star heroines star heroines: కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆ పని చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!
star heroines star heroines: కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆ పని చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!
star heroines: కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆ పని చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!
Tollywood :నార్మల్ గా హీరోయిన్లు ఒకప్పుడు ఐటెం సాంగ్ చేయాలి అంటే భయపడే వాళ్ళు.. అంతేకాదు ఐటమ్ సాంగ్ చేయటానికి ప్రత్యేకంగా హీరోయిన్లు కూడా ఉండేవాళ్ళు.. వాళ్లని మనం ఐటెం క్వీన్స్ అని పిలిచేవాళ్ళు అయితే రాను రాను కాలం చేంజ్ అయిపోతుంది. స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో చేయడానికి ఈ మాత్రం ఆలోచించడం లేదు. అయితే ఈ పద్ధతి ముందుగా టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే స్టార్ట్ అయిందని చెప్పాలి.
అక్కడ కెరియర్ పీక్స్ లో ఉండగానే కరీనాకపూర్, కత్రినా కైఫ్ లాంటి ఎంతో మంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేసి రికార్డు సృష్టించారు. ఇక దాంతో అప్పటివరకు చక్రం తిప్పిన మలైకా అరోరా వంటి యాక్ట్రెస్ లకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. ఇక దాంతో తెలుగులో ఈ ట్రెండును స్టార్ట్ చేసింది శ్రియా శరన్. వరుస మూవీస్ చేస్తున్నప్పుడే ఐటెం సాంగ్స్ కూడా చేసి అలరిస్తున్నారు. తొలి సారి రామ్ పోతినేని మొదటి చిత్రం దేవదాసు చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన ఈమెకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత తులసి లాంటి చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. అయితే కొంతకాలం అనంతరం ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఇకపోతే తొలి సారి తెలుగులో సమంత కూడా పుష్ప చిత్రం కోసం ఐటమ్ సాంగ్స్ చేసి అదరగొట్టేసింది. ఈమె కంటే ముందు మిల్కీ బ్యూటీ తమన్నా.. కే జి ఎఫ్, జై లవకుశ ,అల్లుడు శీను వంటి మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించింది.
ఇక కాజల్ అగర్వాల్ కూడా జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇంకోవైపు పూజా హెగ్డే కూడా రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్స్ చేసింది. వీరందరూ కూడా కెరియర్ ఫామ్ లో ఉన్నప్పుడే ఇటువంటి ఐటమ్ సాంగ్స్ చేశారు. ఇలా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేయడానికి కారణం హీరో, దర్శక నిర్మాతలతో ఉన్న ఫ్రెండ్షిప్ , రెమ్యునరేషన్ లాంటి కారణాల వల్ల ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలానే దర్శక నిర్మాతలను కూడా మెప్పిస్తున్నారు.