Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 37 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 37 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 37 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన రాము అప్పటికే విల్లా నుండి గేట్ వైపుకి వెళ్తున్న దారి లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కొద్ది దూరంలో రేణుక నిల్చుని గేట్ వైపు చూసి గట్టిగా ఏడుస్తూ భయంతా కేకలు పెట్టడం చూసాడు.
ఆమెను అలా చూసిన రాముకి పరిస్థితి అర్ధం అయింది….గేటు వైపు చూస్తూ చిన్నగా నడుచుకుంటూ ముందు వస్తున్నాడు.
రేణుకకి నాలుగడుగుల ముందు సునీత, సునీత కి నాలుగడుగుల ముందు డ్రైవర్ ముగ్గురూ నిల్చుని భయంతో గేటుకి వేలాడదీసి ఉన్న కిషన్ తల వైపు చూస్తున్నారు.
కిషన్ తల గేటుకి వేలాడదీసి ఉండటం చూసిన రాము అతన్ని కాపాడలేకపోయానన్న బాధతో అలా చూస్తుండిపోయాడు.
రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన తరువాత రాము రేణుక వాళ్ళింటికి వచ్చాడు.
రాము హాస్పిటల్ నుండి వచ్చేయడం చూసిన రేణుక అతనికి ఎదురెళ్ళి గట్టిగా వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టి, “ఇప్పుడు ఎలా ఉన్నది….నేను, సునీత నిన్ను తీసుకొద్దామని ఇప్పుడే బయలుదేరబోతున్నాము,” అన్నది.

రేణుక అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళ్ ఆమె చెక్కిళ్లను తడుపుతూ కిందకు జారిపోతున్నాయి.

రాము ఆమె కన్నీళ్లను తుడుస్తూ, “అంతా బాగానే ఉన్నది….నీతో మాట్లాడాలి,” అంటూ రేణుకని అక్కడ సోఫాలో కూర్చోబెట్టాడు.
అంతలో సునీత కూడా అక్కడకు వచ్చి రాముని పలకరించింది.
రాము రేణుక వైపు చూసి, “ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరిద్దరికీ నమ్మకం కుదరకపోవచ్చు…..మీ ప్లేసులో నేను ఉన్నా కూడా ఈ విషయం నమ్మలేను….కాని నేను ఏదైతే చెప్పాలని ఇక్కడకు వచ్చానో అది నిజం….” అంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “రేణుక….నేను నీకు ఇంతకు ముందు చెప్పినట్టు నేను ఇక్కడి వాడిని కాదు….అంటే నేను ఈ కాలం వాడిని కాదు,” అన్నాడు.
రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాని రేణుక అతని వైపు అయోమయంగా చూస్తూ, “నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కావడం లేదు రాము,” అన్నది.
“కాలం నన్ను యాభై ఏళ్ళు వెనక్కు తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెట్టింది….” అన్నాడు రాము.
అది విన్న సునీత, “రాము….ఇప్పుడున్న పరిస్థితుల్లో జోకులు వేయకు,” అన్నది.
రాము సునీత వైపు చూసి, “నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు పోలీసులు ఇక్కడకు వచ్చారు…” అన్నాడు.
ఆ మాట వినగానే సునీత మొహంలో రంగులు మారాయి….పోలీసులు వచ్చి వెళ్ళిన విషయం హాస్పిటల్ లో ఉన్న రాముకి ఎలా తెలిసిందని సునీత ఆలోచిస్తున్నది.
రాము మళ్ళీ రేణుక వైపు చూస్తూ, “పోలీసులు మొత్తం investigation చేసారు….కాని నిన్ను(రేణుక) ఏమీ అడగలేదు,” అన్నాడు.
రాము చెప్పింది నమ్మలేనట్టు రేణుక సునీత వైపు చూసింది.
సునీత కూడా రాముకి ఇవన్నీ ఎలా తెలిసాయి అన్నట్టు ఆశ్చర్యంతో చూస్తున్నది.
రేణుక మళ్ళీ రాము వైపు చూస్తూ, “ఇవన్నీ నీకు ఎలా తెలుసు,” అని అడిగింది.
రేణుక అలా అడుగుతున్నప్పుడు పైనుండి సుందర్ ప్రేతాత్మ వాళ్ళున్న గది వైపు వస్తున్నాడు.
అది గమనించని రాము ఏం చెబుతున్నాడో, జరిగింది చూసినట్టు ఎలా చెబుతున్నాడో అర్ధం కాక రేణుక, సునీత రాము వైపు ఇంకా అతను ఏం చెబుతాడా అన్నట్టు చూస్తున్నారు.
“రెండో రోజు పోలీసులు మళ్ళి ఇంటికి వచ్చారు….వాళ్ళు సునీత కి సుందర్ ఇంట్లో దొరికిన వస్తువులు ఇచ్చేసి వెళ్ళిపోయారు… ఆ వస్తువులు ఏంటంటే వాడు వేసిన నీ బొమ్మలు, నీ స్కార్ఫ్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయారు,” అన్నాడు రాము.

“ఇదంతా నీకెలా తెలుసు….” అంటూ సునీత రాము చెప్పే మాటలు నమ్మలేనట్టు అడుగుతున్నది.
“ఇవే కాదు…నాకు ఇంకా జరగబోయేది కూడా తెలుసు….అది నాకు ఎవరూ చెప్పలేదు,” అంటూ రాము రేణుక వైపు చూసి, “నిన్న రాత్రి ప్రొఫెసర్ సుందర్ నీ కల్లోకి వచ్చాడు…కల్లోకి వచ్చిన సుందర్ తను బ్రతికి ఉండగా చేయలేని పని మొత్తం….చనిపోయిన తరువాత చేస్తానని నీతో చెప్పాడు….నిజమే కదా….” అని అడిగాడు.
“కాని ఇదంతా నీకు ఎలా తెలుసు,” అనడిగింది రేణుక.
రాము రేణుక దగ్గరకు వచ్చి ఆమె ఎదురుగా మోకాళ్ల మీద కూర్చుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “నాకు ఇవన్నీ ఎలా తెలుసంటే…. నాకు నువ్వే అన్నీ చెప్పావు,” అన్నాడు.
“నేనా….నేను నీకు ఇవన్నీ ఎప్పుడు చెప్పాను,” అంటూ రేణుక రాము ఏం చెబుతున్నాడో అర్దం కానట్టు అడిగింది.
“నువ్వంటే నువ్వు కాదు…..నువ్వు రాసిన లెటర్….” అన్నాడు రాము.
“లెటర్….నేను నీకు ఎప్పుడు రాసాను….ఏ లెటర్ రాము,” అని అడిగింది రేణుక.
రాము పైకి లేచి నిల్చుని, “రేణుక….నేను ఇప్పుడు నీకు, నీ తలరాతకు మధ్యలో నిల్చుని ఉన్నాను….నీ తలరాతలో ఏం రాసుందో తెలుసుకోవాలనుకుంటున్నావా….” అంటూ ఒక్క క్షణం అగాడు రాము.
రాము చెబుతున్న మాటలు ఇంకా తనకు అర్ధం కానట్టు రేణుక అతని వైపు చూస్తున్నది.
“రేపు మీ ఇద్దరూ ఢిల్లో వెళ్ళడానికి రెడీ అవుతారు….కాని కిషన్ తల తెగి కనిపించినట్టే….డ్రైవర్ తల కూడా తెగి కారులో మీకు కనిపిస్తుంది…ఈ ఇంట్లోనే మీ ఇద్దరూ బందీలైపోతారు…సునీత కూడా నిన్ను రక్షించలేదు….” అంటూ రాము తల ఎత్తి బెడ్ రూమ్ తలుపు వైపు చూసాడు
అక్కడ అద్దం మీద ఎవరో శ్వాస పీలుస్తున్నట్టు గాలి మంచులా కనిపించడంతో అక్కడ ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మ్ వచ్చి తమ మాటలు వింటున్నాడని అర్ధమయింది.
కాని రాము తనను గమనించాడని ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ మళ్ళీ రేణుక వైపు తిరిగి, “ఎందుకంటే సునీత పరిస్థితి కూడా డ్రైవర్, కిషన్ లలాగే ఆమె తల కూడా తెగిపోతుంది…ఆ తరువాత ఈ ఇంట్లో నువ్వు, ఆ ప్రొఫెసర్ ప్రేతాత్మ తప్పితే ఇంకెవరూ ఉండరు….ఆరు రోజుల వరకు ఆ ప్రేతాత్మ నిన్ను తనకిష్టం వచ్చినట్టు అనుభవిస్తుంది…ఆ ప్రేతాత్మ పెట్టే బాధలు భరించలేక ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు….యాభై ఏళ్ల తరువాత కూడా నీ అరుపులు ఈ విల్లాలో వినిపిస్తూనే ఉంటాయి…” అంటూ రాము రేణుక భుజాలు పట్టుకుని సోఫాలో నుండి పైకి లేపి, “నిన్ను ఈ బాధ నుండి బయట పడేయడానికి వచ్చాను రేణుక…నన్ను నమ్ము…” అంటూ రేణుకను గట్టిగా కౌగిలించుకున్నాడు రాము.
అలా కౌగిలించుకున్న రాము రేణుక చెవిలో ఎవరికీ వినబడకుండా, “రేణుక….సుందర్ ప్రేతాత్మ ఇక్కడే మన మాటలు వింటుంది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను…ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నమ్మనట్టు నటిస్తూ నన్ను కోప్పడుతూ బయటకు గెంటేయంది….ఒక గంట తరువాత ఇక్కడకి దగ్గరలో ఉన్న పార్క్ కి సునీత ని తీసుకుని వచ్చేయ్….నేను మీ ఇద్దరికీ చాలా విషయాలు చెప్పాలి,” అన్నాడు.
దాంతో రేణుక, “అలాగే రాము,” అన్నది.

అంతలో సునీత రేణుక దగ్గరకు వచ్చి రేణుకని రాము కౌగిలి నుండి విడిపించి, “రాము….ఏం చేస్తున్నావో….ఏం మాట్లాడుతు ఉన్నావో అర్ధమవుతున్నదా…నీ ప్రవర్తన నాకు నచ్చలేదు,” అంటూ రాముని తోసేసింది.
రాము రేణుక వైపు చూస్తూ, “రేణుక….నన్ను నమ్ము రేణుక….నేను నిజమే చెబుతున్నాను,” అన్నాడు.
కాని రేణుక మాత్రం రాము చెప్పిన ప్రకారం, “నీ మాటలు ఏమాత్రం నమ్మేలా లేవు రాము….ఇప్పటి దాకా నువ్వు మంచి వాడివి అనుకున్నాను….మాకు నువ్వు చెప్పే కట్టుకధల మీద ఏమాత్రం నమ్మకం లేదు….నువ్వు ఏదో కట్టుకధలు చెప్పి నన్ను బుట్టలో పడేసుకోవాలనుకుంటున్నావు…..ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో,” అన్నది.
“రేణుక….ప్లీజ్….నన్ను నమ్ము,” అంటూ బ్రతిమిలాడుతున్నాడు రాము.
“రాము….please get out from my house,” అంటూ గట్టిగా చెప్పింది రేణుక.
కాని రాము రేణుక చెప్పేది వినకుండా, “నా మాట విను రేణుక,” అన్నాడు.
దాంతో రేణుక కోపంగా, “రాము….మా ఇంట్లో నుండి వెళ్ళిపో….” అంటూ గట్టిగా అరిచింది.
ఇక రాము చేసేది లేక అక్కడ నుండి వెళ్ళిపోయి….ఇంతకు ముందు రేణుకకి తాను కలవమన్న చోటకు వచ్చి వాళ్ళిద్దరి కోసం ఎదురుచూస్తున్నాడు.
అరగంట తరువాత రేణుక, సునీత ఇద్దరూ కారులో రాము చెప్పిన చోటకు వచ్చారు.
కారు దిగిన వెంటనే రేణుక పరిగెత్తుకుంటూ రాము దగ్గరకు వచ్చి, “రాము…..” అంటూ దగ్గరకు వచ్చి వాటేసుకోబోయింది.
కాని రాము ఆమెని దూరం నుండే ఆపుతూ, “ష్…..మాట్లాడొద్దు,” అన్నాడు.
దాంతో రేణుక అక్కడే రాముకి నాలుగడుగుల దూరంలో ఆగిపోయి ఏంటన్నట్టు చూసింది.
అంతలో సునీత కూడా కారు దిగి రేణుక పక్కనే వచ్చి నిల్చున్నది.
రాము తన ఫ్యాంట్ జేబులో నుండి ఒక లెటర్ తీసి సునీత కి ఇస్తూ చదవమన్నట్టు సైగ చేసాడు.
సునీత రాము ఎందుకు మాట్లాడటం లేదో, లెటర్ ఎందుకు ఇస్తున్నాడో అర్ధం కాక అయోమయంగా రాము చేతిలో లెటర్ తీసుకుని చదువుతున్నది.
