Srungara Kathamaalika – 165 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 165 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 165 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
పెద్దమ్మ – చెల్లి : బుజ్జిజానకీ ఇవి రెండూ నీకు – ఇక ఈ గిఫ్ట్ బాక్స్ లో ఉన్న అత్యద్భుతమైన పట్టుచీర నీ తల్లి వాసంతికి .
బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య : యే యే యే …….. అని సంతోషించారు .
అక్కయ్య : పెద్దమ్మా – చెల్లీ – బుజ్జిచెల్లీ ………. తెలుసుకదా తమ్ముడు కనిపించేతవరకూ ……… అని మాట్లాడుతుండగానే బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య కలిసి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు .
అక్కయ్యా – తల్లీ ……… ఈ చీరను చూస్తే , సెలెక్ట్ చేసినది ఎవరో తెలుసా బుజ్జిఅమ్మ మరియు పైవారు అని నవ్వుకున్నారు .
అక్కయ్య : లేదు లేదు లేదు ………. ఈ ఒక్కటీ మాత్రం నన్ను బలవంతపెట్టకండి అని వెనక్కు తిరిగారు .
బుజ్జిఅక్కయ్య : చీర చూసి మాట్లాడండి అక్కయ్యా ………. అని చీరతోపాటు ముందుకువచ్చారు .
అక్కయ్య : నో నో …….. బుజ్జిచెల్లీ , మన తమ్ముళ్లు గిఫ్ట్ ఇచ్చిన చీర తప్ప ……..అని కళ్ళు గట్టిగా మూసుకున్నారు .
అక్కయ్యా – తల్లీ – అమ్మా – అక్కయ్యా ………. please please please ఒక్కసారి చూడండి వద్దంటే ఇక మేము బలవంతపెట్టము .
అక్కయ్య కొద్దిగా మాత్రమే కళ్ళుతెరిచి చూసి , ఆఅహ్హ్హ్ …….. సేమ్ టు సేమ్ తమ్ముళ్ల చీర అని అందుకుని గుండెలపై హత్తుకున్నారు .
యాహూ ……… అని అందరూ చప్పట్లు కొట్టడం చూసి నవ్వుకుని , బుజ్జిఅక్కయ్యను అమాంతం ఎత్తుకుని వారి గదిలోకివెళ్లి లాక్ చేసేసుకున్నారు .
అందరూ సంతోషంతో నవ్వుకుని బంగారు పట్టుచీరను బుజ్జిఅమ్మకు కట్టించి , నగలతో సుందరంగా అలంకరించి ఉమ్మా …….. అంటూ దిష్టి చుక్కలు పెట్టారు . తల్లీ ……… కూర్చో అనిచెప్పి గంటలో రెండు ఇళ్లల్లో దేవత దేవకన్యల్లా రెడీ అయ్యి వచ్చారు . ఒకరినొకరు చూసుకుని మా దిష్టి నే తగిలేలా ఉంది అని దిష్టిచుక్కలు పెట్టి బుజ్జిఅమ్మ దగ్గరికి చేరుకున్నారు .
మహి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అంటీ వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి తమ తమ ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు .
అందరూ రెడీ అయినా బుజ్జిఅమ్మతోపాటు అక్కయ్య గదివైపే టెన్షన్ టెన్షన్ గా చూస్తున్నారు . అందరి హృదయవేగాలు క్షణక్షణానికీ పెరుగుతూనే ఉన్నాయి .
తలుపు తెరుచుకున్న సౌండ్ రావడంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .
బుజ్జిఅక్కయ్యకు బుజ్జి పరికిణీ కట్టించి బుజ్జి బుజ్జి నగలతో బుజ్జిదేవతలా అలంకరించి బుజ్జిచేతిని అందుకుని , అక్కయ్య కొత్త పట్టుచీరలో ఆశ్చర్యంగా నగలతో దివినుండి దిగివచ్చిన దేవతలా రావడం చూసి అందరి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
చెల్లి – బుజ్జిఅమ్మ – మహి ఏంజెల్స్ ……….. ఆనందబాస్పాలతో వెళ్లి కౌగిలించుకోబోయి వద్దు వద్దు మడతలు పడతాయి అని ఆగిపోయి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోయారు . దేవత – బుజ్జిదేవతల్లా ఉన్నారు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది .
బుజ్జిఅమ్మ : తల్లీ ……… నగలు కూడా .
అక్కయ్య : మీరు వేసుకుంటేనే వేసుకుంటాను అని నా బుజ్జి బంగారు చెల్లి మొండిపట్టు పట్టింది అని ఎత్తుకోబోతే ,
బుజ్జిఅక్కయ్య : నో నో నో ………. అక్కయ్యా , ఈరోజు కాదు కాదు ఈ సాయంత్రం మీకు ప్రాణమైన చీర ఒక్క మడతా పడకుండా నేనే దగ్గరుండి చూసుకుంటాను .
రెండు కారణాలకూ లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా – బుజ్జిఅక్కయ్యా – బుజ్జితల్లీ అని అందరూ బుగ్గలను కొరికినంత పనిచేశారు సంతోషం పట్టలేక .
అక్కయ్యా – అమ్మా ……… మేము పైన అన్నీ ఏర్పాట్లూ చేస్తాము – మీరు బుజ్జిఅమ్మ , బుజ్జిఅమ్మను పిలుచుకునిరండి అని అందరి బుగ్గలపై ముద్దులుపెట్టారు . శ్రీవారూ – మావయ్యా మావయ్యా …….. అంటూ బయటకువచ్చి జన సంద్రాన్ని , ఉదయంలా వెలుగులు వెదజల్లుతున్న విద్యుత్ కాంతులను మరియు అడుగుకొక స్క్రీన్ ఉండటం చూసి సంతోషంతో పైకివచ్చి మొత్తం చీకటిగా ఉండటంతో నిరాశ చెంది లోపలికివచ్చారు .
చెల్లి …….. బెడ్ పై కూర్చున్న వాడిని లాక్కుని బయటకువెళ్లింది – ఏంజెల్స్ ……… నిలబడి డ్రాయింగ్ టేబుల్ పై డ్రాయింగ్ వేస్తున్న నాదగ్గరికివచ్చి మావయ్యా మావయ్యా అంటూ ఆతృతగా పిలిచారు .
వన్ మినిట్ ఏంజెల్స్ ……….
ఏంజెల్స్ : మావయ్యా ……….. అని తియ్యని కోపం .
వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ ఏంజెల్స్ ……….
ఏంజెల్స్ : మావయ్యా ………. అంటూ కోపంతో ink బాటిల్ అందుకుని చార్ట్ పై పోసేసి , ఆఅహ్హ్ …….. అంటూ కళ్ళల్లో చెమ్మతో కదలకుండా ఉండిపోయారు .
ఏంజెల్స్ ను చూసి నవ్వు ఆగలేదు నాకు . లవ్ యు లవ్ యు ఏంజెల్స్ ……… ఏమైంది ఏమీ కాలేదు అని నలుగురినీ గుండెలపై హత్తుకున్నాను .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా ………. అని మొత్తం ink తో ఉన్న చార్ట్ వైపు చూయించారు . ఎంతో కష్టపడి ……….
ఆ కష్టం అంతా ఇక్కడ ఉంది ఏంజెల్స్ ………. ఒకటి కాకపోతే వంద గీద్దాము . చార్ట్ పై ink పోసేంత కోపం అంటే ఏదో మధురాతి మధురమైనదే అయి ఉంటుంది please please ……….. అని చెమ్మను తుడిచాను .
ఏంజెల్స్ : లవ్ యు మావయ్యా ……… అని నవ్వి , లాక్కుని చెల్లెమ్మను వెనుక నుండి చుట్టేసి కిందకు చూస్తున్న కృష్ణగాడి దగ్గరకు తీసుకెళ్లారు . ఒక్క నిమి ……… అనేంతలో ,
పళ్లెం లలో పిండి వంటలు – పళ్ళు – పూలు – పట్టు వస్త్రాలు – నగలు – అక్షింతలు – స్వీట్స్ ………… అన్నింటినీ పట్టుకుని అంటీ – పద్మ – లావణ్యవాళ్ళు ఆ వెనుకే బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని బుజ్జిఅక్కయ్య – అక్క ………. రేయ్ మామా – చెల్లెమ్మా – ఏంజెల్స్ ……….. అక్కయ్య పట్టుచీరలో అని మాటల్లో వర్ణించలేని అనుభూతితో నోటివెంట మాటరానట్లు ఆనందబాస్పాలతో ఏంజెల్స్ ను చేతులతో చుట్టేసి అక్కయ్య వైపే చూస్తున్నాను . లవ్ యు లవ్ యు ఏంజెల్స్ …….. దీనికోసమైతే కొట్టి తీసుకురావాల్సింది అని అక్కయ్యనే ప్రాణంలా చూస్తున్నాను . కృష్ణగాడు కూడా నాలానే కన్నార్పకుండా చూసి చెల్లితోపాటు పరవశించిపోతున్నాడు .
ఆహ్వానితులంతా లేచి బుజ్జిఅమ్మను చూస్తున్నారు – వెనుక ఉన్నవాళ్లు స్క్రీన్స్ లో లైవ్ ఎంజాయ్ చేస్తున్నారు .
వెనుకే ముత్తైదువులంతా పైకిచేరుకున్నారు . కృష్ణగాడు నేను ఇద్దరమూ ఒకేసారి రిమోట్ లు నొక్కాము .
చీకటిని ప్రాలద్రోలుతూ విద్యుత్ కాంతులతో మేడ మొత్తం దేదీప్యమానంతో వెలిగిపోయింది . బంగారపు పట్టుచీర – వొళ్ళంతా నగలతో బుజ్జిదేవతలా చిరునవ్వులు చిందిస్తున్న అమ్మతోపాటు అందరూ సంభ్రమాశ్చర్యాలతో చుట్టూ అలా చూస్తూ ఉండిపోయారు .
ఏంజెల్స్ – చెల్లెమ్మ ……… అక్కయ్య చూసేంతలో వెనక్కు తోసేసి ముసిముసినవ్వులతో వెనక్కు తిరిగి చూసి wow ……… బ్యూటిఫుల్ అని ఒకరినొకరు హత్తుకుని అమ్మదగ్గరికి చేరుకుని బుగ్గలపై సంతోషంతో ముద్దులుపెట్టడం ఆలస్యం , మరొక బటన్ నొక్కడంతో అందరిపై పూలవర్షం – ప్రతీ ఇంటి పైనుండి ఆకాశంలోకి క్రాకర్స్ వెళ్లి ఆ ప్రాంతమంతటినీ వెలుగులతో నింపేయ్యడం చూసి పైన కింద ఆహ్వానితులు ఆకాశం వైపు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .
కృష్ణగాడు నవ్వుకుని విజిల్ వేయడంతో అన్నీ ఇళ్ల నుండి ఫ్లైయింగ్ క్యాండీల్స్ వందలు వేలల్లో ఆకాశంలోకి నెమ్మదిగా ఎగరడం చూసి అందరూ మాటల్లో వర్ణించలేని అనుభూతిని ఆస్వాదించారు . సుమారు ఆర గంటసేపు అందరూ సైలెంట్ గా ఒక కొత్త లోకంలోకి వెళ్లినట్లు మైమరిచిపోయారు .
వెనకున్న ముత్తైదువులంతా సంతోషపు ఆశ్చర్యాలతో ఇలాంటి ఫంక్షన్ ఇప్పటివరకూ చూడలేదు ఇక భవిష్యత్తులో కూడా చూడలేమేమో అని వీనుల విందులా ఆస్వాధిస్తున్నారు .
అంటీవాళ్ళు : బుజ్జిఅమ్మా ………. మాకోరిక తీరింది – చూడండి మన వీధిలోని అన్నీ ఇళ్ల ఫంక్షన్ అని పరవశించిపోయి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అధిచూసి అక్కయ్య ……… ఆనందబాస్పాలతో వొంగి బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
అడుగుకొక ఫోటోగ్రాఫర్ – వీడియో గ్రాఫర్ 365 డిగ్రీస్ లో కవరేజ్ చేస్తున్నారు .
పెద్దమ్మ : తల్లీ వాసంతి – కృష్ణ – బుజ్జితల్లీ …….. ఫంక్షన్ మొదలెడదాము అని బుజ్జిఅమ్మ చేతులను అందుకుని పూలదారిలో గులాబీ రంగు మహారాణి సోఫా దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు .
మహి ఫ్రెండ్స్ అందరూ పళ్లెం లలో తీసుకొచ్చినవన్నీ బుజ్జిఅమ్మ ముందు నేలపై ఉంచారు .
బుజ్జిఅమ్మ ఒకవైపు అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు దీనంగా ముఖం పెట్టి కల్లుపైకెత్తి చుట్టూ చూస్తున్నారు .
ఏంజెల్స్ వెళ్లి …….. మీ నాన్నలు తలుపు ప్రక్కనే చూసి పులకించిపోతున్నారు అని చెవిలో గుసగుసలాడటంతో చూసి వెలిగిపోతున్న ముఖంతో లవ్ యు అంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు .
లవ్ యు అమ్మా లవ్ యు అమ్మా ……… మేమెక్కడికీ వెళ్ళము ఇక్కడే ఉంటాము అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో సైగలుచేసాము .
అమ్మ ఆనందానికి అవధులు లేనట్లు చిరునవ్వులు చిందిస్తున్నారు . తన ఫ్రెండ్స్ …….. అందరూ వాళ్ళ అమ్మలతో వచ్చినందుకు చాలా సంతోషించి , ఫ్రెండ్స్ అందరినీ తన చుట్టూనే ఉంచుకుని ఎంజాయ్ చెయ్యడం చూసి ఇద్దరమూ మురిసిపోయాము .
మొదట అక్కయ్యను ముందుకు తోసారు . అక్కయ్య …….. బుజ్జిఅక్కయ్యతోపాటు అంతులేని ఆనందంతో వెళ్లి అమ్మకు పసుపు కుంకుమ పూసి అక్షింతలతో ఆశీర్వదించి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
అమ్మ …….. అక్కయ్య మరియు బుజ్జిఅక్కయ్య పాదాల దగ్గర చేరి పాదాలను తాకి కళ్ళకు హత్తుకోవడం చూసి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టి పూల వర్షం కురిపించారు .
నెక్స్ట్ జైలర్ అమ్మ చెల్లి పెద్దమ్మ మేడమ్స్ వెళ్లి పసుపు కుంకుమ రాసి కురులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . పాదాలను తాకపోతే ఆపి అమ్మా – జానకి అంటూ గుండెలపై హత్తుకున్నారు .
నెక్స్ట్ ఏంజెల్స్ రావడం చూసి , తల్లులూ …….. ఆగండి , మిమ్మల్ని రౌడీల భారి నుండి రక్షించినది కృనాల్ మనోజ్ గారు …….. , ముందుగా మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా ……..
ఏంజెల్స్ : ఒకవైపు సంతోషం మరొకవైపు కంగారుతో ఆవునవును అని బదులిచ్చారు .
అమ్మ పిలవడంతో ఇద్దరమూ వెళ్ళాము . అంతవరకూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్య , ముఖ్యన్గా నేను రావడం చూసి ముభావంగా మారిపోవడం చూసి అడుగు ఆగిపోవడంతో , అమ్మే స్వయంగా లేచి వచ్చారు .
అమ్మాఅమ్మా …….. అని చిన్నగా ప్రాణంలా పిలిచి సోఫాలో కూర్చోబెట్టి , ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టబోయి ఆగి రేయ్ నీకేమి అడ్డులేదు కానివ్వు అనిచెప్పాను .
కృష్ణ : అమ్మా ……… ఇద్దరిముద్దులు అని కురులపై ప్రాణం కంటే ఎక్కువగా పెట్టాడు . ఇద్దరమూ అక్షింతలు వేసి అమ్మా ………. జీవితాంతం కన్నీటి చుక్క రానివ్వకుండా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము అని చెప్పాము .
లవ్ యు లవ్ యు నాన్నలూ ……… అని లేచి హత్తుకోవడం చూసి అక్కయ్య కోపంతో అడుగువెయ్యబోతుంటే పెద్దమ్మ సముదాయించారు .
అక్కయ్యను ఈ సంతోష సమయంలో బాధపెట్టడం బాగోదు అని వెళ్లిపోబోతుంటే , ఒక్క నిమిషం అని ప్రక్కప్రక్కనే నిలబెట్టుకుని ఫోటోలు తీయించారు . నాన్నలూ ……… ఆ కోపం కొద్దిసేపు మాత్రమే , తల్లులూ – పెద్దమ్మా – తల్లీ వాసంతి బుజ్జివాసంతి రండి కృనాల్ మనోజ్ గార్లతో నాకు గ్రూప్ ఫోటో కావాలని బాంబ్ పేల్చారు .
పెద్దమ్మ ……… అక్కయ్యను కంట్రోల్ చేస్తూనే , బుజ్జిజానకీ ఎలాంటి కోరిక కోరినా తీర్చాలి ఈరోజు అని పిలుచుకునివచ్చారు . ఇద్దరమూ ………. వణుకుతుండటం చూసి అమ్మ – ఏంజెల్స్ – చెల్లి – బుజ్జిఅక్కయ్య లోలోపలే నవ్వుకుంటున్నారు . ఫోటో తీసుకుని అక్కయ్యకు కనిపించకుండా లవ్ యు లవ్ యు అమ్మా ……… this is the best moment of our life అని చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి దూరం వచ్చేసాము .
అక్కయ్య ……… కోపం చల్లారడానికి కొన్ని నిమిషాలు పట్టింది . మళ్లీ మామూలు స్థితికి రావడంతో సంతోషించి అంతమంది ఉన్నా ఎటువంటి ఇబ్బందీ రాకుండా ఏంజెల్స్ – ఏంజెల్స్ డార్లింగ్స్ – అంటీవాళ్ళు – మేడమ్స్ తరువాత ఫ్యామిలీ ఫ్యామిలీస్ పైకివచ్చి అమ్మకు పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆశీర్వదించి గిఫ్ట్స్ ఇచ్చివెళ్లేలా చూసుకున్నాము తమ్ముళ్లతోపాటు .
గంటగంటకూ అమ్మను ప్రక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి దిష్టి తీసి కొత్త పట్టుచీర కట్టించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు . కాలేజ్ అమ్మాయిల కుటుంబాలు – అమ్మ ఫ్రెండ్స్ కుటుంబాలు వచ్చి ఆశీర్వదించి గిఫ్ట్స్ అందించి గ్రూప్ ఫోటోలు దిగారు .
ప్రతి ఒక్కరూ ఫంక్షన్ గురించే ఘనంగా మాట్లాడుకుంటున్నారు .
ఆహ్వానితులు చాలామందే ఉండటం సమయం 9 గంటలు అవ్వడంతో ఒకవైపు ఫంక్షన్ జరుగుతుండగానే భోజనాల ఏర్పాట్లు చేయాలని వైజాగ్ మహేష్ కు కాల్ చేసాను .
తమ్ముళ్లు : అన్నయ్యలూ …….. మేము చూసుకుంటాము కదా క్రికెట్ టీం మొత్తం కోచ్ తోపాటు అందరమూ ఉన్నాము – మీరు ఫంక్షన్ ఎంజాయ్ చెయ్యండి అని వీధిమొత్తం టేబుల్స్ ఛైర్స్ వేయించి , అందరినీ భోజనాలు గౌరవిస్తూ పిలుచుకునివెళ్లి వడ్డించారు .
అరటి ఆకు మొత్తం ఐటమ్స్ నిండిపోవడం చూసి లొట్టలేస్తూ ఆరగించి , wow ……. మ్మ్మ్ …….. ఫంక్షన్ మాత్రమే కాదు భోజనాలు కూడా అమృతం లా ఉన్నాయని మళ్లీ మళ్లీ వడ్డించుకుని తృప్తిగా తింటున్నారు . అపార్ట్మెంట్ నుండి పాత్రల పాత్రల వంటలు వస్తూనే ఉన్నాయి .
