Aranya – 6 | అరణ్య | telugu dengudu kathalu jabardast
Aranya - 6 | అరణ్య | telugu dengudu kathalu jabardast

Aranya – 6 | అరణ్య | telugu dengudu kathalu jabardast
రచన : Takulsajal
ముగ్గురం టెక్సటైల్ కంపెనీకి బైలుదేరాము, చూడటానికి బాగానే ఉంది రిచ్ గా. గగన్ సర్ ఆఫీస్లో కూర్చున్నాడు నేను మీనాక్షి మిగతా గోడౌన్ మెషినరీ చూడడానికి వెళ్ళాము.
మీనాక్షి నాకు ఒక్కొక్క దాని గురించి చెప్తుంది కానీ నా చూపు తను చెప్తున్న వైపు లేదు అక్కడ పని చేస్తున్న వారి మీదే ఉంది, ఎవ్వరికీ రెస్పెక్ట్ లేదు భయం బాధ్యతలు లేవు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పనిచేస్తున్నారు ముఖ్యంగా మేము వాళ్ళని దాటేటప్పుడు వాళ్ల దొంగ చూపులు, గుసగుసలు వింటూనే ఉన్నాను.
గోడౌన్ కి వెళ్ళాక మీనాక్షి కంపెనీలో మెయిన్ మేనేజర్ ని అసిస్టెంట్ మేనేజర్ ని పరిచయం చేసింది, వాళ్లిద్దరూ తేడాగానే ఉన్నారు. మీనాక్షిని వెళ్ళమని చెప్పి వాళ్లతొ మాట్లాడుతూ గంట గడిపాను.
ఆ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు బావ బామ్మర్దుల వరస అని తెలిసింది, ఇద్దరు కలిసి కంపెనీకి బానే బొక్క పెట్టారు వాళ్ల అలవాట్లకి వాళ్లు వాడే వస్తువులకి, కార్లకి వాళ్లు మాట్లాడే వ్యవహారిక భాషకి అస్సలు సంబంధం లేదు.
వాళ్లతోనే భోజనం చేసి, అక్కడ నుంచి వర్కర్స్ తొ కలిసి పనిలోకి చేరాను, కొంత సేపటికి మీనాక్షి ఫోన్ చేసింది.
శివ : చెప్పు
మీనాక్షి : భోజనానికి రాలేదు, ఆకలేస్తుంది.
శివ : మీరు తినేయ్యండి, నేను ఆల్రెడీ తినేసాను ఇక్కడే మెషినరీలో పని చేస్తున్నా రావడానికి కొంచెం టైం పడుతుంది.
మీనాక్షి : సరే, అక్కడే ఉండు మేమూ తినేసి వస్తాము.
ఫోన్ పెట్టేసి పనిలో పడిపోయాను, కాదు అందరినీ గమనించడం మొదలు పెట్టాను. కొంత సేపటికి నేను పనిచేస్తుంటే మీనాక్షి, గగన్ సర్ ఇద్దరు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ బైటికి నడిచాను.
గగన్ : ఏంటి శివా, వచ్చిన రోజే పనిలో చేరావు. ఆ మేనేజర్ చెప్పాడు చాలా ఆరాలు తీసావట.
శివ : అవును సర్ మెషినరీ లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు ఆ మేనేజర్ ని అసిస్టెంట్ మేనేజర్ ని దేవుడిలా కొలుస్తున్నారు. చాలా మందిని వాళ్లే జాయిన్ చేసుకున్నారట ఇంకా పై పెచ్చు అందులో చాలా మంది వాళ్ల బంధువులే ఇంకా కొన్ని తెలిసాయి.
రేపటి నుంచి ఇక్కడ కొన్ని రోజులు పని చేస్తాను అప్పుడు నాకు ఇక్కడ అస్సలు ఏం జరుగుతుందో అన్న అవగాహన వస్తుంది, దాన్ని బట్టి ముందుకు పోదాం, అని మీనాక్షి వైపు చూసాను ఏమంటావ్ అన్నట్టు.
గగన్ : ప్రౌడ్ అఫ్ యు శివా.