లెటర్ : నేను మిమ్మల్నిద్దరినీ ఆ ఇంటి నుండి దూరంగా ఎందుకు రమ్మన్నానంటే….సుందర్ ప్రేతాత్మ మిమ్మల్ని ఫాలో చేయకుండా ఉంటుందని అనుకుంటున్నాను….ఒకవేళ ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఫాలో చేసి వచ్చినట్లయితే నేను విన్నదాని ప్రకారం ఆత్మలకి చదవడం కాని, రాయడం కాని తెలియదు….
ఆ లెటర్ చదువుతూ సునీత ఒకసారి రాము వైపు చూసి తన చేతిలోని లెటర్ పక్కనే ఉన్న రేణుకకి ఇచ్చింది.
రేణుక ఆ లెటర్ ని చేతిలోకి తీసుకుని చదువుతున్నది….
లెటర్ : ఇప్పుడు నేను చెప్పేదేంటంటే….నేను ఇంతకు ముందు మీ ఇద్దరికీ మీ ఇంట్లో చెప్పిన విషయాలు మీ ఇద్దరూ నమ్ముతున్నారా లేదా….కేవలం సైగలతోనే సమాధానం ఇవ్వండి…మాటల్లో వద్దు…..
ఆ లెటర్ చదివిన తరువాత రేణుక ఒక్కసారి రాము వైపు చూసి తరువాత సునీత వైపు చూసింది….సునీత కూడా నమ్ముతున్నట్టు తల ఊపింది.
దాంతో రేణుక కూడా రాము వైపు తిరిగి నమ్ముతున్నట్టు తల ఊపింది.

వెంటనే రాము తన జేబులో ఉన్న ఇంకో లెటర్ తీసుకుని చదవమని రేణుకకు ఇచ్చి….ఆమె చేతిలో ఉన్న పాత లెటర్ తీసుకుని లోపల పెట్టుకున్నాడు.
రేణుక ఆ లెటర్ తీసుకుని చదవుతుంటే….సునీత కూడా రేణుక దగ్గరకు వచ్చి లెటర్ చదువుతున్నది.
లెటర్ 2 : మీరు ఇద్దరూ నా మాట నమ్ముతున్నట్టైతే….అప్పుడు మీరిద్దరూ ఆ సుందర్ ప్రేతాత్మని ఎదుర్కోవాలని నమ్మాలి. ఒకవేళ దెయ్యం అనేది ఉంటే దేవుడు కూడా తప్పకుండా ఉంటాడు. మనం దేవుడి హెల్ప్ లేకుండా ఆ సుందర్ ప్రేతాత్మను ఎదిరించలేము….దానికి మీ ఇద్దరి సహకారం కావాలి….
ఆ లెటర్ మొత్తం చదివిన తరువాత రేణుక, సునీత అలాగే అన్నట్టు తల ఊపారు.
దాంతో రాము కూడా రేణుక వాళ్లతో పాటు కారు ఎక్కి డ్రైవర్ తో అక్కడ దగ్గరలో ఉన్న చర్చి దగ్గరకు పోనివ్వమని చెప్పాడు.
కొద్దిసేపటికి రాము, రేణుక, సునీత ముగ్గుతూ చర్చి లోకి వెళ్ళారు…..డ్రైవర్ మాత్రం కారులోనే కూర్చున్నాడు.
చర్చి లో ఫాదర్ కి రాము జరిగింది అంతా వివరంగా చెప్పాడు.
అంతా విన్న ఫాధర్ ఐదు నిముషాలు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేసిన తరువాత కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ, “మీరు చెప్పేది నేను పూర్తిగా నమ్ముతున్నాను….ఆ ప్రొఫెసర్ ఆత్మ రేణుకతో కలిపోయింది…అది ఎలాగంటే వీళ్ళిద్దరూ ఒకరకమైన బంధనంలో చిక్కుకున్నారు….ఎప్పటి వరకైతే ఈ బంధనం తొలగిపోదో అప్పటి దాకా సుందర్ రేణుకని వదిలిపెట్టడు….” అన్నాడు.
“కాని ఫాదర్…ఆ బంధనాన్ని విడగొట్టడానికి మార్గం ఏంటీ….” అనడిగింది సునీత.
దాంతో ఫాదర్ ఒక నిట్టూర్పు విడుస్తూ తన చైర్ లోనుండి లేచి, “ఈ బంధనాన్ని విడగొట్టడం ప్రతి ఒక్కళ్ళకు సాధ్యం కాదు…. ఇక్కడ నుండి దాదాపు 120 k.m దూరంలో షాపూర్ దగ్గర ఉన్న అడవుల్లో ఒక దర్గా ఉన్నది….అందులో ఒక సూఫీ బాబా ఉన్నాడు….ఆయన ఇలాంటి ప్రేతాత్మలను చాలా తేలిగ్గా బంధిస్తాడు…అతను మాత్రమే మీకు ఏదైనా సహాయం చేయగలడు,” అన్నాడు.
ఆ మాటలు విన్న రాము ఫాదర్ తో, “ఫాదర్…నాదో చిన్న డౌట్….సుందర్ ప్రేతాత్మ రేణుకతో కలిసిపోయిందంటున్నారు కదా… మరలాంటప్పుడు ఆ ప్రేతాత్మ మమ్మల్ని ఫాలో చేస్తుంది కదా….ఫాలో చేయడమే కాకుండా….మమ్మల్ని ఆ దర్గా వరకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది కదా,” అనడిగాడు.
రాము అలా అడగడంతో ఫాదర్ వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ, “నువ్వు చెప్పింది కరెక్టే….ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినవి రెండు విశయాలు ఉన్నాయి….అందులో మెదటికి….ఏ ఆత్మ అయినా ప్రేతాత్మ అయినా రోజులో బాగా శక్తివంతంగా ఉండేది తెల్లవారుజామున మూడు గంటలకు…..మళ్ళి సాయంత్రం మూడు గంటలకు చాలా బలహీనంగా ఉంటుంది…అది బలహీనంగా ఉన్న టైం అంటే మధ్యాహ్నం మూడు గంటలకు మీరు దర్గాకు బయలుదేరాల్సిన టైం…” అన్నాడు.
“మరి రెండో విషయం ఏంటి ఫాదర్,” అనడిగింది రేణుక.

రెండోది ఏంటంటే….నేను ఇక్కడ చర్చిలో మీ కోసం నేను ప్రార్ధనలు చేస్తాను….నేను ప్రార్ధన చేస్తున్నంత సేపు ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఎవరికీ హాని తలపెట్టలేదు….అలా అని మీరు అజాగ్రత్తగా ఉండకూడదు….అది మిమ్మల్ని చంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది….అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి….అది ఏ విధంగానైనా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు మాత్రం……” అంటూ ఫాదర్ చెప్పబోతుండగా….
“మేము మాత్రం ఆ ప్రేతాత్మ పేరు మా నోటి నుండి పలకకూడదు….అంతేకదా ఫాదర్,” అన్నాడు రాము.
ఫాదర్ రాము వైపు మెచ్చుకుంటున్నట్టు చూసూ, “చాలా కరెక్ట్ గా చెప్పావు….ఈ విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోండి….మీ నోటి నుండి ఎట్టి పరిస్థితుల్లోను ఆ ప్రేతాత్మ పేరు బయటకు రాకూడదు….ఒక వేళ పొరపాటున అయినా పలికారంటే ఆ పలికిన వాళ్లను ఆ ప్రేతాత్మ ఆవహింస్తుంది…ఈ విషయం మీరు గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు.
దాంతో వాళ్ళు ముగ్గురూ ఫాదర్ చెప్పిన జాగ్రత్తలు విని చర్చి నుండి బయటకు వచ్చారు.
వాళ్ళు బయటకు రావడం చూసిన డ్రైవర్ కారు స్టార్ట్ చేసి…..వాళ్ళు ఎక్కగానే విల్లా వైపు పోనిచ్చాడు.
విల్లా లోకి వెళ్లగానే రేణుక, సునీత తమకు కావలసిన వస్తువులు, బట్టలు సర్దిపెట్టి టైం కరెక్ట్ గా మధ్యాహ్నం మూడు కాగానే విల్లా నుండి బయటకు వచ్చి తమ చేతిల్లో ఉన్న రెండు సూట్ కేస్ లు కారులో పెట్టారు.
అప్పటికే రాము డ్రైవర్ దగ్గర కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేసి వాళ్ల కోసం రెడీగా ఉన్నాడు.
వాళ్ళిద్దరూ కారు ఎక్కగానే అక్కడ నుండి బయలుదేరారు.
********
వాళ్ళు బయలుదేరిన కొద్దిసేపటికి సుందర్ ప్రేతాత్మ సాయంత్రం ఆరు గంటలకు బలం పుంజుకుని రేణుక కోసం ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
కాని బెడ్ రూమ్ లో రేణుక కనిపించకపోయే సరికి ఆమె కోసం విల్లా మొత్తం వెదికింది….కాని ఎక్కడా కనిపించకపోయే సరికి విల్లా నుండి బయటకు వచ్చి తన శక్తితో వాళ్ళు ఎటు వైపు వెళ్తున్నారో తెలుసుకుని వాళ్ళు వెళ్తున్న వైపు కోపంతో బయలుదేరింది.
అలా కొద్దిదూరం గాల్లో తేలుకుంటూ వెళ్ళిన తరువాత ఒక రోడ్డు మీద రేణుక వాళ్ళు కారులో వెళ్తున్నట్టు చూసింది.
కారు రాము డ్రైవ్ చేస్తుండటం చూసి వాళ్ళ మీదకు దాడి చేయబోయింది.
కాని చర్చిలో ఫాదర్ చేస్తున్న ప్రేయర్ కారణంగా వాళ్ళను తాకలేకపోయింది.
అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు రాత్రి ఎనిమిది అయ్యే సరికి దారిలో ఉన్న ఒక హోటల్ కి వెళ్లి రెండు రూమ్ లు తీసుకుని ఆ నైట్ అక్కడే రెస్ట్ తీసుకుని మళ్ళి ఉదయాన్నే బయలుదేరదామని అనుకున్నారు.
హోటల్ లోకి వెళ్ళిన వాళ్లు ఒక రూమ్ రాము తీసుకోగా, ఇంకో రూమ్ సునీత, రేణుక తీసుకున్నారు.
ఆ రాత్రి భోజనం చేసిన తరువాత ముగ్గురూ తరువాత రోజు ఏం చెయ్యాలో మాట్లాడుకున్నారు.
సునీత వాళ్ళిద్దరితో, “ఇప్పుడే వస్తాను,” అని చెప్పి వెళ్లి పది నిముషాల తరువాత వచ్చింది.
“రేణుక….నేను రిసిప్షన్ లో మీ నాన్నగారి ఢిల్లీ నెంబర్ కి ట్రంకాల్ బుక్ చేసి వచ్చాను….వాళ్ళకు లైను కలవగానే మనల్ని పిలుస్తారు,” అన్నది సునీత.
“అలాగే సునీత,” అన్నది రేణుక.
“ఇక వెళ్లి పడుకుందాం పద…ఇప్పటికే చాలా దూరం జర్నీ చేసి బాగా అలసిపోయాము….” అన్నది సునీత.
కాని రేణుకకు మాత్రం రాముతో గడపాలని అనుకుంటున్నది.
సుందర్ చనిపోయిన దగ్గర నుండి తనకు రాముతో ప్రశాంతంగా గడపడానికి టైం దొరకకపోవడంతో చాలా అసహనంగా ఉన్నది రేణుకకి.
దాంతో రేణుక సునీత వైప్ చూస్తూ, “మీరు వెళ్ళి పడుకోండి సునీత….నేను కొద్దిసేపు రాముతో మాట్లాడి వస్తాను,” అన్నది.
రేణుక అలా అనగానే వాళ్ళిద్దరి సంగతి తెలిసిన సునీత చిన్నగా నవ్వుతూ, “సరె….ఎక్కువ సేపు కబుర్లతో కాలక్షేపం చేయకుండా తొందరగా వచ్చేయ్….మళ్ళి పొద్దున్నె జర్నీ చేయాలి….ఈ ప్రాబ్లం నుండి బయటపడితే నేను మీ ఇద్దరి విషయం మీ అమ్మకు చెప్పి పెళ్ళి చేయించేస్తాను….అప్పుడు మీ ఇద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉందురుగారు,” అన్నది.
సునీత అన్న మాటలకు రేణుక నవ్వుతూ సిగ్గుపడుతూ తల వంచుకున్నది.

9pe

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Hacklinkbetsat
betsat
betsat
holiganbet
holiganbet
holiganbet
Jojobet giriş
Jojobet giriş
Jojobet giriş
casibom giriş
casibom giriş
casibom giriş
xbet
xbet
xbet
grandpashabet
grandpashabet
grandpashabet
İzmir psikoloji
creative news
Digital marketing
radio kalasin
radinongkhai
gebze escort
casibom
casibom
extrabet giriş
extrabet
sekabet güncel adres
sekabet yeni adres
matadorbet giriş
betturkey giriş
casibom
casibom
casibom
tiktok video indir
Türkçe Altyazılı Porno
grandpashabet bonuslar
Casibom Giriş
deneme bonusu veren bahis siteleri
Deneme Bonusu Veren Siteler 2025
deneme bonusu veren siteler
grandpashabet
marsbahisgrandpashabet güncel girişligobetsetrabet
marsbahismarsbahismarsbahis