Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?
Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?
Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?
తాజాగా సోనూసూద్ కతిహార్ ఇంజనీర్ అనే వ్యక్తిని కలిశారు. ఈ వ్యక్తి అనాథ పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేయగా బీహార్ లోని పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చాలని సోనూసూద్ కూడా స్కూల్ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని సోనూసూద్ భావిస్తున్నారు. ఇప్పటికే అనాథ పిల్లల కోసం ఉన్న పాఠశాల కొరకు సోనూసూద్ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు.
సోనూ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించాలని ఆయన భావిస్తున్నారు. సోనూసూద్ ఇప్పటికే దేశంలోని వేల సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. విద్యకు ప్రాధాన్యత పెంచడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చని సోనూసూద్ పేర్కొన్నారు. పేద పిల్లలను విద్యావంతులను చేయడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు మెరుగైన విద్యావకాశాలను కల్పించవచ్చని సోనూసూద్ చెప్పుకొచ్చారు.
సోనూసూద్ (Sonu Sood) కు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సోనూసూద్ తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత సోనూసూద్ కు కొంతమేర ఆఫర్లు తగ్గాయి. సోనూసూద్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చూపించడానికి దర్శకులు సాహసించడం లేదు.