Kalasi Vachina Adrustam – 257 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 257 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి దారిలో వెళుతూ ఉండగా ఎదో తెలిసిన ముఖం అటో దగ్గర ఎదో మాట్లాడుతూ ఉంది అనిపించి బైక్ ని అటో పక్కకు వెళుతూ ఉండగా “నువ్వు మాట్లాడింది 50 ఇప్పుడు వంద అడుగుతూ ఉన్నావు ఏందీ” “నువ్వు చెప్పిన అడ్డ్రెస్ కి 50 అనుకున్న ఇప్పుడు , చూస్తే అది చాల దూరం ఉంది అందుకే 100 అడుగుతున్నా , నేను ఏమన్నా నీ మొగుడి ఆస్తి అడుగుతూ ఉన్నా నా ఏంటి ?” “ఏయ్ , మాటలు సరిగా రానీ , ఏంటి మొగుడు అదీ అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు?” “100 రూపాయలకు ఇంత రాద్దాంతం చేస్తున్నావు , ఇంకా పెళ్లి చేసుకొని ఉంటే వాడి సంగతి ఇంతే” “చెప్తుంటే నీకు కాదు మాటలు సరిగా , రానీ “ ” ఎంటే, నీ పొగరు , మూసుకొని నా 100 నాకు ఇవ్వు లేదంటే” అంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లబోతూ ఉండగా బైక్ ని సరిగ్గా వాడి పక్కన నిలిపాను. “ఏంటి పబ్లిక్ లో అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నావు ? “ “ఏయ్ , నీకు ఏంటి అమ్మాయిని చూడగానే హీరో అవుదాము అనుకున్నావా, మూసుకోని నీ దారిన నువ్వు పో , ఏయ్ నువ్వు డబ్బులు తీ” అంటూ చేతిని ఆ అమ్మాయి purse వైపు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే , బైక్ కి సైడ్ స్టాండ్ వేసి వాడి చేతిని ఎడం చేతిని పట్టుకొని వెనక్కు లాగుతూ కొద్దిగా ముందుకు వచ్చాను. ఇందాక ఆ అమ్మాయిని ఎక్కడో చూసాను అనుకొంటూ బైక్ ని స్లో చేయడం మంచిది అయ్యింది , తను కాంతీ భాయి , శివానీ అత్త మొన్నే వాళ్ళ ఇంటికి వెళ్లి బొమ్చేసి వచ్చాగా అందుకే గుర్తు. “ఏంటి కాంతీ , ఏంటి వీడితో గొడవ” “శివా , మీరా ఈ అడ్రస్స్ కి 50 మాట్లాడుకున్న ఇంటి నుంచి , కానీ ఈ అబ్బాయి 100 అడుగుతున్నాడు , ఎందుకు అంటే ఎదో ఎదో మాట్లాడుతూ ఉన్నాడు. దానికి తోడూ డబ్బులు లాక్కోవడానికి చూస్తూ ఉన్నాడు” “ఏంటి రా, వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడి కి 50 కుడా ఎక్కువే , మూసుకొని ఇచ్చింది తీసుకొని వెళ్ళు” అన్నాను తన చేతిని అలాగే గట్టిగా పట్టుకొని. “రే రంగా, వీరు , వీడు ఎవడో మనతో గొడవకు వచ్చాడు , కొద్దిగా చూడండి” అంటూ గట్టిగా కేక వేశాడు వాడి కేకకు ఆ పక్కనే అటో స్టాండ్ లో నిలబడిన ఓ 5 మంది మా ఇద్దరి వైపు రాసాగారు. “చెయ్యి వదిలి , మర్యాదగా ఓ 2౦౦ ఇచ్చి ఈ పిల్లను తీసుకొని వెళ్ళు , లేదంటే మా వాళ్ళు నీ కీళ్లు విరుస్తారు” అన్నాడు వంకరగా నవ్వుతు. “శివా , వాళ్ళు 5 మంది ఉన్నారు , వాళ్లతో ఎందుకు గొడవ నేను డబ్బులు ఇచ్చేస్తా , వాడిని వదిలేయి” అంది purse లో చేయి పెడుతూ. “నువ్వు ఆగు కాంతీ, ఇంత దాకా వచ్చాక ఇప్పుడు డబ్బులు ఇవ్వడం ఏంటి, వాళ్లను రానీ చూద్దాం” అన్నాను వాళ్లతో తలపడడానికి రెడీ అవుతూ. అక్కడ ఎదో గొడవ జరుగుతూ ఉంది అని చుట్టూ పక్కల జనాలు కు తెలిసి నట్లు ఉంది , మెల్లగా అక్కడ గుమి కూడడానికి రెడీ అవుతూ ఉండగా , అటో వాడి ఫ్రెండ్స్ వచ్చారు, అందులో ముగ్గురు బాగా బలిష్టంగా ఉన్నారు , ఇద్దరు మాములుగా ఉన్నారు. వాళ్లలో ఒకడు కొద్దిగా వెనుకగా ఉన్నాడు , ఇద్దరు మాత్రం కొద్దిగా స్పీడ్ గా ఉన్నట్లు ఉన్నారు. వాళ్ళు ఇద్దరే ముందు ఉన్నారు. రాగానే “ఏయ్ , మా వాడి చెయ్యి వదులు” “మీ వాడు ఎం చేశాడో అడగరా “ “నువ్వు ముందు చెయ్యి వదులు భే” అంటూ అందులో ఒకడు నా మీదకు వచ్చాడు. పట్టుకున్న వాడి చెయ్యి వదల కుండా మీదకు వచ్చే వాడి ముఖం మీద...