Minor Raja

Minor Raja Part 79 | Telugu Srungara Kathalu

స్పందించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదములు. -x-x-x- 88 పూర్తిగా చీకటి పడిపోయింది. గూడెంలో లైట్లూ చాలా వరకూ ఆగిపోయాయి. అడవిలో రాత్రి పూట తిరిగే జంతువుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ కటిక చీకటిలో, రంగి అమ్మమ్మ బాణాలు గురి తప్పకుండా, దూరంగా కొట్టడానికి ప్రాక్టీస్ మొదలెట్టింది. తను వెళ్లి కూరలతోటకి రెండో పక్కన నుంచుని చప్పుడు చేస్తూంటే, నేను ఎక్కుపెట్టి బాణాలు వదులుతూ ఉన్నా.. కాసేపు రంగి అమ్మమ్మ చేస్తున్న చప్పుళ్లూ, సర్ర్ సర్ర్ మంటూ నేను వదులుతున్న బాణాలూ, తోటలో హోరెత్తించాయి. చాలావరకూ ఆ కటిక చీకటిలో కూడా నేను గురి తప్పకుండా కొడుతూ ఉన్నా. అమ్మమ్మ మంచె మీద కూర్చుని ఎవరినా వస్తున్నారేమో అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ, మా ప్రాక్టీస్ సీరియస్గా గమనిస్తూ ఉంది. ఓ గంట అయ్యాక, ఇంక నా జబ్బలు నొప్పి పుట్టడం మొదలయ్యింది. అప్పుడు అమ్మమ్మ మంచె దిగి వచ్చి, నాకు మళ్లీ తువాలు కళ్లకి గంతలు కట్టి, “దొరవారూ.. ఇప్పుడు నేనూ రంగీ ఇద్దరమూ చప్పుళ్లు చేస్తూ చెరో వైపూ పరిగెడతాము. మీరు ఇద్దరి చప్పుళ్లకీ బాణాలు గురి చూసి కొట్టాలి. అర్థమయ్యిందా?” అంటూ multiple moving target practice మొదలెట్టింది. మళ్లీ సేం. ఇద్దరూ చేరో డైరెక్షన్లోనూ పరిగెత్తుతూ చప్పుళ్లు చేయసాగారు. పొద్దున్న అమ్మ పరిగెత్తినట్టు ఇద్దరూ అటూ ఇటూ పరిగెడుతూ ఉన్నారు., మా ప్రాక్టీస్ ఎటువంటి బ్రేకులు లేకుండా, అర్థరాత్రి వరకూ కొనసాగింది. బాణాలయ్యే వరకూ కొట్టడం. అయ్యాక, పోయి వాటిని ఏరుకుని తెచ్చుకోవడం. ఇప్పుడు నా చేతులు నొప్పి పుట్టడం మానేశాయి. నా చేతులు నా ప్రమేయం లేకుండానే చప్పుడు అవుతున్న వైపు తిరిగి బాణాన్ని ఎక్కుపెట్టి వదిలేస్తున్నాయి. అదే గట్టిగా అరిచా. ఇద్దరూ పరుగులు ఆపి, ఆయాసపడుతూ నా దగ్గరకి వచ్చి, చెమటలు తుడుచుకుంటూ, “ఇదే.. దీనికోసమే మేము ఈ ముసలి వయసులో అటూ ఇటూ పరిగెత్తింది. మీకు విలువిద్య పూర్తిగా అబ్బంది దొర వారూ.. రేపు మనిద్దరం వేటకి పోదాం. ఏమే రంగీ, నువ్వూ వస్తావుటే?” అని అమ్మమ్మ ఆనందంగా నన్ను వాటేసుకుని అడిగింది. రంగి అమ్మమ్మ నాకు మెటికలు విరుస్తూ, నేను రానులే. రేపు నాకు బోలెడు పని ఉంది. ఎల్లుండ ఇద్దరినీ వాగుకాడికి తీసుకుపోవాలికదా? అందరు ముత్తైదువులకూ పసుపూ, కుంకుమా, కుంకుడుకాయలూ, శీకాకాయా పొడీ, …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker