Maaya

Maaya – 13 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya - 13 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya – 13 | మాయ | telugu dengudu kathalu jabardast

mkole123

Maaya | మాయ | telugu dengudu kathalu jabardast
Maaya | మాయ | telugu dengudu kathalu jabardast

 

ఇంకొక నెలరోజుల్లో సంక్రాంతి పండగ వుందనగా ప్రెసిడెంటు గారు కిరీటిని, ఆచారిని ఓ రోజు సాయంత్రం తనదగ్గరికి పిలిపించుకున్నారు. ‘ఆచారీ, మీవోడికి ఇగ్రహం ఇసయం సెప్పాల. ఇంక ఆగే టైము లేదు నా కాడ’ అన్నారు. కిరీటి హృదయవేగం పెరిగింది ఈ మాట విని. తనకి వస్తున్న కలలకూ, పెదబాబు చెప్పాలనుకుంటున్న విషయానికి ఏమన్నా సంబంధం వుందా అని వింటున్నాడు.

ఆచారి తలపంకించి ‘కిరీటీ, ఈ మధ్య ఊళ్ళో కొంతమంది పెదబాబుని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నార్రా. పైకి కనిపించట్లేదు కానీ ఆ ఇబ్బందులన్నీ తిరిగి తిరిగి పంచలోహ విగ్రహం దగ్గరకొచ్చి ఆగుతున్నాయి. పొలం సరిహద్దు తగాదాల్లో కోర్టుకి రమ్మని సమన్లు వచ్చాయి పెదబాబుకి. ఏ తారీకున వెళ్లాలో తెలుసా? జనవరి 11 వ తేదీన. ఎంత హడావిడిగా తిరుగు ప్రయాణం కట్టినా సంక్రాంతి రోజుకి ఊరు చేరలేడు పెదబాబు. ఆ రోజున తను ఊళ్ళో ఉండకుండా చెయ్యడానికి ఎవరో ఎత్తిన ఎత్తు ఇది, అర్ధమైందా’ అన్నారు.

పెదబాబు చేతి వేళ్ళు పెనవేసి వాటిపై గడ్డం ఆనించి ఆచారి చెప్పేది వింటూ తలూపుతున్నారు. ‘ఇదొక్కటే కాదెసే, కొత్త కొత్త వాదాలు మొదలెడతన్నారు ఊల్లో కొంతమంది పిల్లకాకులు. ఇగ్రహం గుళ్ళో పర్మనెంటుగా ఎట్టాలని, ఇంకా శానా మాటలు మొదలెట్టారులే’ అంటుంటే ఆయన కళ్ళల్లో కోపం క్లియర్ గా తెలుస్తోంది కిరీటికి. ‘ఈ సారి ఇగ్రహం ఊల్లోకి తీసుకెళ్ళేది లే. ఇంటోనే పూజ జరిపిస్తాండా. నువ్వు పండగ రోజొచ్చి ఇగ్రహాన్ని సంబాళించి మర్నాడు దాన్ని మళ్ళీ బోషాణంలో ఎట్టాల సరేనా’ అన్నారు.

అప్పటికి సరేనని తలూపడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు కిరీటి. తన తండ్రి ప్రెసిడెంటు గారి కూడా వెళ్తున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. మామూలుగా ఈ కోర్టు వ్యవహారాల్లో తలదూర్చడు ఆచారి. కిరీటికి తెలియని విషయమేమిటంటే శైలుకి తగ్గ వరుడొకరిని చూసి రావడం కూడా ఈ ప్రయాణంలో ఒక భాగమని. ఆచారి మాటకి విలువనిచ్చే పెద్దాయన వరుడి కుటుంబం గురించి ఆరా తీయడానికి ఆయన్ని తనకూడా తీసుకెళ్తున్నారు.

