Pedarasi Peddamma Varam – 61 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam - 61 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam – 61 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Mahesh.thehero
మ్యాచ్ వీక్షిస్తూ చుట్టూ బిల్డింగ్స్ చూస్తున్నాను . ఏరియా లోని బిల్డింగ్స్ అన్నీ కొత్తగా రంగురంగుల పెయింట్స్ తో కళకళలాడుతున్నాయి కానీ , చిన్న గ్రౌండ్ కు ఎదురుగా అంటే బిల్డింగ్స్ చివరన ఒక మూడంతస్తుల బిల్డింగ్ మాత్రం ఎవ్వరూ నివశించనట్లు భూత్ బంగళాలా – కాంపౌండ్ మొత్తం ముళ్ల చెట్లు పిచ్చిమొక్కలతో నిండిపోయింది – మెయిన్ గేట్ కు వేసిన తాళం కూడా తుప్పుపట్టింది – గేట్ కు మంత్రశక్తుల తాయెత్తులు కట్టడం కాస్త ఆసక్తినే కలిగించి , గోవర్ధన్ ను అడిగాను ఇంత విలాసవంతమైన ఏరియా లో ఆ భూత్ బంగ్లా ఏంటి అని ……..
అంతే గోవర్ధన్ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి – భయంతో వణికిపోతున్నాడు . చుట్టూ కూర్చున్న అందరూ ఒకవైపు నవ్వుతూనే మరొకవైపు భయపడుతున్నారు. గోవర్ధన్ గోవర్ధన్ …………
గోవర్ధన్ ఫ్రెండ్ వినయ్ : మహేష్ ……. కొన్నినిమిషాలపాటు కదలనే కదలడు . గోవర్ధన్ మాత్రమే కాదు ఇక్కడ ఉంటున్న డాడీ – అంకుల్ వాళ్లందరికీ ఈ బిల్డింగ్ అంటే చాలా భయం – తెలియక అన్నా భూత్ బంగ్లా అన్నది నిజమే ……. – లోపల దెయ్యాలు ఉన్నాయని ఆ బిల్డింగ్ ను పడగొడితే దెయ్యాలన్నీ ఇక్కడ ఉన్న ఇళ్లలోకి చేరతాయని మంత్రగాడు చెప్పాడు , దెయ్యాలు బయటకు రాకుండా dad వాళ్ళు పెద్ద హోమం జరిపించి ఇలా బిల్డింగ్ చుట్టూ తాయెత్తులు కట్టారు . వీడికి ఎందుకు ఇంత భయం అంటే వీడి ఇల్లు అదిగో ఎదురుగా ఉన్నదే – ఒకటి రెండు సార్లు డాక్టర్ అంకుల్ వాళ్ళు లోపల నుండి దెయ్యాల సౌండ్స్ మరియు వెలుగులు చూసారట అప్పటి నుండీ వీడికి – అంకుల్ కు బిల్డింగ్ చూస్తేనే చాలు ఉచ్చ కారిపోద్ది అని నవ్వుకున్నారు – మేము నవ్వుతున్నాము కానీ మాకూ చాలా భయం అటువైపు దగ్గరికి వెల్లమంటే వెళ్ళము ఇప్పటికే లోపలకు చాలా బాల్స్ వెళ్ళిపడ్డాయి .
మరి బాల్స్ తెచ్చుకున్నారా ……. ? .