మీనాక్షి చెప్పట్లు కొడుతుంటే సిగ్గుతో నవ్వి ముగ్గురం అక్కడ నుంచి బైటపడి నన్ను హోటల్ దెగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయారు. హోటల్ కి వెళ్ళాక ఇక్కడి పనులు చూసుకోడం మొదలు పెట్టాను.
ముస్కాన్ కూడా అన్నీ చిన్నగా చూసుకుంటుంది, ప్రతీ ఒక్క విషయం తనకి ఓర్పుగా నేర్పుతూ వస్తున్నాను, పని వాళ్ళని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఒక పక్క చురకలు అంటిస్తూనే ఇంకో పక్క వాళ్ళ భోజనాలకి, టీ కి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. తన పద్ధతి బాగా నచ్చింది.
పనులన్నీ చూసుకుని పెందలాడే హాస్టల్ కి వెళ్లి నడుము వాల్చాను, నిద్ర పట్టేసింది.
ఇవ్వాళ కార్పెంటర్ పని జరిగింది రాసిచ్చిన సామాను మొత్తం తెచ్చాను అయినా నన్ను వాడు అది రాలేదు ఇది రాలేదు అని తెగ తిప్పాడు, అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అలిసిపోయి హోటల్లో తినేసి హాస్టల్ కొచ్చి బెడ్డెక్కాను.
ఈ వారం రోజులు టెక్సటైల్ కంపెనీలో పని చేసాను, ఈ లోగా ఖాసీం చాచాకి లోన్ కూడా వచ్చేసింది అటు హోటల్ కి ఇటు టెక్సటైల్ కి ఏ ఆటంకం లేకుండా పనులు జరిగిపోతున్నాయి.
కంపెనీ పేరు మీనాక్షి టెక్సటైల్స్ అని మార్చేశాడు గగన్ సర్, ఓపెనింగ్ కార్యక్రమానికి నేను వెళ్ళలేదు అంతా అయిపోయాక మీనాక్షి ఫోన్ చేసింది.
శివ : అయిపోయిందా
మీనాక్షి : నువ్వు నా పక్కన ఉంటే బాగుండేది
శివ : తిన్నావా ఏమైనా
మీనాక్షి : హహ
శివ : ఏమైంది
మీనాక్షి : నా గురించి కేర్ తీసుకుంటుంటే కొత్తగా బాగుంది.
శివ : రేపు కలుద్దాం, గగన్ సర్ ని కూడా తీసుకురా మాట్లాడదాం.
మీనాక్షి : అలాగే
శివ : ఉంటా మరి
మీనాక్షి : అంతేనా
శివ : ఇంకేముంది, ఏమైనా మాట్లాడాలా
మీనాక్షి : ఎప్పుడు పని మీద తప్ప, సరదాగా నా కోసం నాతొ మాట్లాడడానికి ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యవు.
శివ : మీ ఇంట్లో ఉంటావు, ఎక్కడ ఏ పరిస్తుతుల్లో ఉంటావో ఎందుకు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టడం అని
మీనాక్షి : లవ్ యూ
శివ : …………..
మీనాక్షి : చెప్పు
శివ : ఏమని
మీనాక్షి : లవ్ యూ టూ అని
శివ : హహ
మీనాక్షి : ఎందుకో ఆ నవ్వు
శివ : ఏమో నేను అలా చెప్పలేను
మీనాక్షి : ఆమ్మో, నిన్ను చాలా మార్చుకోవాలి
శివ : నీకు ఇష్టమొచ్చినట్టు మార్చేసుకో
మీనాక్షి : ఒక నాలుగు రోజులు వీలు చూసుకో ఎటైనా వెళదాం
శివ : ఇంట్లో ఏమని చెప్తావ్, మీ అమ్మమ్మ అడిగితే
మీనాక్షి : నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే, నీకు ఓకే నా
శివ : అవసరమంటావా
మీనాక్షి : మూసుకుని చెప్పింది చెయ్యి
శివ : హహ వామ్మో
మీనాక్షి : సారీ
శివ : నాకు బానే ఉంది, థాంక్స్
మీనాక్షి : దేనికి
శివ : నాతో నువ్వు నీలానే ఉంటున్నందుకు, నా మీద నువ్వు పెత్తనం చూపిస్తుంటే ఒక ఇంట్లో ఉన్నట్టు నేను నీ సొంతం అయినట్టు అనిపిస్తుంది, ఇప్పటి వరకు ఇలాంటి సంతోషాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు
మీనాక్షి : (నవ్వుతూ) అయితే నువ్వు నన్ను చాలా భరించాలి
శివ : జీవితాంతం భరిస్తాను
మీనాక్షి : ఉమ్మా
శివ : ఆమ్మో
మీనాక్షి : హహ బై.
శివ : ఆ.. బాయ్
మీనాక్షి : ఏమైంది.
శివ : ఏం లేదు
మీనాక్షి : ఇంకొంచెం సేపు మాట్లాడనా?
శివ : మ్
మీనాక్షి : సరే చెప్పు ఏం చేస్తున్నావ్
శివ : ఏం లేదు, సరే నేనే మళ్ళీ చేస్తాలే బాయ్
మీనాక్షి : సరే అయితే
మీనాక్షి ఫోన్ పెట్టేసి సంతోషంగా ఫోన్ ని గుండెలకి హత్తుకుని సంబరపడిపోతుంటే ఇటు శివ కూడా అదే అలజడిలో ముసి ముసిగా నవ్వుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు.
పొద్దున్నే శివ గగన్ మీనాక్షి ముగ్గురు చెరువు గట్టున కలుసుకున్నారు.
గగన్ : చెప్పు శివ, ఏదో మాట్లాడాలి అన్నావట
శివ : అవును సర్, నేను మీకు సహాయం చెయ్యాలి అంటే నాదొక షరతు.
గగన్ : ఏంటి?
శివ : ఇవ్వాల్టి నుంచి కంపెనీలో నేను ఏది చెప్తే అది ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్న వెయ్యకుండా చెయ్యాలి. అలా అయితేనే నేను మీకు సహాయం చెయ్యగలను.
గగన్ : కాన్…
శివ : కారణం చెప్పను, కానీ నా మీద నమ్మకం ఉంచి ముందుకు వెళదాం అంటే ఓకే లేదంటే నేను ఇక్కడితొ ఆగిపోతాను.
గగన్ : నీ మీద నమ్మకం లేకపోతే నా కూ.. అని మీనాక్షిని చూసి ఆగిపోయాడు.
సరే నువ్వేది చెప్తే అదే చేస్తాము.
శివ : అయితే రేపు ఆఫీస్ లో కలుద్దాం. టైం టు ప్రొగ్రెస్. కంపెనీ నుంచి వచ్చే లాభాలు ఏం చెయ్యాలో తెలీక మీకు పిచ్చెక్కిపొద్ది.
శివ నుంచి అంత కాన్ఫిడెంట్ గా వచ్చిన మాటలు విని మీనాక్షి గగన్లు ఆశ్చర్యంతొ నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయారు.
మీనాక్షి ఏదో మాట్లాడాలనుకున్నా అక్కడ తన నాన్న ఉండటంతొ మౌనంగానే శివని ఒకసారి చిరుకోపంగా చూసి కొంటెగా నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయింది.
అక్కడనుంచి హోటల్ కి వెళ్ళిపోయాను.
శివ : ముస్కాన్ అంతా ఓకేగా?
ముస్కాన్ : సూపర్.
శివ : ఆల్రెడీ ఎక్కడ ఏది రావాలి అన్నీ స్కెచ్ గీసి ఈ నోట్స్ లో రాసి ఉంచాను, కరెంటు పాయింట్స్, వాటర్ పాయింట్స్ అన్నీ కరెక్ట్ గా చేపించు.. నీకు నచ్చినట్టుగా మార్పులు చేపించుకో ఏ డౌట్ వచ్చినా ఒక్క ఫోన్ కొట్టు.
ముస్కాన్ : అలాగే భయ్యా మాకేం పర్లేదు అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరుగుతాయి, కానీ నువ్వు జాగ్రత్త వాళ్లంతా పెద్ద పెద్ద వాళ్ళు.