వీళ్ళందరికీ తెలియని విషయమేమిటంటే ప్రెసిడెంటు గారిపైన జరుగుతున్న ఈ ముప్పేట దాడి వెనకున్నది మరెవరో కాదు, మన favorite వినయ్ కాతియా. ఊళ్ళోకి స్వంతగా దిగి పని నడిపిస్తే కొత్త ముఖాన్ని చూసి ఊరి జనాలు అనుమానిస్తారు కాబట్టి డబ్బుతో ఊళ్ళో కొంతమందిని కొనేశాడు వినయ్. వాళ్ళతో ముందు విగ్రహం గురించి సన్నాయి నొక్కులు నొక్కించాడు. అంత విలువైన, మహిమ గల విగ్రహం ప్రెసిడెంటు గారింట్లో ఎందుకుండాలి, అది ఊరిలో అందరికీ కనబడేలా గుళ్ళో పెట్టించాలి అని వాదన బయల్దేరదీశాడు. ఎన్నడూ పోటీ ఎరుగని పెదబాబు మీద ఈ సారి పంచాయితీ ప్రెసిడెంటుగా యువకులకి అవకాశం ఇమ్మని అక్కడా ఇక్కడా మాటలు మొదలయ్యేలా చూశాడు. నిజంగా ఏదో జరిగిపోతుందని కాదు, పెద్దాయన్ని వీలైనంత చికాకు పెట్టాలని. ఈ ఎత్తు నిజంగానే కొంతవరకూ పనిచేసింది. అతడి ఆఖరి అస్త్రం తనకున్న పలుకుబడి అంతా ఉపయోగించి కోర్టు డేట్ తనకు కావాల్సినట్టుగా మార్చడం. ఆయన ఊళ్ళో లేనప్పుడు విగ్రహం దొంగతనానికి మరో గట్టి ప్రయత్నం చెయ్యడం వినయ్ ఉద్దేశ్యం. ఇదంతా కూడా అతడి ప్లాన్ లో మొదటి భాగం.

ఇలాంటి ఢక్కామొక్కీలు చాలానే తిన్న పెదబాబు గారు జరుగుతున్న విషయాలన్నిటి వెనకున్న మర్మాన్ని గ్రహించారు. ఊరిలో అవాకులు చెవాకులు పేలుతున్న వారిపై తనవారి ద్వారా ఓ కన్నేసి వుంచారు. సంక్రాంతి దగ్గరకొచ్చేసరికి తన ఇంటిని మళ్ళీ ఓ కోటలా తయారుచేసి ఊరొదిలి వెళ్లారు.

ఆ సమయానికి ఊరిలో తెలియని ఒక ఉద్రిక్తత అంతర్లీనంగా ప్రబలుతోంది. పెదబాబుకి తోడున్న వర్గం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇబ్బంది కలగకుండా పండగ జరిగిపోవాలని పట్టుదలతో ఉన్నారు. ఆయనకి ఇంత బలం వుంటుందని వినయ్ అంచనా వెయ్యలేకపోయాడు. కానీ డబ్బు అందించే ధైర్యాన్నీ, మత్తునీ పెదబాబు కూడా తక్కువ అంచనా వేశారు.

సంక్రాంతి రోజున పెద్ద గుంపొకటి ప్రెసిడెంటు గారి ఇంటిముందు తయారయింది. విగ్రహాన్ని ఆ సంవత్సరం ఊరేగించట్లేదన్న విషయం తెలుసుకొని వినయ్ కు అమ్ముడుపోయిన వాళ్ళు గలాటా చేయటానికి వచ్చారు. పెద్దాయన వుండుంటే ఇంత ధైర్యం చేసేవాళ్ళు కాదేమో కానీ ఆయన ఊళ్ళో లేకపోయేసరికి కొంచెం బింకం పెరిగింది ఆ గుంపులో కుర్రాళ్ళకి. ఊళ్ళోని పోకిరీలకు తోడు పక్కూరి కుర్రాళ్ళు కూడా కొంతమంది కలిశారు అందులో.

మాటలతో మొదలైన గలాటా కొంతసేపటికే చేతలవరకూ వచ్చింది. పాలెగాళ్ళు అందరూ గోడ కట్టెయ్యడంతో ఇంట్లోకి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేదు. ఐతే చేతికందిన రాళ్ళు, అవీ ఇవీ విసరడం మొదలెట్టారు. ఎప్పుడైతే పరిస్థితి ఇంతవరకూ వచ్చిందో ఆరోజు పూజ కోసం విగ్రహాన్ని బయటకు తీయడానికి వచ్చిన కిరీటి శైలూనీ, తన అత్త రుక్కుని ఇంట్లోకి లాక్కుపోయాడు. అలా లాక్కుపోతుండగా ఓ పలుకురాయి వచ్చి వాడి నుదుటి కొసకు తగిలింది. కణతలకు దగ్గరగా తగిలిందేమో టప్పున స్పృహతప్పి కూలబడిపోయాడు వాడు.