వినయ్ : అంత ధైర్యం ఎవరికి ఉంది వదిలేసి పరిగెత్తడమే ……… , అదిగో ఆ బిల్డింగ్ ప్రక్కన ఆనుకుని ఉన్న గోవర్ధన్ మరొక చిన్న ఇల్లు , దెయ్యాలు అని తెలిసి ఒక్కరూ ఆ ఇంటిలోకి రెంట్ కు రావడం లేదు – సంవత్సరాలుగా రెంట్ మనీ మిస్ అయిపోతోందని తెగబాధపడిపోతుంటారు . మామూలుగా అయితే ఇక్కడ రెంట్ టెన్ థౌజండ్స్ పైనే ఉంటుంది సగం వచ్చినా చాలు ఎవ్వరినైనా సెట్ చెయ్యి అని బ్రోకర్ ను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది . ప్రక్కనే ఉన్న భూత్ బంగ్లాను చూసి తుర్రుమంటున్నారు అందరూ ………
ఇంట్రెస్టింగ్ గా ఉంది , ఇంత ఖరీదైన ఏరియా లో భూత్ బంగ్లా మిస్టరీలా మిగిలిపోయిందన్నమాట ………
వినయ్ : ఇదొక్కటే కాదు మహేష్ …….. , మన ఏరియా మరొక చివరన ఒక బిల్డింగ్ ఉంది . ఆ ఇంట్లో కొంతమంది మనుషులు చూస్తేనే చాలు భయపడేలా ఉంటారు , ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియదు ఒక్కొక్కసారి నెలలపాటు రారు – గమ్మత్తు ఏమిటంటే ఈ బిల్డింగ్ లో దెయ్యాలున్నాయని మొదట ప్రచారం చేసినది వాళ్లే , హోమం జరిపించి తాయెత్తులు కట్టించి లోపలికి ఒక్కరూ వెళ్లకుండా సీల్ చేసినదీ వాళ్లే ………
గోవర్ధన్ : వాళ్లకేమి భయం ఎప్పుడోకానీ రారు , మేము ఎదురుగా ఉంటాము , చీకటిపడితే చాలు భయం వచ్చేస్తుంది . ప్రక్కనే ఉన్న ఇంట్లోకి ఎవరైనా వస్తే మాకూ కాస్త దైర్యంగా ఉంటుంది .
వినయ్ : భూత్ బంగ్లా గురించి తెలిసి ఎవ్వరూ అంత సాహసం చెయ్యరు రా , పోనీ మీరే ఉండవచ్చుకదా ……..
గోవర్ధన్ : భయంతో కేకవేసి నా కుడిచేతిని గట్టిగా పట్టేసుకుని శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ……… అని వణుకుతున్నాడు .
ఫీల్డింగ్ చేస్తున్నవాళ్ళు కూడా ఆటకు బ్రేక్ ఇచ్చి నవ్వుతున్నారు .
గోవర్ధన్ : రేయ్ నవ్వండి నవ్వండి …….. రాత్రిళ్ళు భూత్ బంగ్లా సౌండ్స్ వింటే మీరూ ఇంతే ……..
మురళి : మేము దూరం రా ఉన్నది మాకు వినిపించవు – మేము సేఫ్ అని బాల్ వేసాడు .
ఆ భయంలో టాస్ బాల్ రాగానే పెద్ద గ్రౌండ్ లోలా షాట్ కొట్టాడు . అంతెత్తుకువెళ్లి భూత్ బంగ్లా మెయిన్ గేట్ తాకి కొద్దిగా సౌండ్ వచ్చింది అంతే బ్యాట్లన్నీ అక్కడే వదిలేసి క్షణాలలో అందరూ తుర్రుమన్నారు . చుట్టూ చూస్తే ఒక్కరూ లేరు .
దూరం నుండి మహేష్ మహేష్ అక్కడ ఉండకు వచ్చేయ్ వచ్చేయ్ అని కేకలు వినిపించడంతో నిజంగానే లోపల దెయ్యాలు ఉన్నాయా …… ? అని కాస్త భయంతోనే ( ఆ వయసులో భయం లేనిది ఎవరికి ) ఒకచేతితో బ్యాట్లు అన్నింటినీ పట్టుకుని అందరి దగ్గరికి చేరుకున్నాను .
థాంక్స్ మహేష్ థాంక్స్ మహేష్ …….. ఉదయం వరకూ అక్కడే ఉండిపోయేవి అని వారి వారి బ్యాట్స్ అందుకున్నారు . మురళి మాత్రం చిటికవేసి ఇంట్లో పెట్టిరమ్మని ఆర్డర్ వేసాడు .
వెళ్ళి సెక్యూరిటీని ఎక్కడ ఉంచాలో ఆడిగిమరీ అక్కడే పెట్టివచ్చాను .
మురళి : ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో క్రికెట్ ఎంజాయ్ చేయలేకపోయాము ఇండోర్ గేమ్స్ ఆడి స్విమ్ చేద్దాము పదండి అని ఒక ఆడిటోరియం లోకి వెళ్లారు . రమ్మని పిలవడంతో నేనూ లోపలికివెళ్ళాను . ఆటవస్తువులు చిన్న చిన్న గేమ్స్ స్విమ్మింగ్ పూల్ …… చూసి చాలా ఆనందం వేసింది . లోపల అప్పటికే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు . అందరూ ఎవరికినచ్చిన గేమ్ దగ్గరికివెళ్లి ఆడుకుంటున్నారు .
