Karate Kalyani: ఎవరు విగ్రహం పెట్టినా ఊరుకునేది లేదు.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!
Karate Kalyani: ఎవరు విగ్రహం పెట్టినా ఊరుకునేది లేదు.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!
Karate Kalyani: ఎవరు విగ్రహం పెట్టినా ఊరుకునేది లేదు.. కరాటే కళ్యాణి కామెంట్స్ వైరల్!
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమయంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు, సభ్యులు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేయడం దారుణం అని అన్నారు. భగవంతునికి మానవ రూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సస్పెండ్ చేయడం సరికాదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
కరాటే కళ్యాణిని (Karate Kalyani) సస్పెండ్ చేయడం ద్వారా సినిమా పరిశ్రమ ఒక వర్గానికి చెందిందని అర్థం అవుతోందని వాళ్లు తెలిపారు. సస్పెన్షన్ ను వెనక్కు తీసుకోకపోతే హైదరాబాద్ లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఒక్కటై పోరాటం చేస్తామని వాళ్లు వెల్లడించడం గమనార్హం. ఆ తర్వాత కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను సీనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడూ కించపరచలేదని వెల్లడించారు.
తాను కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఆమె చెప్పుకొచ్చారు. కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదని ఆమె తెలిపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే వ్యాలిడిటీ కాదని సస్పెన్షన్ ఎలా చేస్తారని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. త్వరలోనే తనపై సస్పెషన్ ఎత్తివేస్తారనే ఆశ ఉందని ఆమె పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో తాను పోరాటం చేస్తానని కరాటే కళ్యాణి వెల్లడించారు.