Oka Koduku Prayanam | Emotional Telugu Story Series
కారును గేట్ వరకు వెనుకకు తీసుకుని రాగా దివ్యక్క అమ్మను పిలుచుకునిరాగా నా పక్కనే ఎక్కి కూర్చోండి. కారులో ఇందుమతి గారికి జరిగిన కష్టాలను వివరించి , ఇంటెలి ఉన్న వాళ్ళ గురించి మొత్తం చెప్పి కారును అక్కడికి తీసుకునివేళ్ళాను. కారు శబ్దం విన్న ఇందుమతి గారు హాల్ ని శుభ్రపరచి సోఫాను నీటి గా సర్ది ఆత్రంగా బయటకు వచ్చి అమ్మను సాదరంగా లోపలికి పిలుచుకునివెళ్లింది. సౌమ్య సంతోషంగా అన్నయ్య అమ్మను పిలుచుకొని వస్తాను అని చెప్పారుగా అమ్మ ఎక్కడ అని అడుగగా , అమ్మ సంతోషిస్తూ అమ్మ సౌమ్య మిమ్మల్ని చూద్దామని వచ్చేశానమ్మా అని సౌమ్యను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అమ్మ పక్కనే కూర్చుని , కన్నయ్య నాకు కూతురు లేని లోటును ఇప్పుడు తీర్చావు అని నా చెయ్యి అందుకోగా లవ్ యు అమ్మ అని బాదులివ్వగా , ఆ మాట విన్న సౌమ్య కళ్లల్లో నీళ్లు కారుతుండగా , అమ్మ మనసు కరిగిపోగా ఏమయ్యింది తల్లి అని అడుగగా ఇన్నాళ్లకు మళ్ళీ అమ్మ ప్రేమను చూడబోతున్నానని ఆనందంతో కన్నీళ్లు ఆగటం లేదు అమ్మ అని చెబుతుండగా ,
కన్నయ్య నా కూతురు నన్ను ఎప్పుడు చూడబోతోంది అని ఉద్వేగంతో అడుగగా , అమ్మ అతి త్వరలో అది జరిగేలా చూద్దాము అమ్మ అని మాటివ్వగా , అమ్మ సౌమ్య కన్నీటిని తుడుస్తూ ఇంకొన్ని రోజుల్లో నువ్వు అందరిని చూడవచ్చు అని ప్రేమగా కౌగిలించుకోగా సౌమ్య అమ్మ ప్రేమకు పరవశించిపోసాగింది , అది చూసి అందరికి చాలా ఆనందం వేసింది. అంతలో అన్నయ్య నేను రెడీ అని రూమ్ లో నుండి రాము కొత్త …