గోవర్ధన్ : భూత్ బంగ్లా వలన చెమటలు పట్టేసాయి అని బట్టలు విప్పి పూల్ లోకి జంప్ చేసాడు . అవునురా అంటూ ఐదారుగురు నీళ్ళల్లోకి చేరారు .
గోవర్ధన్ : మహేష్ ……. చూస్తుంటే నువ్వూ జంప్ చేసేలా ఉన్నారు . వారం వరకూ నీకావకాశం లేదు గుర్తుపెట్టుకో కావాలంటే వెళ్లి క్యారెమ్స్ – చెస్ ….. ఆడుకో ……
థాంక్స్ గోవర్ధన్ అని చిన్న పిల్లలదగ్గరికివెళ్లి నేర్చుకున్నాను . చీకటిపడేంతవరకూ అక్కడే సమయం గడిచిపోయింది .
ఇక ఇంటికి వెళదాము అని బయటకువచ్చాము . గోవర్ధన్ ఇంటి ప్రక్కనే ఆ ఏరియా కే హైలైట్ లా అన్నీ బిల్డింగ్స్ కంటే ఎత్తయిన బిల్డింగ్ చూసి సూపర్ గా ఉంది ఎవరిది గోవర్ధన్ అని అడిగాను .
గోవర్ధన్ : సూపర్ ఏమిటి మహేష్ లోపల ఆర్కిటెక్చర్ అత్యద్భుతమట డాడీ చెప్పారు సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉందట సూపర్ కదా . ఇక్కడ ఉన్నవాటికే హైలైట్ బిల్డింగ్ అని అందరూ అసూయ చెందుతున్నారు . రీసెంట్ గా పూర్తయింది – ఓనర్స్ అమెరికాలో ఉన్నారు రాగానే ఓపెనింగ్ , వాళ్లు ఎప్పుడు వస్తారో లోపలకు వెళ్లి ఎప్పుడు చూస్తామో అని ఆశతో బిల్డింగ్ వైపు చూస్తూనే ఇంట్లోకివెళ్లాడు . Wow …… నేనూ ఇంటికి చేరుకున్నాను .
రాత్రి 9 గంటలవరకూ మరియు పనిమనిషి అక్క ఔట్ హౌస్ లో భోజనం ఉంచాక తిని మళ్లీ సెక్యురిటీ దగ్గరే ఉన్నాను .
సెక్యూరిటీ : తమ్ముడూ ……. ఇది నీ డ్యూటీ కాదు వెళ్లి పడుకో అని చెప్పారు .
కష్టం అలవాటైపోయింది అన్నా అని బదులిచ్చి ఔట్ హౌస్ కు వెళ్లి బెడ్ పై పడుకోబోయి , అవ్వా పిల్లలు …… నెలపైనే పడుకోవడం గుర్తుకువచ్చి దుప్పటిని నెలపైనే పరిచి కిందనే పడుకున్నాను .
**********
సూర్యోదయం ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని రెడీ అయ్యి సెక్యూరిటీ దగ్గరకుచేరుకున్నాను .
కొద్దిసేపటికి గోవర్ధన్ – వినయ్ వాళ్ళు జాగింగ్ డ్రెస్ వేసుకుని వచ్చారు .
మహేష్ మహేష్ …….. ఈరోజు స్కూల్ ఉన్నా వెళ్లడం లేదు అందుకే పెద్ద గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళుతున్నాము రా ……..
మురళి సర్ ………
మురళి : ఎప్పుడు వచ్చాడో గుడ్ మహేష్ , నేనంటే ఈ మాత్రం భయం ఉండాలి పదా అని గ్రౌండ్ చేరుకున్నాము .
పేరెంట్స్ నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం పిలుపు వచ్చేన్తవరకూ ఆడుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు .
సెక్యురిటి : తింటూనే తమ్ముడూ …….. నీ టిఫిన్ ఔట్ హౌస్ లో ఉంచారు వెళ్లి తిను .