వాడి నుదుటన రక్తం బడబడా కారిపోతుంటే చూసి శైలు కెవ్వున కేకేసింది. తన కొంగుతో అదిమిపెట్టి రక్తం ఆపటానికి ప్రయత్నిస్తోంది. శైలు చేతుల్లో రక్తం, కిరీటి కూలబడిపోవడం చూసి గుంపులో కొంతమందికి గుండె జారిపోయింది. పిరికివాళ్లు వెంటనే కాళ్ళకు బుద్ధి చెప్పారు. కొంత ఆలస్యంగా స్పందించిన వాళ్ళు మటుకు పాలెగాళ్ల చేతులకి చిక్కారు. దొరికిన వాళ్ళను అందరినీ దయాదాక్షిణ్యాలు లేకుండా విరగదీసేశారు.

గుంపు చెదిరిపోయాక కిరీటిని తీసుకెళ్లి ముందుగదిలో పడుకోబెట్టారు. అప్పట్నుంచీ వాడి మీద ఎవరినీ చెయ్యి వేయనివ్వలేదు శైలు. ముందు ఒక తడిగుడ్డ తెచ్చి వాడి ముఖం మీద వున్న రక్తాన్ని తుడిచింది. తనకు చేతనైనంత వరకూ శుభ్రం చేసి గట్టిగా కట్టు కట్టింది. వాడి జేబులోంచి తాళాలు వెదికి తీసి ఆచారిగారింట్లో గాజుగుడ్డ, దూది ఇవన్నీ పట్టుకురమ్మని పురమాయించింది. అప్పట్నుంచీ వాడు అర్ధరాత్రివేళ కళ్ళు తెరిచేవరకూ పక్కనే కూర్చుని వుంది.

ఇదంతా చూస్తున్న రుక్కుకి వాళ్ళిద్దరిమధ్యా వున్నదేమిటో ఓ అవగాహనకు వచ్చింది. రాత్రికి ఓ రెండు ముద్దలు బలవంతంగా శైలు చేత తినిపిస్తూ మాట కలిపింది. ‘అమ్మీ, పిలగాడు బంగారమేనే. కాకుంటే సిన్న పిల్లోడు. అన్నీ ఆలోచించవే, ఇయన్నీ కుదిరే పనులు కావే తల్లీ’ అంటే శైలు ‘ఇంక ఆలోచించేది ఏమీ లేదు’ అని ఒక్కముక్కలో తేల్చిపారేసింది. పొడిగించడం ఇష్టంలేక రుక్కు అప్పటికి వదిలేసింది. కానీ తన పెనిమిటి దగ్గర ఈ విషయాన్ని ఎలా ఎత్తలో తెలీక ఆమె గుండె భారమయ్యింది.

అర్ధరాత్రి వేళకు కిరీటికి మెలకువ వచ్చింది. పక్కనే శైలు కుర్చీలో జోగుతోంది. తల మొత్తం పోటెత్తిపోతోంది. వాళ్ళ నాన్న నేర్పినవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. మెల్లిగా చేతిని నుదుటి దగ్గరకు తీసుకెళ్ళాడు. కట్టు గట్టిగానే కట్టారు అనుకున్నాడు. చూపులో ఏమన్నా తేడా వుందా అని పరికించి చూస్తున్నాడు. నడకలో తేడా వుందో లేదో ఒక రెండడుగులు అటూ ఇటూ నడిచి చూశాడు. బాలన్స్ ఏమీ తప్పకపోయేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. కరెంటు పోయినట్టుంది అక్కడక్కడా కొన్ని కొవ్వొత్తులు వెలిగించారు ఇంట్లో. తలతిప్పి చూస్తే పూజగదిలో సూర్యుడి విగ్రహం కనిపించింది. ఎప్పట్లాగే చీకట్లోనూ కాస్త మెరుస్తోంది.

అలా నడుచుకుంటూ వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా వుంది. తీసుకెళ్లి నుదుటికి ఆనించాడు. ఆ చల్లదనానికో ఏమో ఓ నిముషం అయ్యేసరికి లేచినప్పటికంటే ఇప్పుడు పదిరెట్లు మంచిగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ విగ్రహాన్ని చేతిలో అటూ ఇటూ తిప్పి చూశాడు. ‘ఏం కావాలి నీకు’ అని మెల్లిగా అడిగాడు.

వెనగ్గా అలికిడి ఐతే తలతిప్పి చూశాడు. శైలు నిలబడి వాడినే విప్పారిన కళ్ళతో చూస్తోంది. రమ్మని చెయ్యి జాపాడు. పరుగున వచ్చి వాడి కౌగిట్లో వాలిపోయింది. ఏదో మాట్లాడడానికి నోరు తెరిస్తే ముద్దు పెట్టి ఆపేశాడు. ‘నేను బాగానే వున్నాను. చిన్న దెబ్బే, పర్లేదు’ అన్నాడు. ఇంకా దీనంగానే చూస్తుంటే ‘నీకు నాకు matching’ అంటూ శైలు నుదుటిపై వున్న గాయం తాలూకు మచ్చని నిమిరాడు. విరిసీ విరియని పెదాలతో ఓ చిన్న నవ్వు నవ్వింది.

ఆమెను అలాగే పట్టుకొని మళ్ళీ విగ్రహాన్ని చూస్తున్నాడు. ‘ఇక వెళ్దాం రారా’ అంటే శైలు వంక చూసి మెల్లిగా ఆమె చేతిని తీసుకొని విగ్రహానికి తాకించాడు. అసంకల్పితంగా వెనక్కు లాగేసుకోబోతుంటే ఆమె చేతిని తనచేతిలో బంధించాడు. భయంభయంగా వాడిని చూసింది శైలు. ‘నీకేమీ కాదు దీన్ని పట్టుకుంటే. గుర్తుందా, పోయినేడాది నువ్వే నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి అదిగో విగ్రహం తీసుకెళ్లమని చెప్పావు’ అంటే మూగగా తలూపింది. ‘ఇందా అక్కడ పెట్టెయ్యు’ అని విగ్రహాన్ని ఆమె చేతికందించాడు. ఓ నిప్పుకణికను హ్యాండిల్ చేస్తున్నట్టు గబగబా పూజగదిలో పెట్టేసింది.

 

నువ్వు నీ గదిలోకి పోయి పడుకో’ అంటే వెళ్లనని మొండికేసింది. ‘నువ్వు వెళ్ళి పడుకుంటే నేను కూడా కాసేపు పడుకుంటాను’ అంటే ‘నువ్వు పడుకో, నాకు ఎలాగూ నిద్ర రావట్లేదు’ అంది. ‘ఒక కథ చెప్తాను, వింటూ పడుకుందువు’ అని బలవంతాన తీసుకెళ్ళాడు. గది అంతా కొంచెం ఉక్కగా వుంది. వాడే వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాడు. ‘ఊ, ఇంక పడుకో’ అంటే బలవంతాన వచ్చి పడుకుంది. ఓ పేపరు చేతిలోకి తీసుకొని ఇద్దరికీ గాలొచ్చేలా విసురుతున్నాడు.

‘కథ చెప్తానన్నావు’ అంటే ‘ఎక్కడ మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను’ అన్నాడు. వాడి చేతిలో చెయ్యి వేసి వుండిపోయింది శైలు. మెల్లిగా తనకొచ్చిన కల ఒకటి చెప్పడం మొదలెట్టాడు. వాడు కథ చెబుతుంటే శైలు కళ్ళముందు ఏదో తెరవేసి చూపించినట్టు చిత్రాలు కనిపిస్తున్నాయి.

