Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
ఇస్స్………అంటూనే వెంటనే తనవైపు నవ్వుతూ చూస్తుండగా కారులో ఎక్కుతూ ఒకసారి తీరిగి చూసి అందంగా మవ్వగానే నామీదకు వాలిపోగా వీడు ప్రేమను చెప్పాడు కానీ ఇలాంటివి చేయమంటే నెంబర్ వన్ వీడికోసం ఇంకా ఎన్నిసార్లు చంద్ర ఇంటికి వెళ్ళాలో అంటూ , సరిగ్గా నిలబెట్టి ఒరేయ్ రేపు మహికి చివరి ఎక్సమ్ ఉంది దానికోసం అనకాపల్లి ఉదయమే వెళుతున్నాను , ఎక్సమ్ అవ్వగానే వచ్చేస్తాము నువ్వు ఏమి చేస్తావంటే రేపు దివ్యక్క సెలెక్ట్ చేసినదానిని ఎన్ని కావాలో తెలుసుకొని ప్రింట్ కు ఆర్డర్ ఇచ్చెయ్ , మర్నాడు ఉదయానికల్లా మన చేతిలో ఉండాలి తెఇన తిరుపతికి వెళ్ళాలి అని మరీ మరీ చెప్పి ,
మహి దగ్గరికి వెళ్లి భుజం చుట్టూ చేతిని వేసి అమ్మా , అత్తయ్యా , వాసంతి గారు వెళదామా అని అడుగగా , వసుంధరా ఉదయం కలుద్దాము అంటూ ఉదయం నుండి ఆడుతూనే ఉండటం వల్ల పిల్లలు అలసిపోయినట్లుగా సోఫాలో జోగాడుతూ ఉండగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎత్తుకొని కారులో వెనుక అడ్జస్ట్ చేసుకొని కూర్చొని అమ్మ వాళ్ళ మీద పడుకోబెట్టి , కీర్తిని ఎత్తుకొన్న మహి ముందు కూర్చోగా ఎక్కి స్టార్ట్ చేసి పోనిస్తూ మహి రేపు చివరి exam కదూ మొత్తం చదివేశావా అని అడుగగా , నిన్ననే చదివేశాను బావ అయినా నీకెలా తెలుసు అని ఆశ్చర్యన్గా అడుగగా , వర్షి చెప్పిందిలేకాని , టెస్ట్ చెయ్యనా అని అడుగగా ,
ఓహ్ yes బావ అంటూ నా చేతిని తన చుట్టూ వేసుకొని నా ప్రశ్న కోసం తల ఎత్తి నాకళ్ళల్లోకి చూస్తుండగా మొదటిది అడుగగా టకటకా అప్పచెప్పగా గుడ్ అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా నా భుజం పై సంతోషన్గా వాలిపోగా , మరొకటి అడుగగా అది కూడా ఈసీ గా చెప్పెయ్యగా బుగ్గపై మరింత ప్రేమగా ముద్దుపెట్టగానే లవ్ యు బావ మరొక ప్రశ్నకు జవాబు చెప్పానంటే బావ ఎక్కడ ముద్దుపెడతాడు పెదాలపైన అయితే మొదటి ముద్దు తియ్యగా ఆస్వాదించవచ్చు అంటూ మురిసిపోతూ నా గుండెలపై గువ్వ పిల్లలా వొదిగిపోగా , ఈసారి కొద్దిగా కష్టమైన కెమిస్ట్రీ ప్రశ్న వెయ్యగా ఆత్రంగా చెప్పబోయి బావ అది నేను చదవనేలేదు , ముద్దుకోసం ఉత్సాహంగా మరొకటి అని అడుగగా …