Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
మాట్లాడుతూ అర గంటలో ఇంటికి చేరుకోగా కృష్ణవేణిని చూడగానే మహి సంతోషంగా వచ్చి కౌగిలించుకొని అత్తయ్యా ఎవరొచ్చారో చూడు అని లోపలికి పిలుచుకొనివెల్లగా , రాము చిన్నా ఆడుకుంటూ అన్నయ్యా , మావయ్యా అంటూ కృష్ణ నాదగ్గరికి రాగా రాము ఇక్కడేమైనా బోర్ కొడుతోందా అని అడుగగా లేదు అన్నయ్యా చిన్నా మరియు అందరూ ఉన్నారుగా అమ్మా వాళ్ళు గంటకొకసారి రకరకాల స్నాక్స్ ఇస్తుండగా తింటూ ఆడుకుంటున్నాము అని బదులివ్వగా , అయితే soooo happy అంటూ కంపౌండ్ లోపల కుర్చీలువేసుకొని చంద్రతో పాటు ముగ్గురమూ కూర్చోగా వర్షి మరియు కీర్తి వచ్చి మావయ్యా తాగడానికి నీళ్లు అంటూ అందివ్వగా తాగుతానడగానే స్నాక్స్ మరియు పాయసం తీసుకురాగా ఆవెంటనే టీ బిస్కెట్స్ తీసుకురాగా బావ ఇక చాలు కడుపు నిండిపోయింది ఇక నావల్ల కాదు అని కడుపు చూపిస్తూ దీనంగా చెప్పగా ,
ఇదేమి చూశావు బావ ఈరోజు డిన్నర్ చెసి గాని పంపేది లేదు అంటూ నవ్వుతూ చెప్పగా , మహి మరియు కృష్ణవేణి కంపౌండ్ లో ఉన్న పూలమొక్కలను సంతోషంగా వీక్షిస్తుండగా కృష్ణగాడు మామాటలను పట్టించుకోకుండా ప్రేమగా అటువైపే చెల్లెమ్మనే చూస్తుండగా లేచి భుజం మీద తట్టి కంట్రోల్ రా మీబావతో మాట్లాడుతూ ఉండు ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి లోపల అమ్మావాళ్ళ దగ్గరికి వెళ్ళాను.
లోపల ఎక్కడా కనపడక మేడ మీద నుండి మాటలు వినిపిస్తుండగా పైకి వెళ్లగా ఆరవేసిన బట్టలను అమ్మలిద్దరూ , అత్తయ్య మరియు వాసంతి తీస్తూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుండగా నాప్రాణసమానమైన అందరూ ఇక్కడే మాంచి మూడ్ లో ఉన్నారు స్వాతి గురించి ఇప్పుడే చెప్పేయ్యాలి అంటూ అమ్మా , అత్తయ్యా అంటూ దగ్గరకు వెళ్లి ఎలా recieve చేసుకుంటారో అనే కాస్త భయంతో అమ్మా , అత్తయ్యా మీదగ్గర ఒక ముఖ్యమైన విషయం దాచాను నన్ను క్షమించండి అంటూ మోకాళ్లపై కూర్చోగా , కన్నయ్యా , బేబీ , బుజ్జి , మహేష్ అంటూ నాదగ్గరికి వచ్చి లేపి తలపై మరియు బుగ్గలపై ప్రేమగా స్పృశిస్తూ స్వాతి విషయమే కదా అనగానే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్లుగా ఆశ్చర్యన్గా అమ్మల వైపు చూస్తుండగా ,
అమ్మ నా నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి మహి మధ్యాహ్నమే మాకు అంతా చెప్పింది
నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో మహితో ఎంత ప్రేమగా మాట్లాడుతోందో మీ ఇద్దరి విషయం తెలిసి మీ ఇద్దరి కోసం స్వాతి తన ప్రేమను కూడా త్యాగం చెయ్యడానికి అయినా సిద్ధపడింది అంటే తానేంటో మాకు పూర్తిగా అర్థమైంది , స్వాతిని ఇక్కడకు తీసుకురావడం మాకు ఇష్టమే అంటూ ఇందుఅమ్మ చెప్పగా , అమ్మలిద్దరినీ సంతోషంతో అమాంతం కౌగిలించుకొని లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అంటూ అత్తయ్య వైపు చూసి అత్తయ్యా నువ్వు చెప్పు ఇప్పుడు అమ్మలిద్దరి నిర్ణయం కంటే మీ నిర్ణయమే నాకు సంతోషాన్ని ఇచ్చేది మీరు ఎలా అంటే అలా నేను తప్పకుండా పాటిస్తాను అని తలవంచుకొని అడుగగా ,
తప్పు చేసిన వాళ్ళు తలవంచుకోవాలి నా బంగారం లాంటి బుజ్జి కాదు నా …