సరే అన్నా అని తినేసి స్కూల్ కు రెడీ అయ్యి బయటకువచ్చాను . అన్నా ……. మేడం గారిని బయటకు వెళ్ళడానికి అనుమతి కోరాలి ఎలా ? .
సెక్యూరిటీ : డైరెక్ట్ గా డోర్ దగ్గరికి వెళ్లకుండా నన్ను అడిగి మంచిపనిచేశావు తమ్ముడూ …… మనం వాళ్లకోసం ఎంత కష్టపడినా మనల్ని దూరంగానే ఉంచుతారు . ఒక్క నిమిషం తమ్ముడూ ……. అని సెక్యూరిటీ గదిలోకివెళ్లి బటన్ ప్రెస్ చేసి మైకులో మేడం గారూ …….. మహేష్ కు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు .
మేడం : ok మాట్లాడించు ……..
సెక్యూరిటీ : మహేష్ …….. మేడం గారితో ఇక్కడినుండే మాట్లాడు .
మేడం …….. అనుమతి ఇస్తే మీరు చెప్పినట్లుగా స్కూల్ కు వెళ్లి TC తీసుకునివస్తాను .
మేడం : సెక్యూరిటీ …….. మన డ్రైవర్ కు చెప్పు తన బైకులో తీసుకెళ్లమని …….
సెక్యురిటి : అలాగే మేడం ……..
పర్లేదు మేడం , అక్కడ సమయం పడుతుందేమో నేనొక్కడినే వెళ్లి TC తీసుకుని వచ్చేస్తాను .
మేడం : మేము కూడా ఫంక్షన్ కు వెళ్ళాలి డ్రైవర్ అవసరం ఉంటుంది . అయితే ఒంటరిగానే వెళ్లి వచ్చేయ్ మహేష్ …….. , వెళ్లే విషయం పైనున్న మురళికి కూడా కాల్ చేసి చెప్పు లేకపోతే కోప్పడతాడు .
అలాగే మేడం అని బదులిచ్చి మొబైల్లో మురళికి కాల్ చేసి విషయం చెప్పాను .
మురళి : గుడ్ , నువ్వు ఏమిచేసినా నాకు ఇలా చెప్పాలి లేకపోతే నా ఈగో హార్ట్ అయ్యి కోపం వచ్చేస్తుంది , త్వరగా వచ్చేయ్ …….
డబ్బును మరియు మొబైల్ ను జాగ్రత్తగా జేబులలో పెట్టుకుని చిన్న గ్రౌండ్ దగ్గర కలిసిన గోవర్ధన్ కు TC విషయం చెప్పి ఏరియా మెయిన్ గేట్ చేరుకున్నాను .
నన్నుచూసి సెక్యూరిటీ అన్నయ్యలు ఇద్దరు వచ్చి థాంక్స్ చెప్పారు . మహేష్ …… నువ్వుకానీ నిన్న పిల్లలను రక్షించకపోయి ఉంటే ఈపాటికి మా స్థానాలలో వేరేవాళ్ళు ఉండేవాళ్ళు – బయటకు వెళుతున్నావా అంటూ చిన్న గేట్ కాకుండా మెయిన్ గేట్ మొత్తం తెరిచారు .
నిన్న లోపలికి వదలకుండా అడ్డుపడినవాళ్లే ఈరోజు థాంక్స్ చెప్పిమరీ గేట్స్ తెరవడం చూసి చాలా ఆనందం వేసింది .
సెక్యురిటి : మహేష్ …….. ఈ బస్తీవాళ్ళు రిచ్ కిడ్స్ తోపాటు నీపైకూడా కోపంగా ఉన్నారని సమాచారం . జాగ్రత్త , పనిచూసుకుని తొందరగా వచ్చేయ్ ……..
పెదాలపై చిరునవ్వుతో బస్తీ దారి గుండానే సిటీవైపుకు నడిచాను . వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి చూస్తే బస్తీ జనాలు ఎవరిపనివాళ్ళు చేసుకుపోతున్నారు .
వీధి టర్న్ అయ్యి కొన్ని అడుగులువెయ్యగానే వెనకనుండి నన్ను కదలకుండా గట్టిగా పట్టేసుకున్నారు ముగ్గురు . భుజం పెయిన్ తట్టుకోలేక విలవిలలాడిపోయాను . రేయ్ ఎవర్రా …….
