Junior NTR : మంచు లక్ష్మీది ఓవర్ యాక్షన్.. ఆమెతో ఎన్టీఆర్‌ను పోల్చొద్దు.. నటి షాకింగ్ కామెంట్లు..!
Junior NTR : మంచు లక్ష్మీది ఓవర్ యాక్షన్.. ఆమెతో ఎన్టీఆర్‌ను పోల్చొద్దు.. నటి షాకింగ్ కామెంట్లు..!

Junior NTR : మంచు లక్ష్మీది ఓవర్ యాక్షన్.. ఆమెతో ఎన్టీఆర్‌ను పోల్చొద్దు.. నటి షాకింగ్ కామెంట్లు..!
Junior NTR : ఈ నడుమ సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరి మీద నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఏదో ఒక సమయంలో వారిపై ఇలాంటి ట్రోల్స్ అనేవి కామన్ గానే వస్తున్నాయి. దీనికి ఎవరూ అతీతులు కాదన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి.
త్రిబుల్ ఆర్ లోని నాటునాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అమెరికన్ యాసలో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ కు అక్కడి మీడియా ప్రతినిధులు కూడా షాక్ అయిపోయారు. ఆయన ఇంగ్లిష్ పై చాలామంది ప్రశంసలు కురిపిస్తే కొందరు మాత్రం ఆయన్ను దారుణంగా ట్రోల్ చేశారు.
మన భాష అర్థం కాదు..
మరీ ఇంతగా అవసరమా అంటూ కామెంట్లు కూడా చేశారు. అయితే ఇదే విషయంపై తాజాగా నటి కస్తూరి శంకర్ మాట్లాడింది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అమెరికా వాళ్లకు వాళ్ల యాసలో మాట్లాడితేనే అర్థం అవుతుంది. మన ఇంగ్లిష్ మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే ఎన్టీఆర్ అలా మాట్లాడాడు.
కానీ మంచు లక్ష్మీ మాత్రం హైద్రాబాద్ లో కూడా ఆ భాషనే మాట్లాడుతుంది. అందుకే ఆమెది అందరికీ ఓవర్ యాక్షన్ గా అనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ ఇక్కడ మాత్రం అచ్చమైన తెలుగులోనే మాట్లాడుతాడు. కాబట్టి దయచేసి మంచులక్ష్మీతో ఎన్టీఆర్‌ను పోల్చ వద్దు అని కామెంట్లు చేసింది కస్తూరి శంకర్.