అనగనగా ఒక ఊరిలో ఓ ముసలాయన, ఆయన పేరు పెంచలయ్య. అతడికున్న ఆస్థల్లా నాలుగైదు బర్రెలే. మన కథ మొదలయ్యే రోజున పశువులు కాసుకుంటూ సెలయేటి ఒడ్డున చెట్టు కింద సేద తీరుతున్నాడు. ఇక సాయంకాలమైంది. ఇంటికి చేరేముందు బర్రెలకు నీళ్ళు పట్టించడానికని తీసుకెళ్తుంటే ఆయన కాలికి ఏదో తగిలింది.

ముందు ఏదో మోడు తాలూకా వేరు అనుకున్నాడు. పెద్దగా పట్టించుకోలేదు. వరుసగా ఓ నాలుగైదు రోజులు అలానే తగులుతుంటే చిరాకేసి దాన్ని పెకలిద్దామని ఓ రోజు కొడవలి తీసుకొచ్చాడు. బర్రెల్ని వాటిమానాన వదిలేసి రోజూ కాలికి అడ్డం పడుతున్న దానిదగ్గర కూర్చుని మట్టిబెడ్డల్ని పెళ్లగిస్తున్నాడు. తవ్వి తీస్తే ఓ మట్టిముద్ద బయటికొచ్చింది. అది ఏ మొద్దు వేరులానూ లేదు. చూడడానికి చిన్నగానే వుంది కానీ బాగా బరువుంది. ఏమై వుంటుందా అనే కుతూహలంతో దాన్ని తీసుకెళ్లి సెలయేట్లో కడిగి చూశాడు.

మట్టి కరిగిపోతున్న కొద్దీ ముసలాయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతున్నాయి. చివరకు ఒక విగ్రహం ఆయన చేతిలోకొచ్చింది.
గాభరాగా చుట్టూతా చూశాడా ముసలాయన. దగ్గర్లో ఎవరూ కనిపించలేదు. మిలమిలా మెరిసిపోతున్న విగ్రహాన్ని తీసుకెళ్లి తన జోలెలో పెట్టేశాడు. చాలా బీద కుటుంబం ఆ ముసలాయనది. పెంచలయ్యకి ఒక కొడుకు కూడా వున్నాడు. అతడి పేరు మున్నా. పెళ్ళయి ఇద్దరు చిన్న పిల్లలు కూడా వున్నా ఇంకా కుదురు లేదు మున్నాకి. గాలితిరుగుళ్ళకి బాగా అలవాటు పడ్డాడు.

ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న పెంచలయ్యకి ఆ విగ్రహం చూసేసరికి ఆనందం, భయం ఒకేసారి కలిగాయి. విగ్రహం అమ్మేస్తే తమ కష్టాలు తీరుతాయి అన్న ఆశ, ఈలోపే ఎవరన్నా దాన్ని తీసేసుకుంటేనో అన్న భయమూ దొలిచేస్తున్నాయి ఆయన్ని. ఇంటికి త్వరగా చేరుకొని ఎవరికీ కనబడకుండా తన ముల్లె తీసుకెళ్లి తలగడకింద దాచాడు. ఓ రాత్రివేళ లేచి ఇంట్లో అందరూ నిద్రలో వున్నారు అని నిశ్చయించుకొని విగ్రహాన్ని బయటకు తీశాడు.

అది ఏ దేవుడి విగ్రహమో అర్ధం కాలేదు పెంచలయ్యకి. ‘సామీ, నిన్నమ్మేస్తాను. నన్నొగ్గెయ్యి. ఈ బీద బతుకు నాకలవాటే కానీ మనమలకైనా కూసింత సుకం గావాల. నీ పేర్జెప్పుకొని ఆ తరమైనా సల్లంగుంటాది అయ్యా’ అంటూ దానిని కళ్ళకద్దుకొని జాగ్రత్త చేసి పడుకున్నాడు.
    
అమ్మడానికైతే నిశ్చయించుకున్నాడు కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎంత ధనం అడగాలో తెలియరావట్లేదు పెంచలయ్యకి. రోజూ సెలయేటి ఒడ్డున కూర్చుని విగ్రహాన్ని తుడిచి చూసుకుంటూ కూర్చుంటున్నాడు. విగ్రహం చాలా విలువైనది అని అనిపిస్తోంది అతడికి. ఓ వైపు దానిని తీసుకెళ్లి గుడిలో వదలిరావాలి అనే ఆలోచన వస్తోంది. మరోవైపు చెడతిరుగుతున్న తన కొడుకు, నిస్సహాయంగా వున్న తన కోడలు, మనుమలు గుర్తొస్తున్నారు. ఈ ఆలోచనల్లో వుండగానే ఉన్నట్టుండి గొడ్లు బెదరినట్టు శబ్దాలు చేశాయి. వాటిని సముదాయిస్తుంటే కారుచీకట్లు కమ్మేసాయి.

ఆ రోజు గ్రహణం అని గుర్తొచ్చింది పెంచలయ్యకి. ఇల్లు కదలకుండా వుండాల్సింది అనుకుంటూ గొడ్లని తీసుకుపోయి చెట్టుకి కట్టేశాడు. మళ్ళీ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు. విగ్రహం నుంచి ఓ వెలుగు రేఖ బయల్దేరినట్టు అనిపిస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పెంచలయ్యకి. తను మేల్కొని వున్నాడా, కలగంటున్నాడా అని గిచ్చి చూసుకున్నాడు. ఏదైతే అది అయిందనుకొని వెలుగు రేఖ వెంబడి నడుచుకుంటూ పోయాడు. చుట్టుపక్కల ఎక్కడా చూడట్లేదు పెంచలయ్య. నేలమీద కనిపిస్తున్న వెలుగురేఖ చూసుకుంటూ నడుస్తున్నాడు.

చివరకు కాళ్ళకి మెట్లు తగిలేసరికి తలెత్తి చూశాడు. శిధిలావస్థలో వున్న ఓ దేవాలయం కనిపించింది. చేతిలో వున్న విగ్రహం బరువెక్కినట్టు అనిపిస్తే దానిని ఆ మెట్ల మీద పెట్టాడు. బెరుగ్గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. దేవాలయ నిర్మాణంలోని సుందరత్వాన్ని గమనించే స్థితిలో లేడు పెంచలయ్య. నోరు తెరుచుకొని అక్కడ నిలబడి వున్న విగ్రహాలను చూస్తున్నాడు. చేతికి దగ్గరలో వున్న ఓ విగ్రహానికి పట్టి వున్న బూజును దులిపాడు. అది శివుడి విగ్రహమని తోచింది అతడికి. మామూలు రాతి విగ్రహంలా లేదు అది. తన దగ్గరున్న చిన్న విగ్రహంలానే ఏదో లోహంతో పోతపోసి చేసిందనుకున్నాడు.

అక్కడ వున్నదంతా చూసి పరుగున వచ్చి మెట్లమీద వున్న విగ్రహం ముందు సాగిలబడ్డాడు. ‘సాములోరూ, నిన్నమ్మే దురాలోశన సెయ్యను, నన్నొగ్గెయ్యి. నీ మహిమ జూపించావు. ఏటి సెయ్యమంతావో సెప్పు, నీ దాసున్ని’ అంటూ వేడుకున్నాడు. ‘నాకేమీ ఇయ్యొద్దు, నా మనమల్ని సల్లంగా సూడు సామీ’ అని పరిపరివిధాల వేడుకున్నాడు. చేతనైనంత వరకూ గుడిలో విగ్రహాలను శుభ్రం చేసి వచ్చాడు. మళ్ళీ చిన్న విగ్రహంలోంచి వెలుగురేఖ కనిపిస్తే దాన్ని వెంబడి తన పశువుల దగ్గరకు చేరుకున్నాడు.

అప్పట్నుంచీ పెంచలయ్యకు మంచిరోజులు మొదలయ్యాయి. తమ కుటుంబానికే చాలీ చాలనట్లు వస్తుండే బర్రెపాలు ఇప్పుడు మిగులుచూపుతున్నాయి. ఓ రోజు ధైర్యం చేసి అంగట్లోకి తీసుకెళ్లి వాటిని అమ్ముకొచ్చాడు. ఆ రోజు పెంచలయ్య కుటుంబం అంతా తొలిసారిగా వరి అన్నం తిన్నారు. తనకు దొరికిన విగ్రహం ఎప్పుడు దారి చూపితే అప్పుడు వెళ్ళి గుడిని శుభ్రం చేసి వస్తున్నాడు పెంచలయ్య. పడిపోయిన రాళ్ళను, పెరిగిన పిచ్చిమొక్కలను తీసేసి మెల్లిగా దేవాలయాన్ని సంస్కరిస్తున్నాడు.

