Oka Koduku Prayanam

Oka Koduku Prayanam – 304

అమ్మావాళ్ళంతా రెడీ అయ్యి బయటకువచ్చారు .  గణేష్ రమేష్ లు ఆశ్చర్యంతో చూస్తుంటే , మీ ఇంటికే బస్ తియ్యి అంటూ కృష్ణగాడు విషయం చెప్పడంతో , సర్ మేము కూడా ఎలా పిలవాలి అని అప్పటినుండి వేచిచూస్తున్నాము , అమ్మావాళ్ళు కాల్ చేసేసారన్నమాట ……లవ్ యు మహేష్ సర్ అంటూ ఉత్సాహంతో బస్ సిటీ వైపు తిప్పాడు .  కార్లలో సగం మంది , బస్ లలో సగంమంది ఎక్కి ఇంటికి చేరుకున్నారు . అమ్మావాళ్ళు , అక్కాచెల్లెళ్ళు బయటకు పరుగునవెళ్లి అందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానించారు . Wow ఘుమఘుమలు………వంటలు అధిరిపోతున్నట్లున్నాయి , మనం కూడా సహాయం చేద్దాము అని అందరూ మాట్లాడుకుంటుంటే మెహ్రీన్ మహి , స్వాతి …….. వద్దు వంట గదిలోకి వెళితే కాళ్ళు నరికేస్తారు అంటూ జరిగింది మొత్తం వివరించాను. సంతోషంతో నవ్వుకుని అమ్మా నిజమేనా ………అందుకే తల్లులూ మేము లోపలకు అడుగుపెట్టకుండా మహేష్ తో ఇక్కడే కూర్చున్నాము అంటూ అందరూ వచ్చినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు . ఇల్లుమొత్తం చిరునవ్వులు సరదా మాటలతో పైకి కిందకు వస్తూ పోతూ ఎంజాయ్ చేస్తున్నారు . కృష్ణ , కృష్ణవేణి వెళ్లి పిల్లలను కూడా పిలుచుకొనివచ్చారు . అన్నయ్యా …….అంటూ కవిత పరుగునవచ్చి హత్తుకొని ఎప్పుడు వచ్చారు , ప్రయాణం ఎలా జరిగింది , మూడు రోజులు మిమ్మల్నిచాలా మిస్ అయ్యాము అంటూ సంతోషంతో మాట్లాడుతూనే ఉంది .  లవ్ యు బంగారు అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ప్రక్కనే కూర్చోబెట్టుకొని మీ అమ్మలు నీకోసం రాత్రిళ్ళు ఇంకా పొట్లాడుతూనే ఉన్నారా …….,  Related Articles Oka Koduku Prayanam – 325 22 hours ago Oka Koduku Prayanam – 326 22 hours ago Oka Koduku Prayanam – 327 22 hours ago Oka Koduku Prayanam – 324 2 days ago అవునన్నయ్యా ……….మొన్నటితో ఒక్కొక్క పూత పూర్తవ్వడంతో ,మళ్లీ మొదటి నుండి అంటూ నేను నేను నేను ఫస్ట్ అంటూ నిద్రపోయేసరికి 11 గంటలు అయ్యింది, చివరికి నాకు అత్యంత ఇష్టమైన అంటూ చెవిలో చెప్పి ఇందు అమ్మ గుండెలపై హాయిగా నిద్రపోయాను . అమ్మో చెవిలో చెప్పి మంచిపని చేసావు లేకపోతే ఇక్కడ చిన్నపాటి గొడవ జరిగి ఉండేది అంటూ ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుంటూ ……….చుట్టూ చూసి , అన్నయ్యా ……….డాక్టర్ అమ్మ కదూ అంటూ లేచి అమ్మ దగ్గరకువెళ్లి అమ్మా అంటూ పాదాలకు నమస్కరించింది . డాక్టర్ అమ్మ ఆశ్చర్యపోతుంటే అమ్మ మొత్తం వివరించింది .  అంటే పెళ్లిలో చూసిన …

💬 కొత్త కథలు ,ఎపిసోడ్ అప్డేట్స్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటె టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
📲 ఇప్పుడే మా Telegram ఛానల్‌లో చేరండి!

📢 కొత్త కథలు వెంటనే Telegramలో!
👉 మా Telegram ఛానల్‌లో చేరండి 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
📲 మా Telegram ఛానల్‌లో చేరండి
Join Telegram Join our Telegram Channel

Adblock Detected

please remove ad blocker