రేయ్ మామా ………. వంటలు కూడా అధిరిపోయినట్లుగా ఉన్నాయి . థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ అని తలుచుకున్నాము .
అంతలో వైజాగ్ మహేష్ ఫ్యామిలీ మొత్తం రావడం చూసి అక్కయ్యతోపాటు అందరూ వెళ్లి ఘనంగా ఆహ్వానించి అమ్మదగ్గరకు తీసుకువచ్చారు .
అందరూ ఒకరి తరువాత మరొకరు పసుపు కుంకుమ అక్షింతలతో ఆశీర్వదించి , ఒక్కొక్కరూ ఒక్కొక్క చీర – డ్రెస్ – జ్యూవెలరీ గిఫ్ట్ అందించి ఆప్యాయంగా ముద్దులుపెట్టి సంతోషాన్ని పంచుకున్నారు .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ………. ఫంక్షన్ కు వచ్చిన అమ్మలూ అక్కయ్యలకు బస్ లలో ఉన్న చీరలన్నింటినీ గిఫ్ట్ ఇస్తాము .
మీరు కాదు మీ అమ్మలతో ఇప్పిస్తే ……….
లవ్ యు అంటూ నా బుగ్గలను కొరికేసి , అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – చెల్లి – పెద్దమ్మ – అంటీ వాళ్ళను లాక్కునివెళ్లి వీధికి రెండువైపులా ఒక్కొక్క బస్ ఆపించి , భోజనం చేసి సంతృప్తిగా ఇంటికి వెళుతున్న ముత్తైదువులకు అక్కయ్యా వాళ్ళ ద్వారా పట్టుచీరలను అందించారు .
అందరూ : వాసంతి గారూ ఫంక్షన్ ఘనంగా జరిగింది – భోజనాల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే – ఇక ఇప్పుడు ఇష్టమైన పట్టుచీరలు ………. ఇలాంటి ఫంక్షన్ జీవితంలో చూస్తామో లేనంత అందమైన అనుభూతిని అందించారు . మీరు సంతోషంగా ఉండాలి అని దీవించి వెళ్లడం చూసి ,
అక్కయ్య ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి పెద్దమ్మ గుండెలపై వాలారు .
పెద్దమ్మ : తల్లీ …….. మన సెంటిమెంట్ తరువాత , ముందు చీరలు అని చెప్పడంతో బాస్పాలను తుడుచుకుని , ఫంక్షన్ వచ్చి అమ్మను ఆశీర్వదించినందుకు చాలా సంతోషం అని చిరునవ్వులు చిందిస్తూ చీరలను అందించారు .
పైన జైలర్ అమ్మ – రాధ అంటీ ………. అమ్మ ప్రక్కనే ఉండి చూసుకుంటున్నారు .
10 గంటలకు ముత్తైదువులంతా అమ్మను ఆశీర్వదించి భోజనాలకు వెళ్లారు – అమ్మ ఫ్రెండ్స్ బోలెడన్ని ఫోటోలు దిగి వెళ్ళొస్తామని చెప్పి కింద తమ తమ ఫ్యామిలీ దగ్గరకు చేరుకున్నారు . గిఫ్ట్స్ చీరలు డ్రెస్ లతో తో పైనున్న ఇల్లు మరియు బయట నిండిపోయాయి .
జైలర్ అమ్మ – అంటీ మా ఇద్దరినీ లాక్కుని వచ్చి అమ్మకు చెరొకవైపు కూర్చోబెట్టి , ఏంజెల్స్ కు కాల్ చేశారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ ……… , ఎంత ఎంజాయ్ చేశానో మాటల్లో చెప్పలేను – రేపటి నుండి వారం రోజులు మాట్లాడుకుందాము అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోయారు .
చెల్లెమ్మ – ఏంజెల్స్ పైకివచ్చి చూసి శ్రీవారూ – మావయ్యా మావయ్యా ……… మమ్మల్ని వదిలి మీరు మాత్రమే అని పరుగునవచ్చి మా ఒడిలో – చుట్టూ హత్తుకుని కూర్చుని గుండెలపై ప్రేమతో కొట్టి , బుజ్జిఅమ్మా – బుజ్జిఅమ్మమ్మా …….. ప్రతీ ఒక్కరూ ఫంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నారు – ఇప్పటివరకూ చూడలేదు మళ్లీ చూడలేము అని సంతృప్తితో వెళుతున్నారు . మావయ్యా …….. పూల వర్షం ఎక్కడ ………
లవ్ యు లవ్ యు అని రిమోట్ నొక్కడంతో పూల వర్షం – ఆకాశంలో క్రాకర్స్ చూసి అమ్మను ముద్దులతో ముంచెత్తారు . ముద్దులుపెడుతూనే రకరకాల ఫోజ్ లతో తనివితీరేంతవరకూ ఫోటోలు తీసుకున్నారు .
11 గంటలకు ఆహ్వానితులంతా అక్కయ్యతో సంతోషాలను పంచుకుని చీరలను గుండెలపై హత్తుకుని వెళ్ళొస్తామని చెప్పి వెళ్లారు .
అక్కయ్య అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తుతూ పెద్దమ్మ గుండెలపై వాలి పైకిరావడం చూసి మమ్మల్ని సోఫాలోనుండి లాగేసి , అమ్మా – పెద్దమ్మా …….. ఇక మన ఫోటో సెస్సన్ మాత్రమే మిగిలింది అని మళ్లీ మొదలెట్టారు .
తమ్ముళ్లు ……… అందరికీ ఫుడ్ పైకే తీసుకొచ్చి వడ్డించారు . అన్నయ్యలూ ……. ప్రతి ఒక్కరి నోటా అమృతం అని అంటూ అందరమూ భోజనం చేసాము . అందరి చేతిముద్దలూ తింటూ మాదగ్గరికివచ్చి తిని తినిపించి పరవశించారు అమ్మ .
అక్కయ్య – అందరి ఆనందాన్ని చూసి ఇద్దరమూ అంతులేని సంతోషంతో కిందకుదిగి వైజాగ్ మహేష్ ను కౌగిలించుకుని థాంక్స్ చేప్పాము .
వైజాగ్ మహేష్ : మళ్లీ చెబుతున్నాను మహేష్ – కృష్ణ …….. మన ఫంక్షన్ లో మనం సంతోషంతో కష్టపడ్డాము అని కౌగిలించుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు.
అర గంటలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది . హైద్రాబాద్ రాజమండ్రి నుండి వచ్చినవారంతా మళ్లీ మా మహేష్ కృష్ణ వారి అమ్మను కలిసిన తరువాత ఎలాగో మళ్లీ రావాలని మేడమ్స్ తోపాటు రాథోడ్ ఫ్లైట్ లొనే వెళ్లారు . ఎయిర్పోర్ట్ వరకూ వస్తామన్నా …….. అక్కయ్య ఆనందాలను ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పి వెళ్లిపోయారు .
రెండురోజులుగా తీరిక లేకపోవడం వలన అందరూ అలసిపోయినట్లు బుజ్జిఅమ్మను పిలుచుకుని ఇంట్లోకి వెళ్లారు .
శ్రీవారూ – మావయ్యా మావయ్యా ………. అక్కయ్య – అమ్మ అమ్మ ఫుల్ హ్యాపీ అని మా గుండెలపై చేరిపోయారు . లోపల మొత్తం గిఫ్ట్స్ తో నిండిపోవడం వలన అందరమూ మేడపై పడిన పూలపైనే మెత్తగా వాలిపోయాము . ప్రక్కనే కృష్ణగాడు చెల్లెమ్మ .
పెదాలపై చిరునవ్వుతో ఏంజెల్స్ పెదాలపై ముద్దులుపెట్టి వాళ్ళ ముద్దులను ఆస్వాదిస్తూ కళ్ళుమూసుకోగానే నిద్రపట్టేసింది .
అందరమూ లేచి రేయ్ మామా ఏమయ్యిందిరా అని అడిగాను – ప్రక్కనే చెల్లెమ్మ నిలబడి ఉండటంతో ఏంజెల్స్ వెళ్లి కంగారుపడుతూ హత్తుకున్నారు . రేయ్ మామా ఈ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట అవుతోంది uniform gun అని ఆశ్చర్యంతో అడిగాను .
కృష్ణ : రేయ్ మామా ……… గంట ముందు వైజాగ్ జైల్ నుండి నలుగురు రాక్షసులు జైలర్ మరియు కానిస్టేబుల్స్ ను చావబాది తప్పించుకున్నారు . ఆ నలుగురూ ఎలాంటి క్రిమినల్స్ అంటే సైకోలు అని చెల్లెమ్మ వైపు చూసాడు .
చెల్లి ……… ఏంజెల్స్ చెవులను మూసి కాస్త దూరం తీసుకెళ్లారు .
కృష్ణ : ప్లాన్ వేసి అమ్మాయిలను ఎత్తుకెళ్ళి దారుణంగా రేప్ చేసి చంపేస్తూ బ్రతికిన వాళ్ళను డ్రగ్స్ కు బానిసలను చేసి ముంబై దుబాయ్ కు అమ్మేస్తున్నారు . వాళ్ళ నలుగురి వలన మన రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు . నెలరోజుల ముందు మన సెక్యూరిటీ ఆఫీసర్లు ముంబై లో పట్టుకున్నారు , వాళ్లకు కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష వేసింది – ఇంతలో తప్పించుకున్నారు . వైజాగ్ వదిలి వెళ్లకుండా రోడ్స్ రైల్ ఎయిర్పోర్ట్ మొత్తం బందోబస్తు ఏర్పాటుచేసాము – వైజాగ్ లొనే ఎక్కడో దాచుకున్నారు – మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు రంగంలోకి దిగాము .
కమింగ్ కమింగ్ ……… రేయ్ మామా …….. జాగ్రత్త నిద్రపోవద్దు – తప్పించుకోవడం కోసం దాచుకోవడం కోసం ఏ ఇంటిలోనైనా దూరవచ్చు అని వార్నింగ్ ఇచ్చి కిందకువెళ్లి సెక్యూరిటీ అధికారి వెహికల్ రావడంతో ఎక్కి వెళ్ళిపోయాడు .
ఫంక్షన్ అయిపోగానే ఆఫ్ చేసిన లైట్స్ అన్నింటినీ రిమోట్ ద్వారా on చేసాను . వీధిమొత్తం వెలుతురు వెదజల్లాయి . చెల్లెమ్మా – ఏంజెల్స్ ……… మీరు వెళ్లి కింద పడుకోండి అనిచెప్పి పైనుండి కనురెప్ప వేయకుండా గమనిస్తున్నాను .
చెల్లెమ్మతోపాటు దుప్పట్లు కప్పుకుని నన్ను రెండువైపులా చుట్టేసి మేముకూడా ఇక్కడే ఉంటాము అని హత్తుకున్నారు .
మొబైల్ తీసి తమ్ముళ్లకు జాగ్రత్తగా ఉండండి situation అని మెసేజ్ పెట్టాను .
నిమిషంలో అందరూ బయటకువచ్చి మేము పైన ఉండటం చూసి కంగారుపడుతూ వచ్చి విషయం తెలుసుకుని వాళ్ళ వాళ్ళ ఇంటిదగ్గర అటూ ఇటూ తిరుగుతున్నారు . చిన్న అలికిడి అయినా తమ్ముళ్లు వెళ్లి చూసి సేఫ్ అని మెసేజ్ పెడుతున్నారు .
ఏంజెల్స్ – చెల్లెమ్మ …….. నా గుండెలపై ఒకరొకరిపై నిద్రపోవడంతో , నెమ్మదిగా పూలపాన్పుపై పడుకోబెట్టి వెచ్చగా ఉండేలా దుప్పట్లు కప్పాను . అందరి నుదుటిపై ముద్దులుపెట్టి లేచి నిలబడి గంట గంటకూ కృష్ణ గాడికి కాల్ చేసి అప్డేట్ తెలుసుకుని మరింత అప్రమత్తతతో వాచ్ చేస్తున్నాము .
తొలి సూర్యుడి కిరణాలు చెల్లి – ఏంజెల్స్ పై పడటంతో కంగారుపడుతూ లేచి నా గుండెలపైకి చేరారు .
గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా – ఏంజెల్స్ ………..
గుడ్ మార్నింగ్ అన్నయ్యా – మావయ్యా ……… మావయ్య కాల్ చేశారా ? .
ఇంకా దొరకలేదంట చెల్లీ – ఏంజెల్స్ ……… సిటీ మొత్తం హై అలర్ట్ ఉంచారు – ఏ క్షణమైనా పట్టుకుంటాము అనిచెప్పాడు .
అన్నయ్యా ……….. టీ తీసుకొస్తాము అని ఏంజెల్స్ తోపాటు కిందకువెళ్లారు .
వీధి చివరన ఒకడు ఎంటర్ అవ్వడంతో తమ్ముళ్లు ఆపి వెంటనే లోపలికి వదిలారు. వెంటనే నా మొబైల్ రింగ్ అయ్యింది చూస్తే తమ్ముడు – అన్నయ్యా ……… తప్పుగా మాట్లాడితే క్షమించండి వాడే మురళి .
ఇన్నిరోజులకు………
తమ్ముడు : అవును అన్నయ్యా వాడే , మేడం ను అన్నివిధాలా బాధపెట్టినవాడు – మళ్లీ ఎందుకువచ్చాడో – ఆర్డర్ వెయ్యండి ఇటు నుండి ఇటే పంపించేస్తాము .