మేమేరా అంటూ మరొక ఇద్దరు పిల్లలు నాముందుకువచ్చారు . రేయ్ ……. నువ్వు నిన్న అడ్డుపడటం వలన మాఇంట్లో దెబ్బలతోపాటు వాతలుకూడా పెట్టారు చూడరా అని చూయించారు . ఈ దెబ్బలకు – వాతలకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ……..
వెనక పట్టుకున్న ఇద్దరు నా జేబుల్లోనుండి డబ్బు మరియు మొబైల్ తీసి , రేయ్ …….. మన డబ్బు దొరికేసింది – ఇక దెబ్బలు మాత్రమే తిరిగిచ్చేయ్యాలి అని ఎదురుగా ఉన్నవాళ్లకు ఇచ్చారు .
మన డబ్బుకంటే ఎక్కువే ఉంది – సగం డబ్బు ఇంట్లో ఇచ్చేసి మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేద్దాము – ఈ స్మార్ట్ ఫోన్ అమ్మినా కొంతడబ్బు వస్తుంది .
రేయ్ రేయ్ …….. నన్ను కావాలంటే ఎలా అయినా కట్టుకోండి , ఆ డబ్బు అనాధపిల్లలకోసం please please ఇచ్చెయ్యండి అని ప్రాధేయపడ్డాను .
ఒక్కసారి మా జేబుల్లోకి చేరిందంటే ……. ఇక మా సొంతం అంతే కుమ్మేయ్యండిరా వీణ్ణి , నెక్స్ట్ లోపల దాక్కున్న ఆ బలిసిన కొడుకులని ……… , ముందు భుజం పై నొక్కెయ్యండి ఆ పెయిన్ వలన మనమంటే ఏమిటో తెలియాలి వీడికి .
నా భుజం పై చేతిని వేసేంతలో బలం కొద్దీ ముగ్గురినీ విదిల్చి , మాట్లాడుతున్నవాడిని కాలితో తన్నాను .
బస్తీ మొత్తం వినిపించేంతలా నొప్పితో కేకవేసి నెలపైకి చేరాడు . Please please అన్నది నన్ను కొట్టకుండా ఉండటం కోసం కాదురా – మీపై ……. నా దెబ్బలు పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు అని – వినలేదు మీ ఐదుగురికి నా ఒక్క చెయ్యి చాలు – బస్తీలో పెరిగిన మీరే మాస్ అయితే slum లో పెరిగిన నేనెంత మాస్ మీ ఊహకే వదిలేస్తున్నాను . బుద్ధిగా నా డబ్బు మొబైల్ ఇచ్చేస్తే సర్ లేకపోతే మీరూ ఇలా తిన్నదంతా కక్కుకుని మట్టికరుస్తారు .
ఇంతచెప్పినా example చూయించినా నలుగురూ ఒకేసారి రెండువైపుల నుండీ నామీదకు వచ్చారు .
మీరుకూడా టేస్ట్ చెయ్యాలని ఆశపడుతుంటే ఇక నేనేమీ చెయ్యలేను అని సింగిల్ హ్యాండ్ తో ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క భాగంలో గుద్దులు గుద్ది నేలకొరిగేలా చేసాను . ఒక్కొక్కడి దగ్గరకు వెళుతుంటే భయంతో నొప్పికి అమ్మా అమ్మా అంటూ వెనక్కు జరుగుతున్నారు . బుద్ధిగా చెబితే వినలేదు slum దెబ్బ రుచిచూశాక …….. నెక్స్ట్ టైం మరింతమంది టీం మొత్తం వచ్చెయ్యండి కబడ్డీ ఆడుకుందాము , ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నా డబ్బు మొబైల్ ……..
నొప్పితో అల్లాడిపోతూనే జేబులోనుండి తీసి ఇచ్చి ప్రక్కకు జరిగారు .
గుడ్ ……. మళ్లీ నెక్స్ట్ ఫైటింగ్ లో కలుద్దాము , ఆ పాటికి మరొక చెయ్యికూడా రెడీ అయిపోయి ఉంటుంది ముందూ వెనుకా ఆలోచించకుండా కుమ్మేసుకోవచ్చు ,అప్పటివరకూ బై బై ప్చ్ ……. 15 నిమిషాలు వేస్ట్ అని ఫీల్ అవుతూ స్కూల్ చేరుకున్నాను .
60ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .