఇంట్లోనుంచి ఏవో మాటలు వినబడడంతో మాట్లాడడం అపి ఆ మాటలు వినసాగింది. మాదవితో పాటు నికిత కూడా రవితో మాట్లాడే మరో ఆమె మాటలు వింటూ ఉన్నారు.
అక్కడ రవి ఇంట్లో రవితో మాట్లాడుతున్న ఆమె మరెవరో కాదు స్వర్ణకుమారి. ఇందాక లోపలకి వెళ్ళి అనుకోకుండా బయటకి వచ్చిన స్వర్ణ అనుకోకుండా రవిని చూసింది. రవి ఇక్కడ ఎందుకు ఉన్నాడో తెలుసుకోవాలని ఎవరూ చూడకుండా రవి ఉండే ఇంటికి వచ్చింది.
ఎప్పుడైతే నికిత రవితో మాట్లాడి బయటకి వెళ్ళి మాదవి దగ్గరకి వెళ్తూ ఉందో అప్పుడే స్వర్ణ రవి ఇంటిలోకి ప్రవేశించింది . స్వర్ణ కన్నా ముందు నికిత రవి దగ్గరకి వచ్చిందని తెలియని స్వర్ణ నేరుగా రవి దగ్గరకి వెళ్ళి రవితో మాట్లాడుతూ ఉండగా వీరిద్దరి మాటలు ఇంటి వెనుక ఉన్న కిటికీ దగ్గర నిలబడిన మాదవి మరియు నికితలు వింటూ ఉన్నారు.
ఇక రవిని చూసిన స్వర్ణ మాట్లాడుతూ “ మావ ! ఇక్కడ ఎం చేస్తున్నావ్” అని అడిగిండి. స్వర్ణ రవిని మావ అని పిలవడం విని “ఏంటి రవిని , మావ అని స్వర్ణ పిలుస్తుంది” అని మాదవి , అలాగే “అదేంటి రవిని మావ అని చినమ్మ పిలుస్తుందే !” అని నికిత ఆశ్చర్య పోయారు. మొత్తం మాటలు వింటే ఒక క్లారిటీ వస్తుంది అని ఇద్దరూ అనుకుంటూ స్వర్ణ మరియు రవి మాటలు వినడానికి సిద్దామయ్యారు.
( రవి మాటలలో )
నికిత వెళ్ళగానే స్వర్ణలోపలకి వచ్చింది. అలా వచ్చిన స్వర్ణతో నేను “ నాకేం అర్ధం కావటం లేదు స్వర్ణ , నువ్వు మాదవి ఆంటీ చెల్లె వా!” అని అడిగాడు. అందుకు స్వర్ణ “అంటే నువ్వు మాదవి అక్క ఇంట్లో రెంట్ కి ఉంటున్నావా ?” అని అడిగితే నేను తనకి సమాదానంగా “అవును స్వర్ణ” అని చెప్పి మళ్ళీ స్వర్ణ తో “మాదవి ఆంటీ నీకు అక్క అని నాకు తెలియదు” అని కొద్దిగా బయపడుతూ అన్నాను.
నా మాటలు విని స్వర్ణ “సరే మావ ఇప్పడు ఏమి కాలేదుగా , మరి ఎందుకు బయపడుతున్నావ్ ?” అని అంటే నేను “నీకో విషయం చెప్పాలి స్వర్ణ” అని అన్నా. అందుకు స్వర్ణ “చెప్పు మావ” అని అనింది. ఇక నేను తనతో “ నేను నికిత ఒకే ఆఫీసు లో ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కదా” అని అన్నాను. అప్పుడు స్వర్ణ “హ నాకు తెలుసుగా ఇప్పడు ఏమైంది?”అని అడిగింది.
అప్పడు నేను “ నిన్న నికిత నన్ను డిన్నర్ కి పిలిచి, నన్ను నికిత ప్రేమిస్తుంది అని చెప్పి అలాగే పెళ్లి చేసుకుందాం అని నన్ను అడిగింది” అని చెప్పాను. నా మాటలు విని ఆశ్చర్యపడిన స్వర్ణ “అవునా మాదవి అక్క కూతురు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పిందా !” అని అంటే నేను “అప్పుడు నికిత నే మాదవి ఆంటీ కూతురు అని నాకు తెలియదు స్వర్ణ” అని చెప్పాను.
అప్పుడు స్వర్ణ “సర్లే మరి నా కూతురికి ఎం సమాదానం చెప్పావ్?” అని అడిగిండి. కూతురు అని ఎందుకు అనిందో అర్ధంకాక నేను స్వర్ణతో “ నీ కూతురా !” అని ఆశ్చర్యం గా అడిగితే స్వర్ణ “అవును అల్లుడు. నా అక్క కూతురు నా కూతురు కాదా” అని చెప్పింది. అల్లుడు అని పిలుపు విని మళ్ళీ ఆశ్చర్య పడిన నేను మళ్ళీ స్వర్ణతో “అల్లుడా ! అదేం పిలుపు ?” అని ఆశ్చర్యంగా అడిగా . నా ప్రశ్నకి స్వర్ణ “మరి నికిత ప్రేమిస్తుంది గా అప్పుడు అల్లుడివే గా ”అని సమాదనం చెప్పింది.
తన సమాదానం విని నేను “స్వర్ణ, అప్పుడే అల్లుడు అని అనకు . నేను తనని పెళ్లిచేసుకోలేను నా వల్ల కాదు ”అని చెప్పాను. నేను ఎందుకు అలా అంటున్నానో తెలుసుకోవాలని స్వర్ణ నాతో “అదేంటి మావ అలా అంటావ్ , ఏ మా నికిత చచ్చలేదా?” అని అడిగిండి. తను అలా అడిగేసరికి నా మనసులో ఏమి దాచకుండా స్వర్ణతో “నికితకి ఎం తక్కువ స్వర్ణ చాలా చక్కగా అందంగా ఉంటుంది. అంతకు మించి చాలా మంచి అమ్మాయి ” అని చెప్పాను.
అందుకు స్వర్ణ “అంటే ….. నచ్చిందిగా . మరి నువ్వు తనని ప్రేమించడం లేదా ? నీ మనసులో నికిత లేదా ? అబద్దం చెప్పకుండా సూటిగా చెప్పుమావ ” అని స్వర్ణ అడిగితే నేను సంకోచించకుండా నా మనసులోని మాటని స్వర్ణతో “అవును , నికిత అంటే నాకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. నా మనసులో నికిత కూడా ఉంది. నాకు తెలియకుండానే కొద్ది రోజులలోనే నికితని ప్రేమించాను” అని నిస్సంకోచంగా చెప్పాను.
నా మాటలు విని స్వర్ణ “మరి నికితని పెళ్లి చేసుకోవచ్చుగా” అని అంటే నేను “లేదు స్వర్ణ నికిత చాల మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయికి నేనూ సరైన వ్యక్తిని కాదని నాకు అనిపించింది అందుకే తనతో ……” అని చెప్పాలా వద్దా అని అనుకంటూ మద్యలోనే ఆపేస్తే స్వర్ణ “ఆ తనతో ….. ?”
“నేను తనని పెళ్లి చేసుకోలేనని చెప్పాను ”
“ఎందుకు అలా చెప్పావ్”
“నికిత కన్నా నిన్ను ముందు ప్రేమించా . నికితని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నిన్ను వదిలేయాలి . నా జీవితంలో సంతోషం అందించిన నిన్ను నీ ప్రేమను వదులుకోలేక , నికితని కలిసి తనని పెళ్లి చేసుకోలేనని చెప్పాను ”
“మరి నీ మాటలు విని నికిత ఏమనింది”
“ఎందుకు తనని పెళ్లి చేసుకోలేనో కారణం చెప్పమని అడిగిండి”
“ఏ కారణం చెప్పావ్”
“నాకు ఇద్దరితో అఫ్ఫైర్ ఉందని నిజం చెప్పాను”
“అలా ఎందుకు చెప్పావ్ రవి , అయినా నువ్వు చెప్పితే నమ్మేసిందా”
“ముందు నమ్మలేదు , నిన్ను వదులుకోలేనని గట్టిగా చెపితే అప్పుడు నమ్మింది”
“నా పేరు చెప్పావా?”
“లేదు స్వర్ణ”
“మరి సౌజన్య పేరు చెప్పావ?”
“మీ పేర్లు చెప్పడానికి నాకేమైనా పిచ్చా ….. మీ పేర్లు అస్సలు చెప్పలేదు. ఇద్దరు ఆంటీ లు అని మాత్రమే చెప్పాను”
“అలా అఫ్ఫైర్స్ గురించి ఎందుకు చెప్పావ్? చెప్పకుండా ఉండొచ్చుగా”
“ మీ విషయం దాచి తనని మోసం చేయలేక”
“తప్పు చేశావ్ మావ , నికిత ప్రేమ కోసం నన్ను వదులుకొని ఉండొచ్చుగా” అని అనింది.
స్వర్ణ మాటకి నేను సమాదానం చెప్పే లోపల నేను ఉన్న ఇంటి వెనుక నుంచి మాదవి ఆంటీ గొంతు వినపడి స్వర్ణ తో “రవి ఎం తప్పు చేశాడు స్వర్ణ ? తన అఫ్ఫైర్స్ దాచి ఒక అమ్మాయిని మోసం చేయలేక నిజం చెప్పాడు . ఇలా నిజాయితీ గా ఉండే వాడు ఎక్కడ దొరుకుతాడు . అయిన నీ మావని వదిలి నువ్వు ఉండగలవ స్వర్ణ?” అని మాదవి ఆంటీ మాట్లాడుతూ లోపలికి వచ్చింది.
మాదవి ఆంటీ గొంతు విని కంగారూపడుతూ వెనక్కి తిరిగి చూసే సరికి మాదవి ఆంటీతో పాటు నికిత కూడా వచ్చింది. అలా వచ్చిన మాదవి ఆంటీని చూసిన స్వర్ణ మొదట కంగారు పడినా , కొన్ని సేపటికి తేరుకొని మాదవి ఆంటీ తో “అక్కా నువ్వు ఇక్కడ ఎం చేస్తున్నావ్ ?” అని అడిగితే మాదవి ఆంటీ “ముందు నేను అడిగిన దానికి సమాదానం చెప్పు . రవిని వదిలి ఉండగలవ ? రవి ప్రేమను వదులుకోగలవా ?” అని అడిగితే స్వర్ణ “నా వల్ల కాదు అక్కా. కానీ తనకంటూ ఒక జీవితం ఉంది అది ముఖ్యం కదా” అని చెప్పిమళ్ళీ మాదవి ఆంటీతో “ అయిన రవి నన్ను ప్రేమిస్తున్నాడు అని నికేలా తెలుసు” అని సందేహంగా అడిగిండి.
అందుకు మాదవి ఆంటీ “నీ మావే చెప్పాడే. నీ వల్ల రవి ఎంత సంతోషం పొందాడో చెప్పాడు” అని స్స్వర్ణ తో అని మళ్ళీ మాదవి ఆంటీ నాతో “ ఎం రవి ఉదయ నువ్వు చెప్పిన ఆ ఆంటీ నా చెల్లె లే నా ” అని అడిగిండి. అప్పుడు నేను తడబడుతూ “ఆంటీ అది …. ” అని నసుగుతూ ఉంటే మాదవి ఆంటీ “ఆ మీ ఇద్దరి మాటలు అన్నీ ఇప్పుడు విన్నానుగా. ఆ మాటలలో నాకు అర్ధం అయింది లే” అని మాతో చెప్పింది.
మాదవి ఆంటీ మాటలు విని అంటితో “నా గురించి రవి ఎప్పుడు చెప్పాడు అక్కా?” అని అడిగితే ఆంటీ
“ఈ రోజు ఉదయం నీ మావ తెగ బాదపడుతూ ఉంటే ఏమిటో అడిగా . అప్పడు నా కూతురే అని చెప్పకుండా ఒక అమ్మాయి నన్ను అంటే రవిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది అని చెప్పాడు. అలా చెప్పి ఆ అమ్మయితో పెళ్ళికి ఒప్పుకోకపోడానికి నాకు ఇద్దరు ఆంటీలతో అఫ్ఫైర్ ఉందని నాకు చెప్పాడు . నీ పేరు చెప్పలేదు. అప్పుడు తెలియదు ఆ ఇద్దరిలో ఒక ఆంటీ నువ్వేనని” అని సమాదానం చెప్పింది.
అందుకు స్వర్ణ , తన అక్కకి అంతా తెలిసిపోయింది అని బయపడుతూ మాదవితో “అక్కా అది .. .. ..”అని తడబడుతూ ఉండగా మాదవి “చూడు స్వర్ణ ఇక చెప్పాల్సింది ఏమీ లేదు . నాతో రా , నీతో కాస్త విడిగా మాట్లాడాలి. పద ఇంట్లోకి” అని స్వర్ణ చెయ్యి పట్టుకొని మాదవి ఆంటీ తన ఇంట్లోకి తీసుకెళ్లింది.
తనతో పాటు నికిత వెళ్తూ మాదవి ఆంటీ ని వెళ్లనిచ్చి వెనక్కి తిరిగి నాతో “నీకు మా అమ్మతో అఫ్ఫైర్ లేదని చెప్పవే కానీ మా చినమ్మ తో అఫ్ఫైర్ ఉందనీ చెప్పలేదే ! . నీకో విషయం తెలుసా సౌజన్య నాకు అక్క వరుస అవుతుంది . నీకు మా అక్కతో సంబందం ఉంది అంటే నువ్వు నాకు ఏమవుతావో తెలుసుగా . ఇప్పుడు నా మనసుకి ఒక క్లారిటీ వచ్చింది. నువ్వు సంబందం పెట్టుకున్న ఆ ఆంటీ లు నా వాళ్ళే. వాళ్ళ సంతోషం కోసమేనా నాతో పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇక నీ విషయాలు అన్నీ తెలిశాయిగా జరిగబోయేవి చూద్దూ గాని”అని నాతో చెప్పి నికిత తన ఇంటికి వెళ్ళింది
39c