రానివ్వండి తమ్ముళ్లూ ………. మీరు కాదు మీ మేడం పంపించెయ్యాలి అని కోపంతో వాడినే చూస్తున్నాను .
తెల్ల జిబ్బా , చెవిలో పూలు , నుదుటిపై బొట్టు పెట్టుకుని బుద్ధిమంతుడిలా వస్తున్నాడు . వెంటనే కృష్ణగాడికి కాల్ చేసి విషయం చెప్పాను .
కృష్ణ : రేయ్ మామా …….. వాడిని అక్కడికక్కడే పాతిపెట్టక నాకు కాల్ చూసావా ఇప్పుడే వస్తున్నాను . సేమ్ రిప్లై వాడికీ ఇచ్చాను .
మురళి …….. ఇంటిదగ్గరకువచ్చి గేట్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు . క్షణం ఆగకుండా పైనుండి ఒక్క జంప్ చేసి లోపలికి వెళ్లబోతుంటే , లోపల హల్ మొత్తం పడుకున్న లావణ్య పద్మ వాళ్ళను చూసి , చెవిదగ్గర మొబైల్ పట్టుకుని బయటకువచ్చి hi ……. నేను వాసంతి భర్త అని విష్ చేసి గేట్ తీసుకుని బయటకు వెళుతూ , మాల్ రా రేయ్ మాల్ బహుత్ బహుత్ మాల్ ……….. టీక్ ఆవ్ అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ కాస్త దూరం వెళ్లి నిమిషం పాటు మాట్లాడి జల్దీ ఆవ్ జల్దీ జల్దీ ఆవ్ అని మాత్రం వినిపించాయి . 15 నిమిషాలలో బస్ వచ్చి ఆగింది – అందులోనుండి సేమ్ టు సేమ్ డ్రెస్ కోడ్ తో ముగ్గురు బుద్ధిమంతుల్లా కిందకుదిగి నవ్వుకుంటూ హైఫై లు కొట్టుకున్నారు . ఫైవ్ మినిట్స్ అని చేతితో సైగ చేసి మళ్లీ రాక్షస నవ్వు నవ్వుకుంటూ లోపలికివెళ్లి పడుకున్న వాళ్ళను ఒకవిధంగా చూసి రాక్షస నవ్వు నవ్వుతుండటం విండో నుండి చూస్తున్నాను .
వంట గదిలోనుండి మహి టీ తోపాటువచ్చి , గ్లాస్ కిందపడేసి అమ్మా – పెద్దమ్మా …….. అని కేకలువెయ్యడంతో , డోర్ దగ్గరికి చేరుకున్నాను . పడుకున్నవాళ్ళంతా లేచారు .
అక్కయ్య వెనుకే బుజ్జిఅక్కయ్య గదిలోనుండి వచ్చి తల్లీ తల్లీ …….. అని మురళిని చూసి నువ్వా మళ్లీ ఎందుకు వచ్చావు అని కోపంతో మాట్లాడారు .
వాడు ఏంజెల్స్ ను – ఏంజెల్స్ డార్లింగ్స్ వైపు చూసి లెక్కపెడుతుండటం చూసి , బుజ్జిఅక్కయ్యను చెల్లికి అందించి అందరినీ లోపలికి పంపించేశారు . పెద్దమ్మ – అంటీ ……… అక్కయ్య ప్రక్కనే నిలబడ్డారు .
అంటీ : పెద్దమ్మా ……… వీడే మురళి .
ఆ మాటలకు వాడికి కోపం వచ్చినా బయటకు మాత్రం అవును నేనే మురళి ఈ ఇంటికి పెద్దను .
అక్కయ్య : ఎప్పటికీ కాదు .
మురళి : చూడు వాసంతి నాకు బుద్ధొచ్చింది ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను . నిన్న మన పాప ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిగిందని తెలుసుకుని చాలా చాలా ఆనందించాను . ఇన్నిరోజులూ …….. తిరుమల కొండపైన స్వామివారి సన్నిధిలో సేవించుకుంటూ గడిపాను . భక్తా …….. నీ కూతురి ఫంక్షన్ జరుగుతోంది వెళ్ళు అని స్వామి కలలో కనిపించి పంపడంతో ఆలస్యమైనా వచ్చేసాను . నన్ను చూస్తుంటేనే అర్థం కావడం లేదా వాసంతి . మీకోసం స్వామివారు ప్రసాదం కూడా పంపించారు అని చేతిలోని కవర్ చూయించాడు అని ముందుకువెళ్లాడు .
అక్కయ్య : ఆగు అక్కడే ఆగు , చివరికి ఆ భగవంతుడే వచ్చి చెప్పినా నిన్ను నమ్మను . నా పిల్లలు ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏమిటో చూస్తున్నారు – నువ్వు వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది . ఆ అమ్మవారి అనుగ్రహం వలన దేవతలే స్వయంగా వచ్చి మా అమ్మ ఫంక్షన్ జరిపించారు – నాకు ఇక ఏ ఆశ లేదు వాళ్ళ సంతోషం తప్ప ఇక ఎవ్వరూ అవసరం లేదు వెళ్లిపో , ఇక ఎప్పటికీ రాకు .
మురళి : నేను మారిపోయాను వాసంతి , మిమ్మల్ని ఆ స్వామి దగ్గరకు మిమ్మల్నే కాదు ఇప్పుడు ఇంటిలో ఉన్నవారందరినీ తీసుకొస్తాను అని మొక్కు కోరుకున్నాను – బయట బస్ కూడా రెడీగా ఉంది .
అక్కయ్య : అవసరం లేనే లేదు , కొన్నిరోజుల క్రితమే స్వామివారిని దర్శించుకుని మా మొక్కులు తీర్చుకున్నాము – నువ్వు ఎంత నాటకాలు ఆడినా నేను నమ్మను గాక నమ్మను వెళ్లిపో ………
అంటీ : చెల్లి చెబుతోందికదా వెళ్లిపో ……..
మురళి : కోపంతో వేలుని చూయించి , please please …….. వాసంతి ఈ ఒకే ఒక్కసారి నమ్ము , అక్కడకు వచ్చి ఎవరినైనా అడుగు , ఈ ఒక్కసారికీ నాతోపాటు రండి అని అక్కయ్య పాదాలను తాకబోతే ,
అక్కయ్య వెనక్కువెళ్లి నువ్వు మారితే ఏంటి మారకపోతే ఏంటి వెళ్లిపో అని కోపంతో బయటకు వేలిని చూయించింది .
యాహూ …….. అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నాను .
అంతే వాడు కోపంతో ఒసేయ్ మంచిగా చెబితే నువ్వు వినవే నిన్ను దీన్ని నువ్వు లోపల పంపించిన అమ్మాయిలను అని వెళ్లి అక్కయ్య చేతిని అందుకుని లాక్కుని బయటకు రాబోతే ,
కట్టలు తెంచుకున్న కోపంతో రేయ్ అనేంతలో , కూల్ మామా కూల్ ……… నేనున్నాను కదా అని డైలీ పేపర్ అందించి కృష్ణగాడు నన్ను ఆపి లోపలికివెళ్లాడు .
అంతే సెక్యూరిటీ అధికారి ను చూసి అక్కయ్య చేతిని వదిలేసి వొళ్ళంతా చెమటతో వణుకుతూ నిలబడ్డాడు .
పేపర్ చూస్తే జైల్ నుండి తప్పించుకున్న సైకోలలో ఒకడు మురళి గాడు .
అక్కయ్య కేకలకు బుజ్జిఅమ్మ చెల్లి ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ………. అమ్మా అమ్మా అంటూ కంగారుపడుతూ హాల్లోకి వచ్చి మురళీగాడు వణకడం చూసి అక్కయ్యను చుట్టేసి వెనక్కు తీసుకెళ్లారు .
కృష్ణ : మురళి గాడి మెడను చేతితో చుట్టేసి షర్ట్ వెనుక పెట్టుకున్న కత్తిని తీసి కానిస్టేబుల్ కు అందించాడు . మేడం ……… విషయం పెద్దది , తెలియక ముందు తెలిసిన తరువాత మీరు ఏమిచెయ్యమంటే అధిచేస్తాను . రేయ్ బయట ఉన్న ముగ్గురూ …….. రక్తపు మడుగులో పడి ఉన్నారు ఎన్కౌంటర్ .
వాడు బెదిరిపోతున్నాడు .
కృష్ణ : చెప్పండి మేడం విషయం తెలియక ముందు – వీడిని ఏమిచెయ్యమంటారు .
అక్కయ్య : కృనాల్ గారూ వాడి గురించి నాకు బాగా తెలుసు , ఇక జీవితంలో వాడిని చూడకూడదు .
కృష్ణ : శ్రీమతి గారూ , మహి , స్వాతి ……… అని సైగ చేసి మరొక పేపర్ అందించాడు .
అక్కయ్యకు విషయం వివరించి పేపర్ చూయించారు . అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో …….. తల్లులూ ఈ కన్నీళ్లు వీడికోసం కాదు వీడి వలన బాధలు అనుభవించిన అభం శుభం తెలియని అమ్మాయిలకోసం అని బుజ్జిఅక్కయ్యను హత్తుకుని పెద్దమ్మ గుండెలపైకి చేరారు .
కృష్ణ : శిక్ష విధించే ముందు ఈ ఆడియో కూడా వినండి మేడం అని మొబైల్ లో ప్లే చేసాడు .
” అర్ భాయ్ మాల్ హై రే మాల్ ……… నా కూతురితోపాటు చాలామంది అమ్మాయిలు , లైఫ్ సెటిల్ అయిపోతుంది – అందరినీ ముంబై రెడ్ లైట్ ఏరియా , దుబాయ్ షేక్ లకు అమ్మేస్తే కోట్లు కోట్లు , మీరు వెంటనే నాలా బుద్ధిమంతుడిలా మారువేషం వేసుకుని బస్ తోపాటు వచ్చెయ్యండి – డ్రగ్స్ కూడా తీసుకురండి , బస్ ఎక్కగానే డ్రగ్స్ ఎక్కించి తెరుకునేలోపు మన పని పూర్తిచేసేసి దుబాయ్ చెక్కేద్దాము – జల్దీ ఆవ్ జల్దీ ఆవ్ ”
అక్కయ్య ……… ప్రాణంలా అందరినీ హత్తుకుని , కోపంతో వాడిని కొట్టబోతే – కృష్ణగాడు ఆపి మీ పవిత్రమైన చేతి స్పర్శ కూడా వీడిని తాకాకూడదు , ఏమి చెయ్యమంటారో మీరే ఆర్డర్ వెయ్యండి .
అక్కయ్య వెనక్కుతిరిగి ఏంజెల్స్ – లావణ్య బుగ్గలు స్పృశించి నా తల్లులకు ఇలా జరగబోతోంది అని తెలిస్తేనే గుండె ఆగినంత పని అయ్యింది – ఇక వీడి వలన తమ బిడ్డలను కోల్పోయిన వారి బాధ ఊహించుకుంటేనే హృదయం తల్లడిల్లిపోతోంది – బయట ముగ్గురికీ ఎటువంటి శిక్ష అమలుచెయ్యబోతున్నారో వీడికి కూడా ………
మురళి : ఒసేయ్ ఒసేయ్ …….. నేను నీ భర్తను , నీ తాళి తెగిపోతుంది .
నువ్వు తాళి కట్టిన మరుక్షణమే పీకి చెత్తకుప్పలో పడేసాను లాక్కెళ్లండి సర్ అని ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకున్నారు .
కానిస్టేబుల్స్ లాక్కెళ్లండి అని రక్తం వచ్చేలా డొక్కలో ఒక గుద్దు గుద్ది కాళ్ళు విరగ్గొట్టి , వెంటనే కోర్ట్ లో హాజరుపరచండి అని తోసాడు . కానిస్టేబుల్స్ బేడీలు వేసి లాక్కునివెళ్లారు – వీధి మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లు వెహికల్లో వేసుకుని జైల్ కు తీసుకెళ్లారు.
కృష్ణ : రేయ్ మామా …….. కనిపించగానే వీడిని ఏమైనా చేసి ఉంటే మిగతా ముగ్గురూ తప్పించుకునేవాళ్ళు , వీడు కాల్ చెయ్యగానే కంట్రోల్ రూమ్ వాయిస్ గుర్తుపట్టడంతో ఇక్కడికి చేరుకున్నాము . నలుగురినీ పట్టించినందుకు అని సెల్యూట్ చేసాడు .
అక్కయ్య : కృనాల్ గారూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ . మరొక్క చిన్న సహాయం ఎలా చెప్పాలో ………
కృష్ణ : at your service మేడం ……….
అక్కయ్య : నా తల్లులు నా తమ్ముడికి మాత్రమే సొంతం అనగానే అందరికీ విషయం అర్థమైపోయింది . మీ ఫ్రెండ్ ……. నా తల్లులను టీజ్ చేస్తున్నాడు .
ఏంజెల్స్ తోపాటు నవ్వుకుని ఇక లాగడం సరికాదు అని అక్కయ్య దగ్గరికివెళ్లి , మేడం ……….. నా టేస్ట్ అంత చీప్ కాదు మేడం – నేను టీజ్ చేస్తున్నది ప్రాణంలా ప్రేమిస్తున్నది మిమ్మల్నే అని ఏకంగా పెదాలపై సంతకం చేసేసాను .
అంతే అందరూ సంతోషపు షాక్ ……….
అక్కయ్యకు కూడా ముద్దులో తమ్ముడు తెలిసినట్లు ముద్దుని ఆస్వాదించి , వెంటనే తేరుకుని వెనక్కువెళ్లి అంతులేని కోపంతో చెంప చెళ్లుమనిపించారు – బుజ్జిఅక్కయ్య నవ్వుతూనే మరొక చెంపపై బుజ్జిదెబ్బ వేశారు .
వాసంతి మేడం నా హృదయమంతా మీరే ( అక్కయ్య వెనుక all the best all the best అని సౌండ్ చెయ్యకుండా ఎంజాయ్ చేస్తున్నారు ) మీరు ఒప్పుకుంటే మీకోసం మరొక తాజ్ మహల్ కాదు కాదు ” వాసంతి మహల్ ” కట్టిస్తాను ” I LOVE YOU ” అని వీధి మొత్తం వినిపించేలా చెప్పి షాక్ లో ఉన్న అక్కయ్య తేనెలూరే పెదాలపై మరొక ముద్దుపెట్టాను .
కళ్ళల్లో కన్నీళ్ళతో చెంపలు ఎడాపెడా వాయించి గెట్ ఔట్ అన్నారు – yes yes గెట్ ఔట్ అని బుజ్జిఅక్కయ్య కూడా దెబ్బలు వేసి వేలుని బయటకు చూయించారు .
ఇద్దరి వేళ్లపై ముద్దులుపెట్టి బుజ్జిఅక్కయ్యా …….. మీకు నేను కావాలా అక్కయ్య కావాలా అని నవ్వుని ఆపుకుంటూ అడిగాను .
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా …….. , నాకు తమ్ముళ్లకు అక్కయ్యే కావాలి – గెట్ ఔట్ అని ప్రాణంలా కన్నుకొట్టారు .
అక్కయ్య అంత కోపంలోనూ సంతోషంతో బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి హత్తుకునే లోపలికివెళ్లిపోయారు .
సూపర్ సూపర్ అంటూ చెల్లి – పెద్దమ్మ – అంటీ – లావణ్యవాళ్ళు – అంటీవాళ్ళు …….. అక్కయ్య వెనుకే వెళ్లారు .
లవ్ యు నాన్న – లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ……… అని అమ్మ – ఏంజెల్స్ నన్ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తారు .
లేకపోతే ఎన్నిరోజుల నుండి అక్కయ్య దెబ్బలకోసం ఎదురుచూడాలి – బుగ్గలను చేతులతో స్పృశించి చాలా రుచిగా ఉన్నాయి దెబ్బలు – మరికొన్ని తినొస్తాను అని లోపలికి వెళ్లబోతుంటే ,
కృష్ణ : వాట్ వాట్ ……… this is the best న్యూస్ ఆఫ్ my లైఫ్ – థాంక్యూ థాంక్యూ థాంక్యూ so so so sooooooo మచ్ – will be there will be there ………… అని కట్ చేసి మొబైల్ జేబులో పెట్టుకుని , అమితమైన సంతోషంతో రేయ్ మామా రేయ్ మామా అని లోపలికి వెళ్లబోతున్న నన్ను అమాంతం భుజం పై ఎత్తుకుని బుజ్జిఅమ్మా వచ్చెయ్యండి – మహి స్వాతి ప్రసన్నా స్వప్న ……… వెళ్లి మీ కృష్ణ అమ్మను లాక్కిని రండి కేవలం మీ కృష్ణ అమ్మను మాత్రమే అని బయటకువచ్చి రేంజ్ రోవర్ ముందుసీట్లోకి పడేసి స్టార్ట్ చెయ్యమని ఆర్డర్ వేసాడు .
రేయ్ ……. ఎక్కడికిరా అక్కయ్య ?
కృష్ణ : వదినలూ …….. మీరు లోపల , తమ్ముళ్లూ – అన్నయ్యలూ ……. మీరు బయట – సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేన్తవరకూ జాగ్రత్తగా ఉండండి అనిచెప్పాడు .
Yes సర్ …….. అని సెల్యూట్ చెయ్యడంతో , uniform చూసుకుని నవ్వుకున్నాడు . కాస్త దూరం వెల్లి ఒక కాల్ చేసివచ్చాడు .
ఏంజెల్స్ ……… చెల్లెమ్మను పిలుచుకునిరావడంతో , కృష్ణగాడు వెనుక డోర్స్ తెరిచి అమ్మా – శ్రీమతిగారూ మీ ప్రియమైన తల్లులతోపాటు కూర్చోండి అనిచెప్పాడు . డోర్స్ వేసి ముందుకూర్చుని డ్రైవర్ …….. ఎయిర్పోర్ట్ కు పోనివ్వమని చెప్పాడు .
వెనుక అందరూ నవ్వుకున్నారు . ఇంటిబయట తమ్ముళ్లు అన్నయ్యలు ఉండటం చూసి Yes సర్ ……… అని గేర్ మార్చి పోనిచ్చాను .
కృష్ణగాడు హమ్మయ్యా ……… అర గంటలో ఫ్లైట్ 1 2 3 …….7 8 – సెలెక్ట్ 8 బిజినెస్ టికెట్స్ – అమౌంట్ paid – టికెట్స్ కంఫర్మ్ అని మొబైల్ చూయించాడు .
ఫ్లైట్ టికెట్స్ ……. ఎక్కడికి వెళుతున్నాము రా ? .
కృష్ణ : వెలిగిపోతున్న ముఖంతో అంతులేని ఆనందంతో మొబైల్ జేబులో పెట్టేసుకుని సర్ప్రైజ్ ……….. తొందరగా పోనివ్వు 20 నిమిషాలలో చెక్ ఇన్ అవ్వాలి అని ఎయిర్పోర్ట్ చేరుకుని అనౌన్స్మెంట్ జరుగుతున్న ఢిల్లీ ఫ్లైట్ లోకి తీసుకెళ్లాడు .
రేయ్ మామా ఢిల్లీకి ఎందుకురా ? . అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ………. సేఫ్టీ .
కృష్ణ : ఈపాటికి బెటాలియన్ దిగిపోయి ఉంటుంది . మరొక రెండు గంటల్లో మనం తిరిగి వచ్చేన్తవరకూ వందలమంది మనమంటే ప్రాణమిచ్చే ఆత్మీయులైన రియల్ సోల్జర్స్ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటారు – కంగారుపడాల్సిన అవసరం లేదు – కొద్దిసేపు ఏమీ ఆలోచించకుండా నీ ఏంజెల్స్ తో ఎంజాయ్ చెయ్యమనిచెప్పి బుజ్జిఅమ్మ – చెల్లితోపాటు ముందుసీట్లో కూర్చున్నాడు ……..
Facebook links
Admin account id : ADMIN Facebook ACCOUNT LINK
PAGE LINK : TELUGU SRUNGARA KATHALU
GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook
twitter link
181c