Trending News

నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్‌ ఒక్కడే మగాడు.. ఆర్జీవీ కామెంట్లు..!

Ram Gopal Varma : ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలోని ఎన్టీఆర్‌ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శతజయంతి సభను నిర్వహించారు.

ఈ సభకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి, కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సభలో ఆర్జీవీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అనేది ఆనాడు సీనియర్ ఎన్టీఆర్‌ చెప్పేశారు. ఆయన లక్ష్మీ పార్వతి మాయలో పడ్డాడని ప్రచారం చేశారు.

కానీ అందులో నిజం లేదు. ఒక సీఎంగా పని చేసిన వ్యక్తికి ఆ మాత్రం అవగాహన ఉండదా.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదా అంటూ వ్యాఖ్యానించారు ఆర్జీవీ. నందమూరి ఫ్యామిలీలో కేవలం జూనియర్ ఎన్టీఆర్‌ ఒక్కడే మగాడు. అందుకే చంద్రబాబు నిర్వహిస్తున్న వేడుకలకు దూరంగా ఉన్నాడు.

తన తాత మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఆయన ఒక విధానానికి కట్టుబడి ఉన్నాడు. మిగతా వారంతా అలా లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ. ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి, జూనియర్ ఎన్టీఆర్‌ కు గ్యాప్ ఉంది. ఇలాంటి కామెంట్లు ఇంకా గ్యాప్ పెంచుతాయని అంటున్నారు నెటిజన్లు.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button