శివ : అలాగే.. బాబా ఎక్కడా?
ముస్కాన్ : లతీఫ్ వాళ్ళ అమ్మా నాన్న వస్తే మాట్లాడుతున్నాడు, పిలవనా?
శివ : వద్దులే నేను తరువాత మాట్లాడతా, సరే బై.
ముస్కాన్ : అప్పుడప్పుడు ఇటు వస్తూ ఉండు, మొత్తానికే మర్చిపోతావేమో.
శివ : చాచా బిర్యానీ తినకుండా రెండు రోజులు కూడా ఉండలేను మీ దెగ్గర పని చెయ్యట్లేదు అంతే, సాయంత్రానికి వస్తాను నాకొక సింగల్ పక్కకి పెట్టండి అని నడుచుకుంటూ వెనక్కి తిరక్కుండా నవ్వుతూ చెప్పి వచ్చేసాను.
కాలేజీకి వెళ్లి గగన్ సర్ పేరు చెప్పి మా ప్రిన్సిపాల్ తొ మాట్లాడి కాలేజీ సీనియర్స్ లిస్ట్ తీపించి హాస్టల్ కి వచ్చి కూర్చున్నాను, నా ఫోన్ మోగింది, కావేరి పెద్దమ్మ నుంచి.
శివ : పెద్దమ్మా బాగున్నావా
కావేరి : మేము బానే ఉన్నాం, నువ్వే అస్సలు కనిపించడం లేదు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది డబ్బులు పంపిస్తే సరిపోద్ది అనుకుంటున్నావా
శివ : కొంచెం పని మీద ఉన్నా పెద్దమ్మ రేపు వస్తాను, అందరూ ఎలా ఉన్నారు.
కావేరి : బాగున్నాము రా, పోయిన సారి నువ్వు పంపించిన డబ్బుతొ ఇక్కడ పిల్లలకి చదువు చెప్పించి నవోదయ ఎగ్జామ్ రాపించాను ఏడుగురుకి ఫ్రీ సీట్స్ వచ్చాయి ఇంటర్ వరకు ఫుడ్ బెడ్ చదువు మొత్తం వాళ్లే ఆ తరువాత ఎలాగో వాళ్ళ చదువులు, జీవితాలు వాళ్లు చక్కదిద్దుకుంటారు.
శివ : సంతోషం పెద్దమ్మ.
కావేరి : చికెన్ వండుతున్నా వచ్చి తినెళ్ళు.
శివ : పెద్దమ్మా అది..
కావేరి : ఆశ్రమానికి రాకపోయినా అమ్మ కోసం అయినా రారా, నువ్వు తప్పించి నాకెవరున్నారు చెప్పు, ఇంకేం మాట్లాడకుండా వచ్చేయి అలానే ముస్కాన్ ని కూడా తీసుకురా
శివ : హా అలాగే.. అని కాల్ కట్ చేసి కూర్చున్నాను, నా క్లాస్మేట్ కం రూం మేట్ సందీప్ వచ్చాడు.
సందీప్ : ఏంట్రా ఇవాళ త్వరగా వచ్చావ్, నీ పనే బాగుంది రా, కాలేజీకి రాకపోయినా మార్కులు వస్తాయి ఎప్పుడు చదువుతావురా అస్సలు నువ్వు.
శివ : సరేలే ఎలా జరుగుతున్నాయి క్లాసులు.
సందీప్ : అదే గోల
శివ : ఇవ్వాళ కాలేజీకి వచ్చాను, ప్రిన్సిపాల్ చెవుల నిండుగా తిట్టాడు కాలేజీకి రావట్లేదాని.
సందీప్ : ఆయన అలానే అరుస్తాడులే, నాకో హెల్ప్ కావాలిరా
శివ : ఏంటి?
సందీప్ : ఇంట్లో కొంచెం కష్టంగా ఉందని నాన్న ఫోన్ చేసాడు, కాలేజీ మానేసి పనికెళతావా అన్నట్టు మాట్లాడాడు ఇన్నేళ్లగా అలాంటి మాటలు ఆయన దెగ్గర నుంచి వినలేదు, చాలా బాదేసింది ఏదైనా జాబ్ చూస్తావా
శివ : ఒక జాబ్ ఉంది, కానీ చాలా కష్టం మరి.
సందీప్ : పర్లేదు చూపించు చేస్తాను.
శివ : సరే అయితే.
ఇంతలో మళ్ళీ ఫోన్ వస్తుంటే చూసాను మీనాక్షి.
శివ : హలో
మీనాక్షి : ఏంటి దొరవారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు.
శివ : అలా ఏం లేదు, అవును పొద్దున్న ఎందుకు నన్ను కోపంగా చూసి వెళ్ళావ్
మీనాక్షి : మరి మాకు అలా షాకులు ఇస్తే, నువ్వు అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు చెప్పాలి కదా
శివ : అయితే నీకు బోలెడన్ని చెప్పాలి
మీనాక్షి : చెప్పు, నేను అదేగా నిన్ను అడిగేది ఎన్ని ముచ్చట్లయినా చెప్పు ఓపికగా వింటాను.
శివ : ఇంకా
మీనాక్షి : చెప్పాలి నువ్వే, ఏంటి ఈ రోజు ప్లాన్స్.
శివ : హే మర్చిపోయా, పెద్దమ్మ భోజనానికి రమ్మంటుంది వెళ్ళాలి. వస్తావా?
మీనాక్షి : పిలిస్తే ఎందుకు రాను, నాకు చూడాలనే ఉంది, మీ పెద్దమ్మకి నన్ను పరిచయం చెయ్యి. నువ్వు పుట్టి పెరిగిన ఆశ్రమం చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
శివ : సరే అయితే హోటల్ దెగ్గర కలుద్దాం ముస్కాన్ కూడా వస్తుంది.
మీనాక్షి : సరే కార్ తీసుకొస్తాను
శివ : అలాగే వచ్చేటప్పుడు ఒక కెమెరా తీసుకురా
మీనాక్షి : దేనికి?
శివ : ఫోటోలు తీసుకుందాం
మీనాక్షి : హహ సరేలే
వెంటనే ముస్కాన్ కి కాల్ చేసాను.
ముస్కాన్ : చెప్పు భయ్యా
శివ : పెద్దమ్మ భోజనానికి పిలిచింది వస్తావా
ముస్కాన్ : ఐదే ఐదు నిముషాలు రెడీ అవుతాను.
శివ : తొందర ఏం లేదు ఆరింటికి వస్తాను రెడీగా ఉండు, చాచాకి చెప్పు
ముస్కాన్ : అవసరం లేదు, ఫోన్ స్పీకర్ లో ఉంది వింటున్నాడు
శివ : చాచా..!
చాచా నవ్వుతూ పెట్టేసాడు.
సందీప్ నన్నే చూస్తున్నాడు, నేను చాచాతొ జాబ్ గురించి మాట్లాడతానేమో అని ఫోన్ పెట్టేసి సందీప్ వైపు చూసాను.
శివ : సందీప్ నా దెగ్గర ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా నీకు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను కాని హామీ ఇవ్వలేను.
సందీప్ : పర్లేదు రా చూపించు.
శివ : రోజు కాలేజీ అయిపోయాక నాకు ఫోన్ చెయ్యి, అక్కడ నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి టైమింగ్స్ ఉండవు మరి, జీతం కూడా ఏం చెప్పలేను కానీ నువ్వు ఎదుగుతావు అది మాత్రం చెప్పగలను.
సందీప్ : అంతకంటే అదృష్టమా, నీ కష్టం చూస్తూనే ఉన్నాను నెలకి కొంచెం నీకు వీలైనంత ఇస్తే చాలు ఇంట్లో వాళ్ళని అడక్కుండా నా ఖర్చులు నేనే భరిస్తాను. ఏమైనా మిగిలితే నాన్నకి పంపిస్తాను.
శివ : సరే అయితే, ఇవ్వాల్టి నుంచి జాయిన్ అయినట్టేగా
సందీప్ : జాయిన్ ఐపోయా
శివ : సరే ఆ సెల్ఫ్ లో రిజిస్టర్లు ఉన్నాయి, నీకు ఫోన్ ఉందిగా?
సందీప్ : ఉంది.
ఆ రిజిస్టర్లు అందుకో ఇందులో…………………………………………………………………………….. తీసేసి మిగతా అందరినీ ఫిల్టర్ చెయ్యి, కన్ఫ్యూస్ అవ్వొద్దు మొత్తం నాలుగు రిజిస్టర్లు ఒకటి నువ్వు తీసుకో ఇంకోటి నాకు ఇవ్వు సాయంత్రం ఆరింటిలోపు అయిపించేద్దాం మిగతా రెండు రాత్రికి కంప్లీట్ చేద్దాం సరేనా.
సందీప్ : అలాగే.
ఇద్దరం స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేస్తూ గడిపి రెండు అయిపోయేసరికి ఆరున్నర అయ్యింది, పక్కకి పెట్టి ఫోన్ తీసుకుని చూస్తే మీనాక్షి నుంచి రెండు ముస్కాన్ నుంచి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
మీనాక్షికి ఫోన్ చేసాను.
మీనాక్షి : ఏమైపోయావ్?
శివ : రెండే రెండు నిముషాలు వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి లేచి మొహం కడుక్కుని వచ్చాను.
శివ : షర్ట్ వేసుకుంటూ సందీప్ పదా భోజనానికి వెళదాం అన్నాను
సందీప్ : వెళ్లిరా, నేనిక్కడ చేసేస్తాను.
శివ : పర్లేదురా అస్సలే చికెన్
అనగానే లేచి నిల్చున్నాడు నవ్వుకుని పదా అన్నాను. ఇద్దరం చాచా హోటల్ కి బైలుదేరాము వేగంగా నడుస్తూ.
శివ : వెళదామా
ముస్కాన్ : నీదే లేట్ భయ్యా
శివ : చిన్న పని అయిపోయింది, ఇదిగో తను నా ఫ్రెండ్ సందీప్ అని పరిచయం చేసాను, మీనాక్షి డ్రైవింగ్ సీట్లో పక్కన ముస్కాన్ వెనక నేను సందీప్ కూర్చున్నాం. కారు బైలుదేరింది.
ముస్కాన్ : భయ్యా లతీఫ్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారాని చెప్పా కదా
శివ : హా
ముస్కాన్ : నన్ను లతీఫ్ కి అడగడానికి వచ్చారు, బాబా ఆలోచించి చెప్తా అన్నాడు.
శివ : ఇందులో ఆలోచించడానికి ఏముంది వద్దని చెప్పక, (మళ్ళీ వెంటనే తెరుకుని) సారీ ముస్కాన్ ఏదో అలా వచ్చేసింది సారీ, ఇంతకీ నువ్వేం అనుకుంటున్నావు?
ముస్కాన్ : పర్లేదు భయ్యా, నాకూ వాడంటే పడదు
శివ : వద్దులే ముస్కాన్, అది నీకు నీ మెంటాలిటీకి, నీ మంచితనానికి ఆ సంబంధం సెట్ అవ్వదు అనుకుంటున్నాను, అయినా చాచా అన్నీ ఆలోచించే చేస్తాడు కదా
ముస్కాన్ : ఇక్కడే భాభీ, లోపలికి పోనివ్వు.
ముస్కాన్ కార్ లోపలికి పోనిచ్చింది, పెద్దమ్మ ఆఫీస్ ముందే చెట్ల దెగ్గర ఎవరితోనో మాట్లాడుతుంది, నలుగురం దిగి ముందుకు వెళ్ళాము. మమ్మల్ని చూసి నవ్వి తిరిగి వాళ్ళతో మాట్లాడుతుంది.
ముందు ముస్కాన్ ఆ వెనుక సందీప్ ఆశ్రమం చూసుకుంటూ వెళుతుంటే మీనాక్షి నాతొ పాటు నడుస్తుంది.
మీనాక్షి : నువ్వు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి.
శివ : దేనికి?
మీనాక్షి : ఎప్పటికైనా అవసరం పడుతుంది కదా, అదీకాక మనం ఎటైనా ట్రిప్ కి వెళదాం అనుకున్నాంగా దానికి నేను ఒక్కదాన్నే వెళుతున్నా అని ఇంట్లో మా అమ్మని ఒప్పించాలంటే చాలా పెద్ద పని నిన్ను డ్రైవర్ గా పరిచయం చేపిస్తాను.
శివ : ఇవన్నీ గగన్ సర్ కి తెలుసా
మీనాక్షి : ట్రిప్ అని అది అని ఇది అని చివరికి నీ పేరు చెప్పా ఆయనకి అర్ధం అయ్యింది మా ఇంట్లోనే ఒప్పించాలి.
శివ : అవసరమా మరి
మీనాక్షి : అవసరమే ప్లీజ్ ప్లీజ్ వెళదాం.
శివ : చూద్దాంలే
ఇంతలో కావేరి పెద్దమ్మ మాట్లాడుతున్న వాళ్ళని పంపించేసి మా వైపు వచ్చింది, ముస్కాన్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ
కావేరి : ముస్కాన్ బాగున్నావా, శివా ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చారు
ముస్కాన్ : బాగున్నా పెద్దమ్మ
కావేరి : తను..?
శివ : నా ఫ్రెండ్ పెద్దమ్మ, పేరు సందీప్
కావేరి : నమస్కారం బాబు
సందీప్ : నమస్తే అమ్మా
శివ : తను (అని మీనాక్షి చెయ్యి పట్టుకున్నాను)
కావేరి : ఆగాగు, మీనాక్షి కదా
శివ : అవునండి
కావేరి : నీ గురించి చెప్పాడు మీనాక్షి, చెప్పినట్టే కుందనపు బొమ్మల ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్నావ్.
మీనాక్షి సిగ్గుపడింది.
ముస్కాన్ : మరి నేనో
కావేరి : నువ్వు కూడా అచ్చా హే ప్యారా ఔర్ కితనా కూబ్ సూరత్ లడ్కి హో
ముస్కాన్ షుక్రియ అని సలాం చేసింది. అందరం నవ్వుకున్నాం
కావేరి : శివా చికెన్ తెప్పించా ఇంట్లోనే ఉంది, నీ చేత్తో వండవూ
ముస్కాన్ : ఏంటి భయ్యాకి వంట వచ్చా
కావేరి : హా వచ్చు, చాలా బాగా చేస్తాడు
ముస్కాన్ : మరి కనీసం ఒక్కసారి కూడా హోటల్లో గరిట పట్టుకోలేదు!
నేను నవ్వి సందీప్ తొ పాటు పక్క సందులో ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లాను.
మీనాక్షి : ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది, అన్నీ చాలా బాగా చేసారు, మీకు చెట్లంటే ఇష్టమా?
కావేరి : నాకు ఇష్టమే కానీ శివకి చెట్లంటే ప్రాణం. పచ్చదనం, వాగులు చెరువులు జలపాతాలు ఎక్కడ పచ్చదనం ఎప్పుడు వాటి గురించే మాట్లాడతాడు తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం చెట్ల గురించి మట్టి గురించి ఎంతసేపైనా మాట్లాడతాడు, ఇక్కడున్న ప్రతీ ఒక్క చెట్టు శివ పెట్టిందే, చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు కూడా బైటికి అలానే కనిపిస్తాడు కానీ చిన్న పిల్లోడి మనస్తత్వం.
మీనాక్షి : అమ్మా.. శివ గురించి చెప్తారా ఎక్కడ పుట్టాడు ఇక్కడికి మీ దెగ్గరికి ఎలా వచ్చాడు తన గురించి మీకు తెలిసిందంతా నాకూ తెలుసుకోవాలని ఉంది, తనని అడిగితే నవ్వాడు కానీ ఏం చెప్పలేదు.
కావేరి : చెప్తాను కానీ మళ్ళీ వాడికి గుర్తు చెయ్యడం లాంటివి చెయ్యకండి, బాధ పడతాడు.
ముస్కాన్, మీనాక్షి : చెప్పము
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-