దేవాలయ స్థితితో పాటు పెంచలయ్య కుటుంబ స్థితి కూడా మెరుగు పడుతోంది. ఇదంతా చూస్తున్న మున్నాకు ఏదో మతలబు వుందని అనిపించింది. తన తండ్రిని జాగ్రత్తగా గమనించడం మొదలెట్టాడు. తనకివ్వకుండా ఇంకా ఎక్కడన్నా ధనం దాచివుంచాడేమో అని వెదుకులాడుతున్నాడు. ఓ రోజు తన తండ్రికి తెలియకుండా వెంబడి పశువుల కాపలాకు వెళ్ళాడు. దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఎప్పట్లానే పెంచలయ్య తన జోలెలోంచి విగ్రహాన్ని తీసి శుభ్రం చేసి దణ్ణం పెట్టుకుంటున్నాడు. అంతదూరంలోనూ విగ్రహం ధగధగలు మున్నాకు అగుపించాయి. అంత విలువైన విగ్రహం అమ్మేస్తే! దీన్ని దాటి ఆలోచన చేయలేక పోయాడు వాడు.

ఆ రాత్రి తన తండ్రి నిదురించేముందు విగ్రహాన్ని తలగడ కింద పెట్టడం చూశాడు. అర్ధరాత్రి దాటాక వచ్చి విగ్రహాన్ని తియ్యబోయాడు. అంతులేని బాధ నరనరాల్నీ మెలిపెట్టేస్తే టక్కున దాన్ని వదిలేసి పారిపోయాడు. ధైర్యం తెచ్చుకొని మర్నాడు మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి కూడా అదే అనుభవమయ్యేసరికి ప్రాణభయంతో పారిపోయాడు.

కాలగమనంలో పెంచలయ్య కుటుంబం ఆర్ధికంగా కుదురుకుంది. పాడి సంపద మూడింతలయ్యింది. ఇంటి కప్పు బాగయ్యింది. పిల్లలు తిండికి లోటు లేకుండా సంతోషంగా వున్నారు. కానీ పెంచలయ్య వయసు మీదపడుతోంది. స్వామి మహిమ వల్ల తన కుటుంబం బాగవడం చూసి సంతోషంగా వున్నాడు. అయితే తనకి ఇంత చేసిన ఆ స్వామికి కానుకగా తనకి కనిపించిన గుడిని ఉద్ధరించాలని అనుకున్నాడు. తన జీవితకాలంలో జరిగేది కాదు అని తెలుసు కాబట్టి తన కొడుక్కి ఆ పని అప్పగించాలి అనుకున్నాడు. మున్నాని కూర్చోబెట్టి తన కుటుంబం బాగవడానికి కారణమైన స్వామి మహిమను వివరించాడు. తన తర్వాత స్వామికి సేవ చెయ్యమని నూరిపోశాడు.     

‘పది తరాలపాటు సల్లంగుంటాము నాయనా, నా మాట కాదనకు’ అంటూ సూర్యుడి విగ్రహం ఇవ్వజూపాడు పెంచలయ్య. ఒకసారి విగ్రహాన్ని తాకితే ఏమయ్యిందో గుర్తొచ్చిన మున్నా భయంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. పెంచలయ్య బ్రతికున్నన్నాళ్లూ ఎప్పుడు గుడికి దారి కనిపిస్తే అప్పుడు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వచ్చాడు. పెంచలయ్య మరణించాక మున్నా తన పిల్లల చేత ఆ విగ్రహాన్ని ఊరిలోని గుడిలో వదిలేయించి వచ్చాడు. ఆ విగ్రహం అలా పూజారుల వంశీకుల వద్దకూ, అక్కడ్నుంచి గుడి ధర్మకర్తల వద్దకూ చేరింది. కాల ప్రవాహంలో తన మహిమ మళ్ళీ చూపించిందా విగ్రహం.

‘ఆ మహిమ ఏమిటంటావా? శైలు అనే తిక్క పిల్లకి, కిరీటి అనే మంచి అబ్బాయికి లంకె వేసిందా విగ్రహం’ అని కిరీటి చెప్తే ఆటోమాటిగ్గా వాడి నెత్తి మీద ఓ మొట్టికాయ వెయ్యబోయింది శైలు. తలకున్న కట్టు చూసి ఆగిపోయింది.    

కథ విన్నంత సేపూ శైలు ఓ trance లో వుంది. ఎప్పుడైతే వాడు కథ ఆపి తమ గురించి మాట్లాడాడో అప్పుడు దాని తాలూకా కనికట్టు వీగిపోయింది. ఆశ్చర్యంగా ‘ఇదంతా నీకెలా తెలుసురా’ అని అడిగింది. అన్నాళ్లనుంచీ లోపల వున్నదంతా కక్కేసిన కిరీటి అలసటగా ఆమె ఒళ్ళో వాలిపోయాడు. ‘ఒక ఊహ అంతే శైలూ. దాదాపు ఆరు నెలలనుంచీ ఆగకుండా ఈ కథ కలల్లో వస్తోంది. ఎప్పట్నుంచో నీతోనో నాన్నతోనో చెబ్దామనుకుంటున్నాను. ఇదిగో ఇవాల్టికి కుదిరింది. అంతేకాదు…’ అంటూ ధనుంజయ్ గురించి తనకొచ్చిన కల, అసలా ధనుంజయ్ ను ఎక్కడ కలిసిందీ ఏమిటీ కూడా చెప్పాడు.

‘అయ్యో కిరీటీ, ఇన్నాళ్లూ ఎవరికీ ఎందుకు చెప్పలేదురా? ఆ పిల్ల ఎక్కడుంటుందో తెలుసా నీకు? ముందు ఆ మాయల మరాఠీని సెక్యూరిటీ ఆఫీసర్లకి అప్పజెబితే వాళ్ళే మిగతా సంగతి చూసుకుంటారు’ అంది కోపంగా. సునయన గురించి వచ్చిన కలలు మటుకు చెప్పలేకపోయాడు కిరీటి. ఆ మాటను అప్పటికి దాటవేసి శైలుని శాంతపరచి పడుకోబెట్టాడు.   

ఊరినుండి తిరిగొచ్చిన పెదబాబు పండగ రోజు జరిగిన గలాటా విని కోపంతో ఊగిపోయారు. అప్పటికప్పుడు ఇంటిమీదకి గొడవకొచ్చిన వాళ్ళని పట్టుకొచ్చి నరికెయ్యాలన్నంత ఆవేశం వచ్చింది ఆయనకి. అయితే జరుగుతున్నదానికంతటికీ మూలకారణం ఎవరో కనిపెట్టాలని కోపాన్ని అణుచుకున్నారు. ఊళ్ళో గొడవ చేసినవాళ్ళ గుట్టుమట్లు కనిపెట్టమని తనవాళ్ళకు పురమాయించారు. రెండు మూడు మధ్యవర్తుల లేయర్ల వెనక దాగుండి పని నడిపించిన వినయ్ గుట్టు చిక్కలేదు కానీ తన ఊరిమీద విగ్రహం కోసం ఎవరో యుద్ధం ప్రకటించారన్న విషయం మటుకు అర్ధమైంది ఆయనకు.

అవతల వినయ్ కూడా ఈ ప్లాన్ పని చెయ్యనందుకు బాధపడి చేతులు కట్టుకు కూర్చోలేదు. తన ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేశాడు. అతనికి తోచిన ఆఖరు అస్త్రం సునయన. ఆమెను తనదారికి ఎలా తెచ్చుకోవాలి అనేదానిపై తన పూర్తి దృష్టి పెట్టాడు.

 

 15c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Maaya – 13, మాయ,telugu dengudu kathalu jabardast,jabbardasth telugu boothu kathalu,dengulata telugu stories episodes,jabbardasth.in,jabardast telugu stories, telugu kadalu jabardasth,jabbardasth stories,www.jabbardasth.in,telugu stories in jabardasth,telugu boothu kathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button