Tollywood NewsTrending NewsTulasi VanamTV Movie

అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు తాప్సీ

అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు తాప్సీ

అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు తాప్సీ

 అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు తాప్సీ
అప్పుడు ప్రియాంక.. ఇప్పుడు తాప్సీ
బాలీవుడ్‌లో కొన్ని క్యాంపులను ఉద్దేశించి గతంలో ప్రియాంక చోప్రా పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా తాప్సీ (taapsee) స్పందించారు. బాలీవుడ్‌లో క్యాంపులు కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం ఎప్పటి నుంచో నాకు తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌లో కొన్ని క్యాంపులను ఉద్దేశించి గతంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ‘సిటడెల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియాకు వచ్చిన ప్రియాంక.. బాలీవుడ్‌పై కీలక ఆరోపణలు చేశారు. బీటౌన్‌లో కొంతమంది తనని పక్కన పెట్టేశారని, అవకాశాలు రాకుండ చేశారని అందుకే హాలీవుడ్‌కు వెళ్లిపోయానని చెప్పారు ప్రియాంక. ఇదే విషయంపై తాజాగా తాప్సీ (taapsee) స్పందించారు. బాలీవుడ్‌లో క్యాంపులు కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం ఎప్పటి నుంచో నాకు తెలుసు అని కీలక వ్యాఖ్యలు చేశారు. (Taapsee Comments on Btown

‘బాలీవుడ్‌లో క్యాంపులు(Btown camps), క్వాటరీలు, ఫేవరెటిజం ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే! నటీనటుల స్నేహితులు, లేదా వారి ఏజెన్సీలు తమ చిత్రాల్లోకి ఎవరిని తీసుకోవాలనుకుంటే వాళ్లనే తీసుకుంటారు. అది వాళ్ల కెరీర్‌కు సంబంధించిన విషయం కాబట్టి వాళ్లను తప్పుపట్టడానికి లేదు. ఈ పరిశ్రమలోకి వచ్చే ముందే ఇక్కడ పక్షపాత ధోరణి ఉంటుందని నాకు తెలుసు. ఈ ఆటలో మీకు అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటే అది మీ సొంత నిర్ణయం. తర్వాత, మీరు ఎవరినీ విమర్శించలేరు. విమర్శించిన ఉపయోగం లేదు. అది మీ కెరీర్‌కి నష్టమే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా పక్షపాత ధోరణి ఉంది కాబట్టి’’ అని తాప్సీ అన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 5 బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి.

Responsive Image Grid

 

 

 

Responsive Image Grid

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker