Geetha - Dhatena

Geetha – Dhatena – 156

గర్రెపల్లి, దసరా పండగ తరువాత ఉదయం,  జయరాజ్ ఇంటి ముందు వేపపుల్ల నోట తోముతూ నిల్చున్నాడు. గేటు తీసుకుంటూ కంగారుగా లోపలికి వచ్చింది సింధూ తన కొడుకుని ఎత్తుకొని. జయరాజ్ ఏమీ అనకుండా మౌనంగా చూసాడు. సింధూ చిన్నాన్నకి గౌరవంతో కూడిన భయంతో చిన్న చిరునవ్వు చేసి, “బాబాయ్ గీత లేచిందా?” అని అడిగింది. జయరాజ్ అతడి అన్నయ్య మీదున్న కఠినత్వం పిల్లల మీద చూపడు. జయరాజ్: ఇంకా లేచిందో లేవలేదో, (ఒకసారి వెనక్కి చూసి) చిట్టీ … అని పిలిచాడు.  Related Articles Geetha – Dhatena – 165 1 week ago Geetha – Dhatena – 164 3 weeks ago Geetha – Dhatena – 163 October 4, 2026 Geetha – Dhatena – 162 September 24, 2026 అటు నుండి ఆమె పిలుపు పలకలేదు. జయరాజ్: లోపలికి పో సింధూ… సింధూ: ఉ… సింధూ ఇంట్లోకి వెళ్తుంటే దగ్గరికొచ్చి ఆమె నుంచి మనవడిని తీసుకొని ప్రేమగా ఎత్తుకొని పిల్లాడికి ముద్దు పెట్టాడు. జయరాజ్: పేరేంటి? సింధూ: లలిత్. జయరాజ్: మీ నాన్న అమ్మా బాగున్నారా? సింధూ: ఉన్నారు బాబాయ్…. పిన్ని ఎక్కడా? జయరాజ్: వెనక బావి దగ్గరుంది. సింధూ: సరే… పిల్లాడిని తీసుకొని ఇంట్లోకెళ్లి గీత గది తలుపు తట్టింది. సింధూ: గీత…. అమ్ము… “ఆ… అక్కా… ఆగు వస్తున్న,” అని గీత బదులిచ్చింది. ఇంతలో ఇంటి వెనక తలుపు నుంచి కొత్త లంగా జాకిటి వేసుకొని కళాశాలకు వెళ్లే ఈడు వచ్చినా మొదటిసారి పాఠశాలకు పోతున్నట్టు రెండు రిబ్బన్ జెడల్లో ముద్దుగా మురిసిపోతూ చెంగు మని కుందేలులా హుషారుగా దూకింది మన హీరోయిన్. అమ్ము: గుడ్ మార్నింగ్ ప్రిన్సిపాల్ గారు. సింధూ: చాల్లేవే ఇదేమైనా కాలేజ్ ఆ? అమ్ము: హహ ఎలా ఉన్న చెప్పు అక్క? సింధూ: నువ్వెంటే పందిలా పండేదానివి ఇంత …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

.
Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker