MEDIUM LENGTH STORIESNaa Autograph Sweet Memories
Naa Autograph Sweet Memories – 3 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories - 3 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 3 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
అలా ఐదు నిముషాలు రాము వాళ్ళను అలాగే పట్టుకుని ఒక్కొక్కళ్ళ మొహం మీద ముద్దులు పెట్టుకుంటున్నాడు.
అలా ముద్దు పెట్టుకుంటూ విశ్వ, రఘు, సంజన వైపు చూసి వైపు చూసి, “మీ చిన్నప్పటి సరదాలు ఏమీ తీరకుండానే నేను అనుకోకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది…..కాని….” అంటూ తన మనవళ్ళ వైపు తిరిగి వాళ్ళ బుగ్గల్ని నిమురుతూ, “కనీసం మనవళ్ళ ఆట పాటలైనా చూస్తాననుకున్నా…..అది కూడా జరిగలేదు….నా జీవితంలో ఇంత పెనుమార్పులు జరుగుతాయని నేను అసలు ఊహించలేదు,” అన్నాడు.
దానికి శివరాం రాముని చేతిని పట్టుకుని, “అలా అనకండి తాతయ్యా….మీరు నాన్న వాళ్ళ ముచ్చట్లు, మా చిన్నప్పుడు ఆటలు చూడకపోతేనేం….ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే…..నాకు అన్నయ్య లాగా ఉన్నారు….కాబట్టి మీరు తీర్చుకోలేని సరదాలను మాకు పెళ్ళిళ్ళు అయిన తరువాత వాళ్ళ పిల్లలతో తీర్చుకోండి,” అన్నాడు.
ఆ మాట విని విశ్వ కూడా, “అవును నాన్నా…..మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు నేను మీకు కొడుకంటే ఎవరూ నమ్మరు…..మీరే నాకు కొడుకులా ఉన్నారు….ఏం బాధపడకండి….మీరు మీ జీవితంలో మాద్వారా పోగొట్టుకున్న ఆనందాలను మీ మనవళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోండి,” అన్నాడు.
రాము తన మనవడు శివరాం వైపు చూసి, “ఏరా….27 ఏళ్ళ వయసులోనే నన్ను తాతను చేసారు….ఇక ముత్తాతను కూడా చేస్తారా,” అంటూ నవ్వాడు.
“మరి అంతే కదా తాతయ్యా…..” అంటూ శివరాం రాముని గట్టిగా కౌగిలించుకుని, “మీకు తెలియదు…..నానమ్మ మిమ్మల్ని మరిచిపోని రోజు అంటూ లేదు….మీలా ఉన్న నన్ను చూసి రోజూ మాట్లాడందే నిద్ర కూడా పోదు….నేను బిజినెస్ పని మీద ఊరు వెళ్ళినా సరె….వీడియో కాలింగ్ చేసి నాతో మాట్లాడి కాని నిద్ర పోదు….ప్రతి రోజు మీరు నానమ్మని మీ ప్రాణాలకు తెగించి ఎలా కాపాడారో చెబుతూ….మీరు లేకపోతే తాను లేనని చెబుతుండేది….నిజంగా మీరు గ్రేట్ తాతయ్యా…..” అన్నాడు.
రాము కూడా శివరాంని కౌగింలించుకుని, “అదేం లేదురా….మీ నానమ్మ బాధ చూసి తట్టుకోలేక విపరీతంగా బాధపడుతున్న నేను ఒక బాబా హెల్ప్ తో రేణుకని కాపాడాను…..” అన్నాడు.
“నాకు తెలుసు నాన్నా…..ప్రతి సంవత్సరం అమ్మను కాపాడటానికి హెల్ప్ చేసిన ఆ సూఫీ బాబాని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడ నుండి మీరు షాపూర్ దగ్గర డెవలప్ చేసిన గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తాము…..మీరు లేకపోతే మేము లేము నాన్నా,” అంటూ విశ్వ రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద అనునయంగా తట్టాడు.
అందరూ అంత ఎమోషనల్ గా ఉండేసరికి అక్కడ ఉన్న అందరికీ సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి.
కరుణ వెంటనే తన కన్నీళ్ళను తుడుచుకుని, “మామయ్యగారు…..” అని పిలిచింది.
రాము తన కౌగిలిలో ఉన్న శివరాంని వదిలి కరుణ వైపు చూసి, “ఏంటమ్మా…..” అన్నాడు.
“మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు ఉన్న అలవాటు ఒకటి మర్చిపోయాను,” అన్నది కరుణ.
అంత వయసొచ్చినా కరుణ అలా అల్లరిగా మాట్లాడుతుండే సరికి రాము చిన్నగా నవ్వుతూ, “ఏంటమ్మా అది…తొందరగా చెప్పు,” అన్నాడు.
రాము అలా అంటున్నప్పుడు వినయ్, హర్ష రాము దగ్గరకు వచ్చి అతన్ని తాకుతూ, “నిజంగా మేము నమ్మలేకపోతున్నాం తాతయ్యా….మాకు మాతో సమానంగా వయసు ఉన్న తాత ఉన్నాడంటే అసలు నమ్మబుధ్ధి కావడం లేదు….ఎంత సంతోషంగా ఉన్నదో మీకు తెలియదు….నిజంగా…..నిజంగా నానమ్మ మీ గురించి చెబుతుంటే ఏదో కట్టుకధ చెబుతుంది అని అనుకుని ఆమె సంతోషం కోసం శ్రధ్ధగా వినేవాళ్ళం….కాని ఇప్పుడూ మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉన్నది,” అంటూ ఇద్దరూ రాముని గట్టిగా వాటేసుకున్నారు.
శివరాం కూడా వాళ్ళతో కలిసి రాముని వాటేసుకునే సరికి అందరు కలిసి అక్కడ ఉన్న సోఫాలో పడ్డారు.
దాంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు…..వెంటనే శివరామ్, వినయ్, హర్ష రాము మీద నుండి లేచారు.
రాము అలా నవ్వడం చూసి రేణుక వాళ్ళ వైపు కొంచెం కోపంగా చూస్తూ, “ఏంటిరా….ఆయన్ని కుదురుగా ఉండనివ్వరా….” అంటూ కంగారుగా రాము వైపు తిరిగి, “మీకు ఏంకాలేదుగా,” అన్నది.
రేణుక అలా అనడం చూసి కరుణ తన అత్తగారి వైపు చూసి నవ్వుతూ, “చాలా ఏళ్ళ తరువాత మామయ్యగారు తిరిగి వచ్చేసరికి ప్రేమ ఎక్కువైంది,” అని రాము వైపు తిరిగి, “మామయ్య గారు…ఇక పదండి…భోజనం చేద్దాం….ఇప్పటికే చాలా లేటయింది…మీరు వచ్చిన ఆనందంలో అసలు టైం తెలియలేదు,” అన్నది.
దాంతో అందరూ కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్ళారు…..అందరు నవ్వుతూ జోకులు వేసుకుంటూ విశ్వ, రఘులు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు చేసిన అల్లరిని రాముకి చెబుతూ భోజనం చేసారు.
భోజనం అయిపోయిన తరువాత రేణుక తన కొడుకు విశ్వ వైపు చూసి, “విశ్వా…..నాన్నగారికి గెస్ట్ రూమ్ చూపించు….” అన్నది.
“కాని అమ్మా….చాలా ఏళ్ళ తరువాత నాన్న కలిసాడు…..మీ బెడ్ రూమ్ లో పడుకోనివ్వండి,” అన్నాడు విశ్వ.
“లేదురా….ఇప్పుడు నా బెడ్ రూమ్ ఇద్దరికీ సరిగ్గా ఉండదు…..ఆయనకు గెస్ట్ రూమ్ చూపెట్టు,” అన్నది రేణుక.
రాము రేణుక వైపు చూసి నవ్వుతూ, “నా బట్టలు మొత్తం హోటల్ రూమ్ లో ఉన్నాయి రేణు,” అన్నాడు.
ఆ మాట వినగానే శివరామ్ రాము వైపు చూసి, “నేను మన వాళ్ళకు పంపించి మీ బట్టలు మొత్తం తెప్పిస్తాను….అయినా మీరు ఇక్కడికి వచ్చిన తరువాత మీ బట్టలు గురించి ఆలోచించాల్సిన పని లేదు…..మీరు ఎలాగూ నాలాగే ఉన్నారు కదా….రేపు ఒక్క రోజు నావి కొన్ని వాడనివి కొత్త బట్టలు ఉన్నాయి….అవి వేసుకోండి….సాయంత్రానికి మీకు కొత్త సూట్లు, కావలసినవి అన్నీ మీ గదిలో ఉంటాయి,” అని అక్కడ ఉన్న తన విల్లా మేనేజర్ ని పిలిపించి రాము దిగిన హోటల్ పేరు, సూట్ నెంబర్ చెప్పి రేప్పొద్దున్నే అక్కడ ఉన్న బట్టలు మొత్తం తీసుకురమ్మని చెప్పాడు.
విశ్వ రాముని గెస్ట్ రూమ్ వైపు తీసుకెళ్ళబోతుండగా శివరామ్ వాళ్ళను ఆపుతూ, “పెదనాన్నా….ఇవ్వాళ తాతయ్య మాతో పాటు మా రూమ్ లో పడుకుంటారు…..” అన్నాడు.
రాము వెనక్కు తిరిగి శివరామ్ వైపు చూసి, “మీకెందుకురా శ్రమ…..బెడ్ సరిపోదు,” అన్నాడు.
“ఇప్పుడు మీరు బాగా అలసిపోయారా,” అనడిగాడు శివరామ్.
“లేదు…..మధ్యాహ్నం బాగా నిద్ర పోయాను…..మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో ఇవ్వాళ నాకు నిద్ర కూడా రాదు,” అన్నాడు రాము.
“మా పరిస్థితి కూడా అంతే తాతయ్యా…..ఇవ్వాళ మీతో చాలా మాట్లాడాలి….అందుకని ఇవ్వాళ మీరు మాతో మా రూమ్ లో ఉండాల్సిందే,” అంటూ శివరాం తన తమ్ముళ్ళైన వినయ్, హర్ష వైపు చూసి, “ఏంటిరా…..మాట్లాడరేంటి,” అనడిగాడు.
దాంతో వాళ్ళిద్దరు కూడా, “అవును….ఇవ్వాళ మీరు మాతో ఉండాల్సిందే…..” అన్నారు.
దాంతో విశ్వ, రఘు కూడా, “అవును నాన్నా….మాక్కూడా ఇవ్వాళ మీతో ఉండాలని ఉన్నది….అందుకని ఇవ్వాళ అందరం ఒకే చోట ఆనందంగా ఎంజాయ్ చేద్దాం,” అన్నాడు.
“ఇక నేను ఎక్కడకు వెళ్తారా….నేను వస్తూనే ఉంటా కదా,” అన్నాడు రాము.
“ఏంటి….ఎక్కడకు వెళ్ళేది….ఇక మిమ్మల్ని ఎక్కడకు పోనివ్వము…..ఇన్నేళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళింది చాలు….ఇక మీదట మీరు మాతోనే ఉండాలి,” అన్నాడు శివరామ్.
“అరేయ్ శివా…..నాక్కూడా అమ్మా నాన్న ఉన్నారురా…వాళ్ళను కూడా చూసుకోవాలి కదా,” అన్నాడు రాము.
“అయితే వాళ్ళను ఇక్కడికే మన వాళ్ళను పంపి….కాదు…..వినయ్, హర్ష ఇద్దరూ వెళ్ళి దగ్గర ఉండి మీ అమ్మా, నాన్నని తీసుకొస్తారు. ఇక అందరం ఇక్కడే ఉందాము,” అన్నాడు శివరామ్.
“మీకెందుకురా శ్రమ,” అన్నాడు రాము.
దానికి విశ్వ ముందుకు వచ్చి, “అదేంటి నాన్నా అలా అంటారు…..వాళ్ళు మాకు తాతయ్య, నాయనమ్మలు అవుతారు….అంటే మీరు మమ్మల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నారా,” అన్నాడు.
“అదేం లేదురా…..అలా అనుకుని ఉంటే నేను ఇంత దూరం ఎలా వస్తాను…..మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాటంగా వచ్చానో తెలుసా,” అన్నాడు రాము.
“అయితే ఇంకేం మాట్లాడకండి తాతయ్యా…..నేను ఇక ఏం వినను…..తాతమ్మ వాళ్ళను రేపు పొద్దున్న నా తమ్ముళ్ళు వెళ్ళి దగ్గరుండి ఇక్కడకు తీసుకొస్తారు,” అని అన్నాడు శివరామ్.
రాము కూడా సరె అని అనడంతో శివరాం పని వాళ్ళను పిలిచి అందరికీ హాల్లో బెడ్స్ తీసుకొచ్చి వేయమని రాము వైపు తిరిగి, “తాతయ్యా…మీకు మందు అలవాటు ఉన్నదా,” అనడిగాడు.
“ఇప్పుడు అవన్నీ వద్దులేరా….హాయిగా ఎంజాయ్ చేద్దాం,” అన్నాడు రాము.
“అదేం కుదరదు….ఇవ్వాళ మా జీవితాల్లో మరిచిపోలేని రోజు…..మా నాన్న, పెదనాన్నని మీరు ఏ వయసులో అయితే వదిలి వెళ్ళాల్సి వచ్చిందో….మళ్ళీ మా దగ్గరకు అదే వయసులో మనవళ్ళతో పోటీ పడటానికి వస్తే ఆనందాన్ని తట్టుకోవడం మావల్ల కాదు….ఇవ్వాళ ఎవరు ఏమన్నా సరె….మగాళ్ళం అందరం మినిమం ఒక పెగ్ వేయాల్సిందే,” అని శివరామ్ ఒకతన్ని పిలిచి తన బార్ రూమ్ లో ఉన్న మందుని తీసుకురమ్మన్నాడు.
“అది కాదురా…..నేను తాగనని మీ నానమ్మకి మాట ఇచ్చాను…..” అన్నాడు రాము.
“నానమ్మా….ఈ ఒక్క రోజు తాతయ్య ఒక్క పెగ్…..ఒకే ఒక్క పెగ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వు,” అంటూ హర్ష రేణుక గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు.
దాంతో రేణుక ఇక తప్పదన్నట్టు రాము వైపు చూసి, “ఒక్క పెగ్గు తీసుకోండి….ఇంకా ఎక్కువ వద్దు,” అన్నది.
రేణుక రాముకి పర్మిషన్ ఇవ్వడంతో అందరూ ఆనందంగా నవ్వుతూ, ఆనందంలో కేరింతలు కొడుతున్నారు.
ఇంతలో పనివాళ్ళు అక్కడే అందరికి బెడ్స్ అరేంజ్ చేసారు….ఇంకో ఇద్దరు వచ్చి ఖరీదైనా స్కాచ్ బాటిల్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అందరికీ కావలసిన గ్లాసులు, మందులోకి టచింగ్స్, ఆడవాళ్ళకు వైన్ తెచ్చి మొత్తం నీట్ గా సర్దేసి వెళ్ళిపోయారు.
ఇక అందరూ రాముకి వాళ్ళ చిన్నప్పటి సంగతులు, వాళ్ళు ఎలా అల్లరి చేసింది….ఒక్కొక్కళ్ళూ పోటి పడి చెబుతున్నారు.
వాళ్ళందరూ అలా చెబుతుంటే రాము కూడా ఆనందంగా వింటూ ఉన్నాడు…..అప్పుడు హర్ష వెళ్ళి ఇంట్లో ఫంక్షన్స్ జరిగిన CD లను పెట్టేసరికి రాము వాటిని చూస్తూ ఉన్నాడు.
రాము CD లు చూస్తుంటే రేణుక అతని పక్కనే కూర్చుని ఫంక్షన్ లో ముఖ్యమైన వాళ్ళ గురించి చెబుతూ ఉన్నది.
అంతలో శివరామ్ అందరికీ గ్లాసుల్లో స్కాచ్ పోస్తుంటే అతని తమ్ముళ్ళు హర్ష, ఓమ్ సర్వ్ చేసారు….ఆడవాళ్ళకు వైన్ పోసి ఇచ్చారు.
దాంతో అందరూ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ టీవీలో వస్తున్న ఫంక్షన్ CD లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
తరువాత కొద్దిసేపటికి రేణుక అక్కడే బెడ్ మీద పడుకుని నిద్ర పోయింది.
హర్ష టీవీ ఆఫ్ చేసి రాము దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
రాము తన చేతిని హర్ష తల మీద వేసి నిమురుతూ ఏంటి అన్నట్టు చూసాడు.
https://s.magsrv.com/splash.php?idzone=5160226